Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఎస్సీ ఎస్టీలకు అమలు చేసిన 26 పథకాల్ని జగన్ తక్షణమే పునరుద్ధరించాలి

• సబ్ ప్లాన్ గడువు పొడిగింపుకాదు…దాని అమలుని అపహాస్యం చేయడం జగన్ ప్రభుత్వం మానుకోవాలి
• సబ్ ప్లాన్ అమలుపై వైసీపీప్రభుత్వ తీరు ఎస్సీఎస్టీలకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది
• ఎస్సీఎస్టీలకు జగన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. టీడీపీప్రభుత్వం కేటాయించినట్లు జనాభాప్రకారం బడ్జెట్లో నిధులు ఇవ్వడంలేదు
• చంద్రబాబు ప్రత్యేకంగా ఎస్సీఎస్టీలకు అమలుచేసిన 26పథకాల్ని రద్దుచేశాడు
• టీడీపీప్రభుత్వం సబ్ ప్లాన్ నిధుల్ని ఎస్సీఎస్టీల సంక్షేమానికి, వారిఅభివృద్ధికే వెచ్చిస్తే, జగన్ వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు
– టీడీపీ హెచ్.ఆర్.డీ చైర్మన్ బీ.రామాంజనేయులు

చట్టబద్ధత కలిగిన ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ అమలు విషయంలో జగన్ ప్రభుత్వతీరు, ఆయావర్గా లకు తీవ్ర భయాందోళన మిగిల్చిందని, టీడీపీప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా 26పథకాలు అమలుచేస్తే, జగన్ రాగానే వాటిని రద్దుచేసి, ఎస్సీఎస్టీలపై తనకున్న అక్కసుని వెళ్లగక్కాడ ని టీడీపీ హెచ్.ఆర్.డీ ఛైర్మన్ బీ.రామాంజనేయులు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“వైసీపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ పునరుద్ధరించినందుకు ఎస్సీఎస్టీల్లో సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉంది. సబ్ ప్లాన్ చట్టబద్ధత, దానిఅమలుపై జగన్ ప్రభుత్వ వైఖరి ఆదినుంచీ ఎస్సీఎస్టీల్లో తీవ్ర భయాందోళనలే మిగిల్చింది. నవరత్నాల లబ్ధిదారుల్లో ఎస్సీఎస్టీలు ఉన్నారని సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లించడం ఆయావర్గాలకు ద్రోహం చేయడం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ,ఎస్టీల సంక్షేమం, వారి అభివృద్ధికోసమే కేటాయించాలన్న నిబంధనని జగన్ ప్రభుత్వం విస్మరించింది. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో టీడీపీప్రభుత్వం ఆయావర్గాలకు ప్రత్యేకంగా 26పథకాలు అమలుచేసింది. జగన్ అధికారంలోకి రాగానే అన్నీ రద్దుచేసి, దళిత, గిరిజనులపై తనకున్న అక్కసుని వెళ్లగక్కాడు. ఆఖరికి ద్విచక్రవాహనం ఉంద న్న సాకుతో, ఎస్సీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ కూడా నిలిపేసి 3లక్షల కుటుంబాల్లో చీక ట్లు నింపాడు. ఎస్సీఎస్టీలకు జనాభా ప్రకారం కూడా జగన్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం.

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీఎస్టీల సంక్షేమానికి, వారి అభివృద్ధికే వినియోగించాలనే నిబంధనని జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది ఏపీలో 16.4శాతం ఎస్సీలు ఉంటే, 2019 నుంచి ప్రతిసంవత్సరం బడ్జెట్లో కేటాయిం చిన నిధులు చూస్తే 13శాతం కూడా మించలేదు. ఎస్టీల జనాభా ఏపీలో 5.3శాత ముంటే, ఏటా కేటాయించిన నిధులు ఎప్పుడూకూడా 3.4, 3.5శాతానికి మించ లేదు. వైసీపీ ప్రభుత్వం కేటాయించాల్సిన రూ.4వేలకోట్ల నిధులు ఇవ్వకపోవడంవల్ల ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారు. ఈ విధంగా ఎస్సీఎస్టీలను అన్నివిధాలా వంచిస్తూ, వారికి తీరని అన్యాయం చేస్తున్న జగన్ ప్రభుత్వం, సబ్ ప్లాన్ గడువు పొడిగించినా ఉపయోగంలేదన్నదే ఆయావర్గాలు, వారిసంఘాల అభిప్రాయం. సబ్ ప్లాన్ సెక్షన్ 11 (A,B) ప్రకారం, సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ,ఎస్టీలకే వెచ్చించాలనే నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కింది.

