Suryaa.co.in

Andhra Pradesh

హిందూ సంప్రదాయాన్ని జగన్ కాపాడాలి

డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి ఆనందసూర్య

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతే స్వామి వారి దర్శనానికి వెళ్లాలి. జగన్ రెడ్డికి హిందూ ధర్మంపై, తిరుమల పవిత్రతపై ఏమాత్రం నమ్మకం ఉన్నా డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో ఎంతో మంది ప్రముఖులు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకున్నారు.

కానీ జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం తీవ్ర అభ్యంతరకరం. అదేసమయంలో హైందవ సంప్రదాయం ప్రకారం సనాతన పూజా క్రతువులో పాల్గొన్నపుడు ధర్మపత్నితో కలిసి వెళ్లడం ఆనవాయితీ. కానీ గత మూడున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి ఒక్కసారి కూడా తన భార్యతో కలిసి దైవ దర్శనానికి వెళ్లిన దాఖలాలు లేవు.

ఇది ముమ్మాటికీ హైందవ ధర్మాన్ని ఉల్లంఘించడమే. అందువలన పవిత్ర దుర్గానవరాత్రుల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే హిందూ ధర్మాన్ని అవమానించడమే. తప్పకుండా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారికి పట్టువస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE