• నాలుగేళ్లలో పోలవరంలో అరంగుళం పనులుకూడా చేయించలేదు కాబట్టే, జగన్ రెడ్డి ప్రతిపక్షాలను, ప్రజల్ని, మీడియాను ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతించడంలేదు
• చంద్రబాబుహాయాంలో 72శాతం పూర్తైన పోలవరాన్ని , కమీషన్లకక్కుర్తి, అసమర్థతో ప్రశ్నార్థకంగా మార్చిన ద్రోహిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు
• పోలవరంలో కుంగింది గైడ్ బండ్ కాదు.. రాష్ట్రపరువు ప్రతిష్టలు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, 980మెగావాట్ల విద్యుత్ అందించే గొప్పప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని, టీడీపీప్రభుత్వం సమర్థవంతంగా నిర్మిస్తే, జగన్మోహన్ రెడ్డి రాకతో దానినిర్మాణం కలగా నే మిగిలే దుస్థితి ఏర్పడిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహే శ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వాసితులకు అందాల్సిన సాయాన్ని అప్పటి కాంగ్రెస్ దళారులు తినేశారు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలన్న ధృఢసంకల్పంతో తెలంగాణపరిధిలోని ఏడు ముంపుమండలాలను ఏపీలో కలపాలని కేంద్రాన్ని కోరి, పట్టుబట్టి సాధించారు.
అదేసమయంలో గతప్రభుత్వాలు ఆ ఏడుగ్రామాల్లోని నిర్వాసితులకు చేసిన అన్యాయాన్ని ఆయన చక్కదిద్ది, వారిజీవితాల్లో వెలుగులునింపారు. ప్రాజెక్ట్ పరిధి లోని ఒక్కనిర్వాసిత కుటుంబం రోడ్డునపడకుండా సకాలంలో పరిహారం అందించి, వారికి అధునాతన హంగులతో ఇళ్లునిర్మించారు. పరిహారం కింద రూ.1150కోట్లు వా రి బ్యాంక్ ఖాతాల్లో జమఅయ్యేలా చూశారు.
రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కూడా జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ లో విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టేయడానికి నిర్మాణసంస్థ ప్రతినిధులతో బేరసారాలు ఆడాడు
టీడీపీప్రభుత్వంలో 1440మీటర్లు వరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంజరిగింది. గోదావరి గర్భంలోకివెళ్లి, అక్కడున్న కొండరాయిపై నిర్మాణంచేపట్టి, రికార్డుస్థాయిలో రూ.450 కోట్లతో జర్మీనికిచెందిన బావర్, ఎల్ అండ్ టీ సంస్థలు డయాఫ్రమ్ వాల్ ను నిర్మించా యి. జగన్మోహన్ రెడ్డి తొలిసారి పోలవరంపై సమీక్షచేసినప్పుడు ఆర్ అండ్ ఆర్ కి సం బంధించి నిర్వాసితులకు ఇళ్లనిర్మాణం జరుగుతోందని, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మొదలెడతామని అధికారులు చెప్పారు.
ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇచ్చినిర్వాసితులకు న్యాయంచేస్తే, సాంకేతిక కార ణాలవల్ల అప్పర్ కాపర్ డ్యామ్ లోని గ్యాప్స్ ను పూర్తిచేస్తామని, లోయర్ కాపర్ డ్యామ్ ఎత్తుపెంచుతామని, తరువాత ఈ.సీ.ఆర్.ఎఫ్ డ్యామ్ పనులు జరుగుతాయిని అధికారులు క్లియర్ గాచెప్పారు. ఆనాడు అధికారులుచెప్పిందానికి తలూపిన జగన్ రెడ్డి, తాడేపల్లి వచ్చి, పనులుచేస్తున్న సంస్థల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించాడు. ముఖ్య మంత్రి నిర్ణయాన్ని పోలవరంప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తీవ్రంగా ఖండించిది. కేంద్రానికి లేఖకూడా రాసింది.
రివర్స్ టెండరింగ్ చేస్తే పోలవరం నిర్మాణంలో వచ్చే ఇబ్బందుల కు గతంలో పనిచేసిన సంస్థలు సమాధానంచెబుతాయా…కొత్తగావచ్చిన సంస్థలు చెబుతాయా అని కూడా ప్రశ్నించింది. జాతిగర్వపడే జాతీయప్రాజెక్ట్ నిర్మాణం నిలిచిపో వడం మంచిదికాదని పీపీఏ నెత్తీనోరు కొట్టుకొని చెప్పింది. కానీ జగన్ రెడ్డి మూర్ఖుడు కాబట్టి, తాను అనుకున్నదే చేశాడు. పోలవరంలోని పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో స్పిల్ వే పనులు, ఈ.సీ.ఆర్.ఎఫ్ డ్యామ్ పనులుచేస్తున్న సంస్థల్ని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రీక్లోజర్ లో పెట్టింది.
కేంద్రమాజీమంత్రి అల్లుడు, ఒక ఐ.ఏ.ఎస్ అధికారిసమక్షంలో జగన్మోహన్ రెడ్డి పోలవరంప్రాజెక్ట్ నిర్మాణంలోఉన్న సంస్థను వెయ్యికోట్లు డిమాండ్ చేశాడు. తనతండ్రి చనిపోయిన సందర్భంలో జగన్ రెడ్డి అలా అడగడంపై చాలామంది నివ్వెరపోయారు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రిఅయ్యాక, ప్రాజెక్ట్ వ్యయం 2వేలకోట్లుపెంచి, మరలాటెండర్లు పిలిచారు. జగన్ రెడ్డి పవర్ ప్రాజెక్ట్ ని కొట్టేయాలని చూసి, నిర్మాణసంస్థల్ని భయపెట్టి, పనులుఆగిపో యేలా చేయడంవల్లే ప్రాజెక్ట్ వ్యయం రూ.2వేలకోట్లు పెరిగింది.
జగన్ రెడ్డి ఆడిన రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, తానుఅనుకున్నసంస్థకు రూ.3,500కోట్లు ఎక్కువకు పనులుకట్టబెట్టాడు
జగన్మోహన్ రెడ్డి ఆడిన రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఒకేఏజెన్సీకి ఒకే టెండర్ని కట్ట బెట్టాడు. రూ.200కోట్లు ఆదాచేస్తున్నానని చెప్పి, రూ.3,500కోట్లు ఎక్కువకోట్ చేసిన సంస్థకు పనులుకట్టబెట్టాడు. ఆ సంస్థకు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అనుభవంలేదు. అనుభవంలేని సంస్థ నిర్వాకంతో పోలవరంప్రాజెక్ట్ లో టీడీపీప్రభుత్వం నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్ట్ లో గోదావరిలో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది.
సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరంప్రాజెక్ట్ అథారిటీ గుర్తించేవరకు జగన్మోహన్ రెడ్డి గానీ, బుల్లెట్లు దింపుతానని వీరంగం వేసిన అప్పటిరాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఎవరూ గు ర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తితో పోలవరంప్రాజెక్ట్ ని, దానిలోని జలవిద్యుత్ ప్రాజెక్ట్ ని పూర్తిగా నాశనంచేశాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్రప్రభు త్వం చెప్పినా వినకుండా జగన్ రెడ్డి మూర్ఖంగా ముందుకెళ్లి, కొత్తగా పనులు అప్పగిం చిన సంస్థ, 15నెలలవరకు ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు.
జగన్ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలు, అహంభావి అనాలోచితచర్యలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరలా ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ అంటే అమరావతి పోలవరంగా భావిం చి, చంద్రబాబు రెండునిర్మాణాలను శరవేగంగా జరిగేలాచూశారు రాజధానిని, పోలవ రాన్ని రెండుకళ్లుగా భావించి, వాటినిర్మాణాలు పూర్తయితే రాష్ట్రరూపురేఖలు మారిపో తాయని శ్రమించారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ ఆశల్ని అడియాశలుగా మార్చి, రాష్ట్రా న్ని నాశనంచేసింది. జగన్ పాలనలో పోలవరం నిర్వాసితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి.
పోలవరంలో జగన్ రెడ్డి అరంగుళం పనిచేయించలేదు కాబట్టే, చంద్రబాబుసహా, మీడియాను కూడా అక్కడికి అనుమతించడంలేదు
2020 డిసెంబర్, 2021 జూన్ కి పోలవరం పూర్తిచేస్తాము.. బుల్లెట్ దింపుతాము అన్న అనిల్ కుమార్ ఇప్పుడేం సమాధానంచెబుతాడు? అతనితర్వాత ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలుచేపట్టిన సంబరాల రాంబాబుకి అసలు ప్రాజెక్ట్ గురించే తెలియదు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాక రెండేళ్లవరకు ఈ ప్రభుత్వం జర్మనీకంపెనీని ఎందుకు డ్యామ్ సైట్ లోకి ఎందుకు అనుమతించలేదు? చంద్రబాబు, టీడీపీనేతలు ప్రాజెక్ట్ చూ డటానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులతో ఎందుకు అడ్డుకున్నాడు? నన్ను అరెస్ట్ చేయించి బుట్టాయిగూడెంలో ఎందుకు నిర్భంధించాడు? పోలవరం నిషేధిత ప్రాం తమా? చంద్రబాబుహాయాంలో పోలవరంసందర్శనకు ప్రజల్ని అనుమతించారు. వారం వారం జరిగినపనుల్ని, జరుగుతున్న పనుల్ని ఎప్పటికప్పుడు రాష్ట్రానికి తెలియచేశా ము. పారదర్శకంగా, సమర్థవంతంగా పనులు జరిపంచారుకాబట్టే, చంద్రబాబు అన్ని విషయాలు ప్రజలముందు ఉంచారు. పోలవరం కుడికాలువలో పట్టిసీమ లిఫ్ట్ పెట్టి, 44వేలకోట్లవిలువైన పంటఉత్పత్తుల్ని కాపాడి, కృష్ణాజలాలను చిత్తూరువరకు నడిపిం చారు. అదేనీటితో పులివెందులనియోజకవర్గంలోని చీనీతోటల్ని కాపాడారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా రైతులకు న్యాయంచేయాలని చంద్రబాబు తపించారు. అలాంటిపట్టిసీమను కూడా జగన్ రెడ్డి, అతనిచెంచాలు అవహేళనచేశారు.
చంద్రబాబు ఇచ్చిన నీటితోనే జగన్ రెడ్డి కూడా తనభూముల్లోని చీనీతోటల్ని కాపాడు కున్నాడు. నీళ్లులేక గతంలో ఎన్నోఇబ్బందులుపడిన రాయలసీమ రైతాంగం చంద్రబాబు నిర్మించిన పట్టిసీమవల్ల గర్వంగా తలెత్తుకొని వ్యవసాయంచేస్తున్నారు. జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాగునీటిరంగంలో అంగుళం పనులు చేయలేదు. పోలవరంలో అరంగుళం పనిచేయించలేదుకాబట్టే, దాని సందర్శనకు ఎవరినీ వెళ్లనీయడంలేదు.
పోలీసుల్ని అడ్డుపెట్టి ఆఖరికి మీడియాను కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. జగన్ నాలుగేళ్లలో పట్టిసీమ పంపుల్ని బూజుపట్టించాడు. పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ని కోర్టువివాదాల్లోనే ముంచేశాడు. పోలవరం ఎడమకాలువలో తట్టమట్టి ఎత్తలేదు. ఉత్తరాంధ్రసుజలస్రవంతి మరలాటెండర్లు అని చెప్పి ఎక్కడిపనులుఅక్కడే ఆపేయించా డు. పోలవరం నిర్మాణానికి రూ.12వేలకోట్లు, రూ.17వేలకోట్లు వచ్చాయని, కేంద్రం ఇచ్చేసిందని తనమీడియాలో దుర్మార్గంగా ప్రచారం చేయించాడు. 150 అడుగులు నీళ్లు నిల్వఉంచాల్సిన డ్యామ్ ను 135అడుగులకే ఎందుకు పరిమితంచేశాడు?
రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా.. పులిచింతల డ్యామ్ గేట్ కొట్టుకుపోతే సంవత్సరంన్నర నుంచి బిగించలేని అసమర్థుడు అంబటి
నాలుగేళ్లలో ఎంతమంది పోలవరం నిర్వాసితులకు జగన్ రెడ్డి న్యాయంచేశాడు. రాష్ట్రం లో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? పులిచింతల డ్యామ్ గేట్ కొట్టుకపోతే, సంవత్సరంన్నర నుంచి దాన్ని పెట్టిన దిక్కులేదు. చేతగానిదద్దమ్మలు నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్ప, ఎక్కడా ఏమీచేసిందిలేదు. పులిచింతల డ్యామ్ కు గేట్ పెట్టకపోవడానికి కారణం ఇసుకతవ్వకాలకోసమే. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు కూడా అందుకే గేట్ పెట్టలేదు. అన్నమయ్యప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోతే ముఖ్యమంత్రి ఏంచేశాడు? కడపజిల్లాలోని ప్రజలకే న్యాయంచేయలేని ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఏంచేస్తాడు?
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కేంద్రమంత్రి షెకావత్ ఏపీప్రభుత్వానికి చీవాట్లుపెట్టాడు.
జగన్ రెడ్డి నిర్వాకంతో ఇప్పుడు పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని కేంద్రం ఆలోచిస్తోంది. పోలవరంద్రోహులుగా జగన్ రెడ్డి, అతనిపార్టీవారు చరిత్రలో నిలిచిపోతారు. ఇసుకఅమ్ముకోవడానికి ప్రాజెక్ట్ లని, డ్యామ్ లని గాలికివదిలేసిన దుర్మార్గుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. రూ.1500కోట్లు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు. కడపజిల్లాలోని మల్లిఖార్జున రెడ్డికంపెనీకి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటివాళ్లకు రూ.1500కోట్లు దోచిపెట్టాడు. వారిద్వారా రేపు జరగబోయేఎన్నికలకోసం జగన్ రెడ్డి, ఇప్పుడే డబ్బులుపంపింగ్ చేస్తున్నాడు.
ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల్ని కలిశాక ఢిల్లీలో మీడియాతో మాట్లాడటానికి జగన్ రెడ్డికి ఎందుకంత భయం?
నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఎన్నిప్రాజెక్ట్ లు నిర్మించాడు… వాటిపరిధిలో ఎన్నినిర్వాసిత కుటుంబాలకు న్యాయంచేశాడు? పోలవరంలో ఎంత శాతం పనిచేయించాడు? జగన్ చెప్పుకోవడానికి ఒక్క లిఫ్ట్ ఇరిగిషన్ స్కీమ్ కూడా పూర్తిచేయలేదు. ఇదిగో ఈ పని చే సి, ఇన్నిఎకరాలకు నీళ్లిచ్చానని జగన్ రెడ్డి ప్రజల ముందుకొచ్చి చెప్పగలడా అని బహి రంగసవాల్ చేస్తున్నా. చంద్రబాబు హాయాంలో ఫైనల్ అయిన డీపీఆర్-2ని కేంద్రంతో ఆమోదింపచేయించుకోలేని అసమర్థుడు జగన్ రెడ్డి. 49నెలలుగా గడ్డీపీకడం తప్ప జగన్ రెడ్డి కేంద్రప్రభుత్వసాయంతో రాష్ట్రానికి సాధించింది శూన్యం. పోలవరంనిర్మాణా నికి జగన్ రెడ్డి ఏంసాధించాడు?
జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, తాను ఢిల్లీ లో మీడియాతో మాట్లాడి, ప్రధానమంత్రితో, కేంద్రమంత్రులతో చర్చించిన విషయాలు బయటపెట్టాలి. ముఖ్యమంత్రి అయిన మొదటిసంవత్సరం కేంద్రప్రభుత్వానికి ఏకాగితం (విజ్ఞాపన పత్రం) ఇచ్చాడో, ఇప్పుడు అదేఇస్తున్నాడు.
తండ్రివిగ్రహం పెట్టడానికి రూ.350కోట్లుకేటాయించిన జగన్ రెడ్డి, నిర్వాసితులకు నాలుగేళ్ల లో రూ.3కోట్లు కేటాయించ లేదు
పోలవరంలో కుంగింది గైడ్ బండ్ కాదు జగన్ రెడ్డి.. నీ ప్రభుత్వ పరువు ప్రతిష్టలు జారాయి. నీ చేతగానితనం ప్రజలకు అర్థమైంది. మీ అయ్యవిగ్రహం పెట్టడానికి రూ.350కో ట్లుకేటాయించిన జగన్ రెడ్డి, ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసితుల్ని కాపాడటానికి రూ.3 కోట్లు కేటాయించలేదు. సిగ్గులేకుండా ఇంకా విగ్రహాలు పెడతాను.. ఫైవ్ స్టార్ హోటళ్లు కడతానని కబుర్లుచెబుతున్నాడు. పోలవరంప్రాజెక్ట్ ఆగిపోయిన పాపం జగన్ దే. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎందుకుప్రయోగాలు చేశాడో, వాటితో ఏంసాధించాడో ప్రజలకు సమా ధానంచెప్పాలి. గైడ్ బండ్ కుంగిపోవడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
వెదిరే శ్రీరామ్ నేత్రత్వంలో కేంద్రజలశక్తిమంత్రి ఎందుకు కమిటీవేశారు? ఆకమిటీ పోల వరం సందర్శనకువస్తే, తనబాగోతం బయటపడుతుందని జగన్ రెడ్డి భయపడుతు న్నాడు. పోలవరం ఎత్తుతగ్గింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి అంబటి, అంతకుపనిచేసిన అనిల్ కుమార్ ఎవరూ ఖండించలే దు? ఎందుకంటే అప్పటికే కేసీఆర్ నుంచి తనకు రావాల్సిన దాన్ని జగన్ రెడ్డి పుచ్చు కున్నాడు కాబట్టి.
డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో ఏర్పడిన గుంతల్ని ఇసుకతో పూడ్చివే సి బిల్లులచేసుకొని వెయ్యకోట్లు తినేయడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు. ప్రాజెక్ట్ పరి ధిలో జరిగే పనులుచూడటానికి చంద్రబాబు, ఇతరపార్టీల నేతల్ని జగన్ రెడ్డి ఎందుకు అనుమతించడంలేదు? మీడియాపై ఎందుకు ఆంక్షలుపెడుతున్నాడు? తనబతుకు బండారం బయటపడుతుందన్నభయంతోనే జగన్ రెడ్డి ఎవరినీ డ్యామ్ సైట్ వద్దకు వెళ్లనివ్వడంలేదు.” అని దేవినేని తేల్చిచెప్పారు.