సబ్ ప్లాన్ చట్టం సెక్షన్ 11-(C) లో ప్రభుత్వపథకాల్లో ఎస్సీఎస్టీల జనాభాప్రాతిపదికన సబ్ ప్లాన్ నుంచి ఆయావర్గాలకు నిధులు కేటాయించాలని ఉంది. 2013 చట్టప్రకారం 40శాతం నిధులు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి, మిగిలిన నిధులు ఎస్సీఎస్టీల సాధికార తకు ఉపయోగించాలనే నిబంధన ఉంది. సాధికారత అంటే ఎస్సీఎస్టీల ఉపాధి అవకాశాలు, వారి నివాసప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎన్నడూ అలాచేసిందిలేదు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీలసంక్షేమానికి 92శాతం, ఎస్టీలసంక్షేమానికి 86 నిధులు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఎస్సీలకు 50శాతం, ఎస్టీలకు 36శాతమే వెచ్చించింది. 2019కి ముందు సబ్ ప్లాన్ అమలుపై దళితసంఘాల్లో ఎలాంటి అనుమానం, ఆందో ళన లేవు. ఎస్సీలకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీకార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి, గతప్రభుత్వం మంచిపథకాలు అమలుచేసింది. భూమిలేని దళిత, గిరిజనులకోసం భూమికొనుగోలు చేసి పంచింది. వాహనాలు కొనివ్వడంతో పా టు, స్వయంఉపాధికై ఎస్సీఎస్టీలకు సబ్సిడీరుణాలు అందించి, వారికాళ్లపై వారు నిల బడి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. కానీ 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక సబ్ ప్లాన్ సెక్షన్ 11-(C) క్లాజ్ ని ఉపయోగించుకొని నవరత్నాల్లో ఎస్సీలబ్ధిదారుల సంఖ్యను బట్టి, సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించింది.

నిధుల కేటాయింపు ఎలాగూ తక్కువచేసిన ప్రభుత్వం, కేటాయించిన అరకొరనిధుల్ని కూడా ఆయావర్గాల ప్రయోజ నాలకోసం ఖర్చుచేయలేదు. 2014 నుంచి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం సరాసరిన ఎస్సీల సంక్షేమానికి 92శాతం నిధులు, ఎస్టీలకు 86శాతం నిధులు ఖర్చుపెట్టింది.ఈ ప్రభుత్వం మాత్రం ఎస్సీలకు 50శాతం, ఎస్టీలకు 36శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసింది. 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, అంతకుముందున్న ప్రభు త్వాల హాయాంలో కానీ ఎస్సీఎస్టీలు పొందిన ప్రయోజనాలు, వారికి కలిగిన లబ్ధి ఇప్పు డున్న ప్రభుత్వంలో లేదని చెప్పడానికి విచారిస్తున్నాం.

2014-18 మధ్యన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, 2,66,740 మంది లబ్ధిదారులకు రూ.3,795కోట్లని సబ్సిడీ రుణా ల రూపంలో కేటాయించారు. ఆ మొత్తం నిధులతో నాటి ప్రభుత్వం ఎస్సీ యువత వారికాళ్లపై వారు నిలబడేలా చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ని మూడు కార్పొరేషన్లు చేసిందికానీ, ఒక్క దళితయువకుడికి కూడా రూపాయి స్వయం ఉపాధి రుణం అందించలేదు. దళితవిద్యార్థులకు గతప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్యను అందించింది. అందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చుపెట్టింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కింద గతప్రభుత్వం 68,587 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.162కోట్లను సబ్ ప్లాన్ నుంచి ఖర్చుపెట్టింది.

గత ప్రభుత్వం ఆ విధంగా చేయడంతో ఎంతోమంది దళితయువకులు డాక్టర్లు, ఇంజనీర్లు కావడమేకాక, సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం రాగానే రద్దుచేసింది. విదేశీవిద్య పథకం కింద టీడీపీప్రభుత్వం 440 మంది దళిత యువతకు లబ్ధిచేకూర్చింది. ఆ పథకం కింద లబ్ధిపొందిన యువతీ యువకులు ఇప్పుడు నెలకు రూ.5లక్షల వేతనంతో ఎవరిపై ఆధారపడకుండా, మరికొందరికి ఉపాధి కల్పించేస్థాయికి వచ్చారు. ఐ.ఏ.ఎస్. ఐ.పీ.ఎస్ వంటి ఉన్నత విద్యను అభ్యసించేవారికి, ఉన్నతప్రమాణాలు గల సంస్థల్లో శిక్షణ ఇప్పించడం కోసం టీడీపీప్రభుత్వం ఎస్సీఅభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్షా20వేల నుంచి రూ.లక్షా50వేల వరకు ఖర్చుపెట్టింది. ఆ విధంగా 9,821 మందికి రూ.91కోట్లను గతప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు వెచ్చించింది.

వృత్తిపరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా 26,026 మంది ఎస్సీలకు ఉపాధికల్పించేందుకు రూ.58కోట్లు ఖర్చుపెట్టింది. ఎస్సీఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడం ఎప్పటినుంచో ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ద్విచక్రవాహనం ఉందన్న సాకుతో 2లక్షల నుంచి 3లక్షల ఎస్సీ కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.ఎఫ్.కే.ఎఫ్.డీ.సీ పథకా ల కింద దాదాపు 7,748మందికి రూ.320కోట్లు వెచ్చించి, టీడీపీప్రభుత్వం ఇన్నోవా కార్లు, పవర్ ఆటోలు, ట్రాక్టర్లు అందించింది. ఎస్సీలకు భూపంపిణీ కోసం భూమి కొను గోలు పథకంలో భాగంగా రూ.127కోట్లతో 2,386 మంది ఎస్సీలకు లబ్ధిచేకూర్చింది చంద్రబాబు ప్రభుత్వమే. నరేగా నిధులతో ఎస్సీల నివాసప్రాంతాల్లో రోడ్లు వేయడానికి వీల్లేని సందర్భాల్లో, రూ.260కోట్లతో 745 కిలోమీటర్ల సీసీరోడ్లు,రూ.589కోట్లతో 1225 కిలోమీటర్ల బీటీరోడ్లు వేయించిన ఘనత టీడీపీప్రభుత్వానిదే.

కొండలు, గుట్టల్లో నివసించే గిరిజన విద్యార్థులకోసం టీడీపీప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 35వేల మంది విద్యార్థులకు విద్యను అందించడం కోసం 5ఏళ్లల్లో రూ.82కోట్లు సబ్ ప్లాన్ నిధులు ఖర్చుపెట్టింది. 40 మంది గిరిజనయువతను విదేశీవిద్యలో భాగస్వాముల్ని చేసి, వారికోసం రూ. 3కోట్లు ఖర్చుపెట్టింది. సివిల్ కోచింగ్ శిక్షణార్థం 947 మంది గిరిజన యువతీయువకుల కోసం రూ.16కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. స్వయంఉపాధిలో భాగంగా, 2,13,650 మంది ఎస్టీయువతకు రూ.338కోట్లు ఖర్చుపెట్టింది. గిరిజనుల పొలాల్లో ఉచితంగా బోర్లువేయించి, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది. సోలార్ పంపుసెట్లద్వారా గిరిజనప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు అందించింది. భూమిలేని గిరిజనులకోసం రూ.2కోట్లు వెచ్చించి 88ఎకరాల భూమి కొని, 55మందికి అందించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడంతోపాటు, 1,31,000 మందిని కాఫీవిస్తరణ ప్రాజెక్ట్ లో భాగస్వాముల్నిచేసి, రూ.87కోట్లను సబ్ ప్లాన్ నుంచి ఖర్చుపెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ కింద టీడీపీప్రభుత్వం 85,608 గిరిజనులకు రూ.66కోట్లు ఖర్చుచేసింది. రూ.248కోట్లు వెచ్చించి గిరిజనులకు పాడిపశువులు, కోళ్లు కొనిచ్చింది.

టీడీపీ ప్రభుత్వం దళిత, గిరిజనులకు అమలు చేసిన 26 పథకాల్ని, జగన్ సర్కారు తక్షణమే పునరుద్ధరించాలి
ఈ ప్రభుత్వం వచ్చాక భూమికొనుగోలు పథకంసహా, చంద్రబాబు దళిత, గిరిజనులకు అమలుచేసిన పథకాలన్నింటినీ రద్దుచేసింది. గతప్రభుత్వం దళిత, గిరిజనులకు ఇచ్చిన 10వేల ఎకరాలను వారినుంచి బలవంతంగా లాక్కుంది. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీచేపట్టకుండా దళిత, గిరిజన యువత జీవితాల్ని జగన్ రెడ్డి నాశనంచేశాడు. ఈ ప్రభుత్వమే 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చింది. వాటిలో 45వేల నుంచి 60వేల బ్యాక్ లాగ్ పోస్టులున్నాయి. అవన్నీ భర్తీ చేయడంతో పాటు, సకాలంలో ఏటా డీఎస్సీ నిర్వహించి ఉంటే, ఎంతోమంది దళిత, గిరిజన యువతకు ప్రభుత్వఉద్యోగాలు వచ్చిఉండేవి. ఇలా గతప్రభుత్వం ఎస్సీఎస్టీలకు అమలుచేసిన అనేకపథకాల్ని రద్దుచేసిన జగన్ ప్రభుత్వం, అందరికీ అమలుచేసే నవరత్నాల్లో దళితులుకూడా ఉన్నారు కాబట్టి, సబ్ ప్లాన్ నిధులు వాటికోసం ఖర్చుపెట్టామని చెప్పడం దురదృష్టకరం. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఎస్సీఎస్టీలపై జగన్ సర్కార్ అట్రాసిటీ కేసులు పెట్టి, వేధింపులకు గురిచేస్తోంది. జగన్ ప్రభుత్వం దళిత, గిరిజనులకు తీరని అన్యాయంచేస్తూ, సబ్ ప్లాన్ గడువు పొడిగించామని చెప్పడంవల్ల ఎలాంటి ఉపయోగంలేదు. సబ్ ప్లాన్ సెక్షన్ 11 (A,B) ప్రకారం, సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ,ఎస్టీలకోసం మాత్రమే ఖర్చుచేయాలనే నిబంధనను కాదని, ఈ ప్రభుత్వం ఆనిధుల్ని దుర్వినియోగం చేస్తోంది. ఎస్సీలకు కేంద్రప్రభుత్వం అందించే 70 నుంచి 80 పథకాల్ని కూడా జగన్ ప్రభుత్వం నిధులివ్వలేదు. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 40శాతం నిధులు ఇవ్వకపోవడంతో ఎస్సీయువత తీవ్రంగా నష్టపోయింది.

రాష్ట్రప్రభుత్వం సకాలంలో తనవాటా ఇవ్వని కారణంగా 26 కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎస్సీలకు దూరమయ్యాయి. రాజ్యాంగం ద్వారా సబ్ ప్లాన్ చట్టబద్ధత ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు టీడీపీప్రభుత్వం అందించిన 26 పథకాల్ని జగన్ ప్రభుత్వం తక్షణమే పునరు ద్ధరించాలి. అన్నివర్గాలకు అందించే పథకాల్ని ఎస్సీఎస్టీలకు అందిస్తూ, సబ్ ప్లాన్ నిధుల్ని అందుకోసం వెచ్చించడమనే క్లాజ్ ను ప్రభుత్వం తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ,ఎస్టీలకు జనాభాప్రాతిపదికన నిధులు కేటాయించి, ఆ నిధుల్ని వారి ప్రయోజనాలకోసమే ఖర్చుపెట్టాలి. ఆ విధంగా ఖర్చుచేసేక్రమంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారుల్ని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు న్నాం. ఎస్సీఎస్టీలు వారికాళ్లపై వారు నిలబడి, గౌరవప్రదంగా నివసించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి” అని రామాంజనేయులు జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE