– జేపీ వెంచర్ పేరుతో ఇసుక రీచ్ లను కొల్లగొడుతున్నారు
– మద్యంతో వచ్చిన అక్రమ సంపాదన కంటైనర్లలో తాడేపల్లికి చేరుతోంది
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టం ఎక్కువని చంద్రబాబు నాయుడు మాట్లాడితే నిన్నటి నుండి వైసీపీ నుండి సమాధానం రాలేదు. రాష్ట్ర ప్రతినిధుల సభలో చంద్రబాబు మాట్లాడిన దానిపై వైసీపీ సమాధానం ఇవ్వలేదు. ఆధారాలు లేకుండా మాట్లాడతున్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఏ అంశంపైన మేము ఆధారాలు లేకుండా మాట్లాడామో చెప్పండి.?
మద్యం దుకాణాలల్లో కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు.? పేటీఎం, పోన్ పే, క్రెడిట్ కార్డు తీసుకోవడం లేదు.? రోడ్డు పక్కన కూర గాయల బండి వాళ్లు కూడా పోన్ పే లో పెట్టుకుంటున్నారు. మీ మద్యం దుకాణాల్లో క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు.? సాయంత్రానికి నల్లడబ్బు కంటైనర్లలో తాడేపల్లికి చేరకోవాలి. ఆన్ లైన్ పేమెంట్ చెల్లిస్తే మీకు నల్లడబ్బురాదని క్యాష్ మాత్రమే తీసుకుంటున్నది వాస్తవం కాదా.? సోలార్ ప్రాజెక్టు గతంలో కర్నూల్ లో పెడితే అసలు సోలార్ అవసరం లేదని అన్నారు. అనవసరంగా పీపీఏలో చేస్తున్నారు, అవినీతి అని మాట్లాడారు.
సోలార్ టెండర్లకు సంబందించి ఎవరో శిరిడి సాయి కంపెనీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి బినామి. శిరిడి సాయి కంపెనీకి ఉన్న అనుభవం ఏంటి.? సిండికేట్ గా ఏర్పడి సోలార్ విద్యుత్ పేరుతో దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా.? జేపీ వెంచర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్ లను కొల్లగొడుతున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో రాజమండ్రిలో ఆవభూములల్లో జరిగిన అవినీతి సంగతి ఏంటి.? బూతుల మంత్రి చూస్తున్న పౌరసరఫరాల శాఖలో జరుగుతన్న అవినీతి ఏంటి.? కాకినాడ పోర్టు ఆదారంగా బియ్యం స్కాం జరుగుతోంది. గోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం దొరకడం లేదా.? జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయ భాను బియ్యం స్కాం ఆధారాలతో బయటపెట్టాం.
దేశంలో ఎక్కడ మత్తు పదార్థాలు గురించి చర్చ జరిగినా మూలం ఏపీ అని వినబడుతోంది. విజయవాడలో మత్తు బిల్లలు తయారవుతున్నాయి. తమిళనాడు పోలీసులు తనిఖీలో బయటపడ్డారు. గంగవరం పోర్టును తెగనమ్మారు. మారిటైం బోర్టులోని రూ.12 వందల కోట్లను దారి మళ్లించారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో దోచుకు తింటున్నారు. గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని దొంగ పేర్లు సృష్టించి దోచుకుంటున్నారు. అమరావతి ఔటర్ రింగ్ పై సజ్జల ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు. రాజధానికి విజన్ తో చంద్రబాబు రింగ్ రోడ్డు ఉండాలని ప్రణాళిక సిద్ధం చేయడం తప్పా.?
హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ తీర్చి దిద్దింది వాస్తవం కాదా.? రింగ్ రోడ్డుకు ముంద, తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో అందరం చూల్లేదా.? విభజన తర్వాత రాష్ట్రానికి ఔటర్ రింగ్ ఉండాలని 189 కి.మీ డిజైన్ రూపొందించి కేంద్రాన్ని ఒప్పించి 17 వేల కోట్లు మంజూరు చేయిస్తే నేడు ఆ ప్రాజెక్టును కాందంటున్నారు. ఇదే మాట పార్లమెంట్ లో కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. భూమి రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే ఔటర్ రింగ్ రోడ్ అనుమతికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ వద్దు 78 కిమీ బైపాస్ చాలని అన్నారు. దీనికేం సమాధానం చెప్తావు సజ్జల.?
పక్కనున్న తెలంగాణలో అదనంగా 364 కి.మి ఔటర్ రింగ్ కు అనుమతి తెచ్చకున్నారు. కానీ జగన్ వల్ల వచ్చిన ఔటర్ రింగ్ కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు..బైపాస్ కు తేడా తెలీదు. ఓబులా పురం మైనింగ్ కంపెనీతో సజ్జల సోదరుడు ప్రభాకర్ రెడ్డి కు చెందిన వెబ్ గోల్ ఎంటర్ ప్రైజెస్ తో ఒప్పందం చేసుకుంది వాస్తవం కాదా.? అక్కడున్న వనరులు కొల్లగొట్టి ఇతర దేశాలకు డబ్బులు మళ్లించి ఆడబ్బును జగతి పబ్లికేషన్ కు పెట్టింది వాస్తవం కాదా.? సజ్జల చరిత్ర, జగన్ చరిత్ర అందరికీ తెలుసు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే చరిత్ర అంతా మాదగ్గర ఉంది.
రాష్ట్రంలో ఏ అభివృద్ధి కనబడుతోంది. ఓ ప్రముఖ దినపత్రిక రోడ్ల గురించి పరిశీలన చేస్తే 257 కి.మీ పరిశీలిస్తే 7010 గుంతలు కనబడ్డాయి. ప్రతి కి.మీ 24 గుంతలు ఉన్నాయి. 1051 గుంతలు 10 సెం.మీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇదీ మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. గతంలో ఎన్ని రోడ్లు వేశారో తెలుసుకుంటే..నేడు ఎన్ని గుంతలు ఉన్నాయో లెక్కబెట్టుకునే పరిస్థితి ఉంది.