ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లా, నందు పెన్నా నది ఇరువైపులా కడప, ఒంగోలు సరిహద్దు సమీపంలో ఉన్న ఆత్మకూరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలోని మండలాలు సంగం , చేజర్ల A.S పేట ఆత్మకూరు కోనసీమ తలపిస్తే .. మర్రిపాడు, అనంతసాగరం మండలాలు కరువును అప్పుడప్పుడు తట్టి లేపుతూ ఉంటుంది,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కి ప్రీతిపాత్రమైన నియోజకవర్గం . ఆయనకు ప్రతి గడప సుపరిచితమైన నేల, గతంలో ఇక్కడ పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి. తదనంతరం వేగంగా జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన కారణంగా, రాష్ట్రం లో ప్రత్యేక స్థానం గుర్తింపు పొందిన ప్రాంతం. వర్గ , గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి ఆత్మకూరు లో యువకుడు , పారిశ్రామిక రాజకీయ కుటుంబం నుండి తండ్రి వారసత్వంగా వచ్చి, ఆత్మకూరు ఎమ్మెల్యే గా రెండవ సారి గెలిచి పరిశ్రమల శాఖ మంత్రి గా ఎదిగిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం ద్వారా వచ్చిన ఉప ఎన్నిక, సర్వసాధారణంగా అధికార ప్రతిపక్షాల తలపడాలి. కానీ టిడిపి సాంప్రదాయ పద్ధతుల పేరు మీద పోటీ నుండి విరమిస్తే , బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోటీ చేసి, అధికార పార్టీకి క్షేత్రస్థాయిలో.. ఉన్నంతలో కార్యకర్తల శ్రేణి తో కొండను ఢీ కొట్టే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ ఎన్నిక ప్రత్యేకమైనది ! రాష్ట్ర ప్రభుత్వం 151 శాసన సభ స్థానాలు లో ఈమద్య కాలంలో.. గందర గోళం మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఏకపక్ష విజయంతో మదపుటేనుగు లాగా తయారై ఉన్న సమయంలో పోటీ చేయడం మా వంతు !
గతంలో జరిగిన ప్రతి ఎన్నిక , అధికార దర్పంతో దొంగ ఓట్లతో తన సత్తా చాటి, తన నీలి మీడియా ద్వారా ప్రజలు నేటికీ జగన్మోహన్రెడ్డి పాలనకు బ్రహ్మరథం పట్టినట్లు కలరింగ్ ఇచ్చుకోవడం…. తనకు తెలిసిన విద్యను ప్రదర్శించిన తీరు బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా చూసాము ! పక్క నియోజకవర్గాల నుండి, దొంగ ఓటర్లను సమీప నియోజకవర్గాల నుండి బస్సుల్లో మనుషులను తరలించి తీసుకున్న వాలంటరీ వ్యవస్థ ద్వారా ముందే చనిపోయిన, పక్క ఊర్లో నివసిస్తున్న స్థానిక ఓటర్ల పేరు మీద దొంగ ఓటరు గుర్తింపు కార్డులు సృష్టించి ఓట్లు వేయించుకోవాలని అలవాటులో భాగంగా, ఈరోజు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో లో దొంగ ఓట్ల మంత్రిగా గుర్తింపు పొందిన పెద్ద రెడ్డి లాంటి వారితో సహా, మండలానికి ఇద్దరు మంత్రులు , పంచాయతీకి ఒక ఎమ్మెల్యే చొప్పున భాద్యులుగా వచ్చిన వారు చేస్తున్న నీతిమాలిన వ్యూహాలను రచిస్తుంటే. ప్రజల్లో వారి పట్ల విముఖతకు నిదర్శనం గా భావించవచ్చు!
