– అమ్మలక్కల గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా!
– రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
వైసీపీ నాయకుల పిచ్చి పీక్స్ కు వెళ్తోందని, అమ్మలక్కల గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తానని రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు … వైసీపీ నాయకులు మామూలుగా మాట్లాడే పరిస్థితులు కనపడడంలేదు. వైఎస్ఆర్ బూతుల పార్టీ అని పార్టీ పేరు పెట్టుకోవాలి. కనీసం బూతులు మాట్లాడేవారైనా మీ పార్టీవైపు ఉండి మీకు సపోర్టు చేస్తారు. వైసీపీ నాయకులు పేటీయం కుక్కలు.
చంద్రబాబుతో ఏపీ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ అక్క అని సంబోధించడం తప్పు. హైదరబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని చిన్న పిల్లవాడినడిగినా చెబుతాడు. చంద్రబాబు అభివృద్ధి చేసిన హైదరాబాద్ లో సజ్జల కొడుకో, కూతురో, అక్క కొడుకో అక్క
కూతురో ఎవరో ఒకరు ఉద్యోగం చేసి ఉండకపోతే అప్పుడు సజ్జల రామకృష్నారెడ్డి మాట్లాడాలని ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు, ఎమ్మెల్యేలు, వారి పిల్లలు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఉద్యోగాలు చేయడానికి కారణం చంద్రబాబు చలువే. హైదరబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు చలువవల్లేనని కేసీఆర్ సైతం చెప్పారు.
పిల్లాకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బ. అమరావతి రింగ్ రోడ్డు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్క గురించి మాట్లాడుతారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసరనుకున్నాను. మొన్ననే తెలిసింది. సాక్షి పేపర్ లో ఒక ఉద్యోగి అని. బ్రోకరైజ్ చేసే ఓ ఉద్యోగి అని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాలుగున్నర లక్షల జీతమిచ్చి ప్రభుత్వ సలహాదారుడిగా పెడితే మీ అమ్మ, నీ అక్క అని కాకుండా మంచి పదాలు, ప్రవచనాలు ఎలా వస్తాయి? వస్తాయని మేం అనుకోవటంలేదు. వైసీపీ చేతకానితనం గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపైన వైసీపీ నాయకులు చిందులు తొక్కుతున్నారు.
ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఇండ్లల్లోని ఆడవారి గురించి మాట్లాడటానికి వైసీపీ నాయకులకు ధైర్యమెలావచ్చింది? మొన్నటివరకు నీ అమ్మా అని మాట్లాడారు, ఈరోజు నీ అక్క అని మాట్లాడారు. రేపు నాలుగున్నర లక్షలు జీతం పడగానే నీచెల్లి, నీ తల్లి అని మాట్లాడుతారు. అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, ఆడబిడ్డల్ని అమ్మనాబూతులు తిట్టించడానికే సజ్జలను, నానీని పెట్టుకున్నట్లున్నారు. అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారు. మీ హయంలో రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యేల ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడలేదు.
ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడాము. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేపట్టే స్థితి వచ్చిందంటే మీ దౌర్భాగ్యం. చంద్రబాబు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలిగానీ నీ అక్క, నీ చెల్లి అని మాట్లాడమేంటి? మరోసారి ఆడవారి గురించి మాట్లాడితే మీ ఇళ్లకొచ్చి మీ ఇళ్లపై దాడి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నామని తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు.