Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది

• ఒకవైపు తన అవినీతి కేసులు.. మరోపక్క ప్రజల ఛీత్కారాలతో ముఖ్యమంత్రి నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాడు
• తనపై ఉన్న అవినీతి కేసులకు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో జగన్ అండ్ కో బెంబేలెత్తుతున్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్ , మాజీ మంత్రి పరసా రత్నం

జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైందని… ఒక వైపు ప్రజల ఛీత్కారాలు…మరోవైపు వెంటాడుతున్న తన అవినీతి కేసులతో ముఖ్యమంత్రి స్థానంలో ఉండీ, భయభయంగా నిద్రలేని రాత్రుళ్లతో నరకయాత న అనుభవిస్తున్నాడని.. ఆ కేసులకు సంబంధించి తాజాగా వచ్చిన కోర్టు నోటీసులతో జగన్ రెడ్డి అండ్ కో బెంబేలెత్తుతు న్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ చైర్మన్ మొహమ్మద్ షరీఫ్ ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన, మాజీమంత్రి పరసారత్నంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..!

“గతంలో తండ్రి అధికారంతో లక్షకోట్ల ప్రజలసొమ్ము కొల్లగొట్టిన జగన్ రెడ్డి, సీబీఐ..ఈడీ విభాగాల దర్యాప్తులో దోషిగా నిరూపించబడి, 16నెలులు జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చాడు. తన తప్పుల్ని.. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తగుదనమ్మా అంటూ ప్రజల్లోకి వచ్చి, ఒక్క ఛాన్స్ అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. నాలుగున్నరేళ్ల పాలనలో తన సహచరులు.. గతంలో తనదోపిడీకి సహకరించినవారితో కలిసి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రజలసొమ్ము కొల్లగొట్టాడు.

తెలంగాణ హైకోర్టు తనతోపాటు..తన సహచరులు..దోపిడీ భాగస్వాములైన 41 మందికి ఇచ్చిన నోటీసులపై జగన్ రెడ్డి నోరు విప్పాలి
జగన్ రెడ్డి అక్రమాస్తులు.. అవినీతి కేసుల విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి తాజాగా నోటీసులు అందాయి. జగన్ రెడ్డి సహా అతని దోపిడీలో భాగస్వాములైన విజయసాయి రెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డి… వాసుదేవరెడ్డి సహా 41 మందికి న్యాయస్థానం నుంచి తాఖీదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై ముఖ్యమంత్రి, ఇతరులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం.

నాలుగున్నరేళ్లలో ప్రజలసొమ్ముని..రాష్ట్ర సంపదని జగతి పబ్లికేషన్స్.. భారతి సిమెంట్స్.. మంత్రిపెద్దిరెడ్డి కంపెనీ.. రాంకీ గ్రూప్.. అరబిందో వంటి సంస్థలకు జగన్ రెడ్డి అప్పనంగా దోచిపెట్టాడు
తండ్రి అధికారంతో దోచింది చాలక.. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి చేసిన దోపిడీ తో రాష్ట్రం..ప్రజలు అప్పులఊబిలో కూరుకుపోయారు. ప్రజల సొమ్మును ప్రకటన ల రూపంలో జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక, ఛానెల్)కు దోచిపెట్టడం మొదలు , ప్రభుత్వ పనులకు అవసరమైన సిమెంట్ కాంట్రాక్టులను భారతి సిమెంట్స్.. దాల్మియా సిమెంట్స్ కు అప్పగించడం వంటి పనులు జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అలానే గతంలో తన అవినీతికి సహకరించి.. అన్ని విషయాల్లో తన తోడునీడగా నిలిచిన విజయసాయి రెడ్డి లాంటి వారికి కూడా జగన్ ఈనాలుగేళ్లలో చేయాల్సిన న్యాయం చేశాడు.

104-108 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్ట్ ను విజయసాయి సంస్థ అయిన అరబిందోకు అప్పగించాడు. రామాయపట్నం..కాకినాడ సెజ్ పోర్టుల్ని కూడా అరబిందో పరం చేశాడు. రాంకీ గ్రూప్ వారికి కోవిడ్ సమయంలో ఇంజక్షన్లు..మందులు సరఫరా చేసే బాధ్యతలు అప్పగించాడు. విద్యుత్ శాఖ టెండర్లలో నిబంధనలకు నీళ్లొదిలి మరీ .. విద్యుత్ కొనుగోళ్ల బాధ్యతలు..ట్రాన్స్ ఫార్మర్లు…స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టుల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థకు.. తన బినామీలకు చెందిన సంస్థలకు (షిరిడీసాయి ఎలక్ట్రికల్స్) కట్టబెట్టాడు.

పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే నెపంతో..పేదల భూముల్ని వైసీపీనేతలతో తక్కువ ధరకు కొనిపించి, ప్రభుత్వసొమ్ముని ఎక్కువ మొత్తంలో వారికి దోచిపెట్టి.. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. మద్యం టెండర్లు.. డిస్టిలరీలు, దుకాణాల నిర్వహణ.. మద్యం సరఫరాను కూడా జగన్ రెడ్డి తన మంత్రులు.. వైసీపీనేతలు..కార్యకర్తలకే అప్పగించారు.

ఆ విధంగా వైసీపీ నేతలే మద్యం అమ్మకాలతో రూ.26 వేలకోట్లు గడించారని స్వయంగా కేంద్రంలో ఉన్న బీజేపీయే చెబుతోంది. ఈ విధంగా తాను… తన ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాగించిన దోపిడీపై జగన్ రెడ్డి నోరువిప్పకుండా ప్రజల్ని మోసపు మాటలతో నమ్మించి మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు వాస్త వాలు గ్రహించి.. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి.. అతని పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పా లి.” అని షరీఫ్ స్పష్టంచేశారు.

తన అవినీతి దోపిడీకి సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన నోటీసులపై జగన్ రెడ్డి అతని సహచరులు నోరు విప్పాల్సిందే : పరసా రత్నం
“ జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం.. వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షాల పై నిందలేయడానికి వేటకుక్కల్లా వెంపర్లాడుతున్నారు. తమ నాయకుడి అవినీతిపై మాత్రం తేలుకుట్టిన దొంగల్లా కామ్ గా ఉంటున్నారు. జగన్ రెడ్డి అధికారం చేతిలో పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, తనపై ఉన్న అవినీతి కేసుల విచారణకు హాజరుకాకుండా కుంటిసాకులు చెబుతూ న్యాయస్థానాల్ని మోసగిస్తున్నాడు.

వైసీపీ ఎంపీ రఘురామరాజు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం తో మరోసారి జగన్ అవినీతికేసుల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిం ది. రఘురామ పిటిషన్ పై స్పందించి తెలంగాణ హైకోర్టు తనకు పంపిన నోటీసుల పై జగన్ రెడ్డి..విజయసాయిరెడ్డి తదితరులు ఎందుకు నోరువిప్పడం లేదు? కోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే జగన్ రెడ్డి అతని అవినీతి సహచరు లు కచ్చితంగా న్యాయస్థానం ఆగ్రహం చవిచూడక తప్పదు.

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ రాష్ట్రాన్ని లూఠీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇసుక, మద్యం, భూములు సహా ప్రకృతివనరుల్ని కూడా కొల్ల గొడుతూ, తన ఖజానా నింపుకునే పనిలో ఉన్నాడు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అక్రమంగా క్వార్ట్జ్ మెటల్ దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీని స్థానిక టీడీపీనేతలు ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ లభించే ప్రకృతి సంపదను దోచేసే పనిలో జగన్ రెడ్డి.. మంత్రులు..వైసీపీనేతలు తీరికలేకుండా ఉన్నారు. జగన్ రెడ్డి అవినీతి.. దోపిడీ దాచాలంటే దాగేదికాదు.. ఇప్పటికే అది విశ్వవ్యాప్తమైంది.” అని పరసా రత్నం తెలిపారు.

LEAVE A RESPONSE