ముప్పై ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వంలో.. కనీసం రోడ్డు రవాణా లాంటి మౌలిక సదుపాయాలు ఉపాధి కల్పించడానికి, ఒక్క పరిశ్రమ కూడా స్వయంగా పరిశ్రమల మంత్రి అయినా కూడా, పరిశ్రమలు కూడా తీసుకు రాలేకపోవడం, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్థానిక సంస్థల నిధులను ఖర్చు పెట్టలేని స్థితి. వచ్చిన నిధులను దారి మళ్లించిన వైనం , ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న అవస్థలు వల్ల, కనీస సానుభూతి ఓటర్ల నుండి వ్యక్తం కాలేదు! ప్రచార సమయంలో బిజెపి సైతం.. సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం పల్లె సీమల అభివృద్ధి కోసం ఏ విధంగా నిధులు గా విడుదల చేసింది అన్న కాలపట్టిక, స్వయంగా కార్యకర్తలు ఇంటికి పంచడమే కాకుండా.. అధికారపార్టీ వైఫల్యం బహిరంగ పరచడం వల్ల ప్రజలలో ఆలోచన మొదలైంది. ఉదాహరణ వావిలేరు పంచాయతీ ప్రచారంలో స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, 5 సం కేంద్రం 92,42,637 రూపాయలు విడుదల చేస్తే రాష్ట్రం కేవలం 880 రూపాయలు మాత్రమే విడుదల చేసిన వైనం మీద బహిరంగ చర్చ కు పిలుపు ఇవ్వగ అధికార పార్టీ నుండి నోరు పెగల్లేదు!
మరో వైపు బిజెపి పార్టీ అభ్యర్థి, విద్యార్థి యువజన రాజకీయాల్లో సమస్యలు పైన రాజీలేని పోరాటం చేసిన ప్రస్తుత జిల్లా పార్టీ అభ్యర్థి గా పెడితే.. అధికార పార్టీ మంత్రి సోదరుని అమెరికా నుండి తీసుకు వచ్చింది , ప్రజలలో ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి పట్ల సానుభూతి లేకపోవడానికి కారణం.. విక్రమ్ రెడ్డి గెలిచినా విమానాలలో తిరుగుతాడు తప్ప, అందుబాటులో ఉండలేడు అన్నది ప్రజా కోణం . అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. వాలంటీర్లకు ప్రత్యేక ప్యాకేజీ ఓటర్ల నగదు పంపిణీ మొదలైంది. ప్రతి ఇంటికి 500 రూపాయలు నోట్లు పంపిణీ చేసేశారు. ఎర్రచందనం ద్వారా వచ్చిన నోటు , మద్యం మాఫియా ,ఇసుక , అవినీతి మరక నోట్ల కట్టలు తాగడానికి కారణం .. ప్రజల్లో వచ్చిన ఏహ్య భావన అని అందరికీ అర్థమైంది. మరోవైపు ఎదురుగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తరపు కార్యకర్తలు, ఇంట్లో తిని వచ్చి ఓటర్లకు విధానాలు చెప్పి ఓట్లను అభ్యర్థిస్తున్న సందర్భంలో కూడా, ఇంత హైరానా అధికార పార్టీ ,ఇక్కడ తిష్ట వేసిన మంత్రుల కెరుక!
ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ లకు ఉపాధి కల్పన , నూతన మద్యం పాలసీ పేరుతో జగన్ సొంత బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడం, ఇసుక మాఫియా ద్వారా బ్లాక్ మార్కెట్ , విద్యుత్ చార్జీలు పెంచను అని నేడు విద్యుత్ , ఆర్టీసీ, చార్జీలు అమాంతంగా పెంచిన వైనం, కేంద్రం పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించిన జగన్ ఆ స్థాయిలో తగ్గించుకోవడం కారణంగా నిత్యావసర రేట్లు అమాంతం పెరిగాయి అన్న కారణంతో పాటు… దౌర్జన్యం , మహిళలకు భద్రత లేక పోవడం లాంటి విధానాలతో ముందుకు పోతున్న ఈ గుడ్డి ప్రభుత్వం కు , దానిని నడుపుతున్న జగన్ కి , ఓటరు తీర్పు తో ఒళ్ళు జలదరించాలి.
ఇదో సువర్ణ అవకాశం. డబ్బు, అధికార యంత్రాంగంతో ప్రతి ఎన్నిక కైవసం చేసుకోలేము. కేవలం చక్కని పాలనే కొ లమానం అయ్యేలా ఒక బాధ్యత జగన్ గ్రహించేలా , విభిన్న తీర్పు కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్న అంతటి గొప్ప అవకాశం…. ఆత్మకూరు ప్రజానీకం అధికార పార్టీ ఎర్రచందనం, అక్రమ ఇసుక, హత్యల ద్వారా వచ్చిన డబ్బు ను ఎ ర వేసి విజయం సాధించాలన్న దురాలోచన కు తలవంచరని , దొంగ ఓట్ల ఆనవారుుతీ కి అవకాశం ఇవ్వకుండా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలి.
నాగోతు రమేశ్ నాయుడు
– బి. జే. పి. రాష్ట్ర కార్యదర్శి
9849971978