బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తక్ష ణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా జగన్ కేంద్రంతో మాట్లాడాలి
• ప్రతిపక్షనేతను వేధించడంపై పెడుతున్న శ్రద్ధలో సగం కూడా, ముఖ్యమంత్రి సొంతప్రాంత సాగునీటి ప్రయోజనాలపై పెట్టడంలేదు
• రాష్ట్రానికి ఇదివరకు దక్కిన కృష్ణా నీటిలో ఒక్క టీఎంసీ కూడా పోకుండా చూడాల్సింది ముఖ్యమంత్రే.
• తనకు తన తండ్రికి రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమకు అన్యాయం జరక్కుండా జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో.. న్యాయస్థానాల్లో పోరాడాలి
• తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయించి ట్రైబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వ వాదనలు వినిపించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి
• రాష్ట్ర రైతాంగం కోసం జగన్ ఒకడుగు ముందుకు వేస్తే, టీడీపీ రెండడుగులు వేస్తుంది
– టీడీపీ ఎమ్మెల్సీ భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
సాగునీటి రంగంలో జగన్ రెడ్డి అనురిస్తున్న అస్తవ్యస్త విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమ ప్రాంతం శాశ్వత ఎడారిగా మారబోతోందని, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణానదీ జలాలను ఏపీకి 512టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున కేటాయించారని, దానిప్రకారమే ఇన్నాళ్లుగా ఉభయతెలుగురాష్ట్రాలు నీటిని వినియోగించుకు న్నాయని, కానీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం నీటికేటాయింపులపై కొత్త వాదన చేయడంతో, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కృష్ణాజలాల కేటాయింపుల్ని పున: పరిశీలన చేయాల్సిందిగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ను ఆదేశించిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ తెలంగాణ వాదనపై కేంద్రం స్పందించి, కృష్ణా జలాల వినియోగంపై పున:సమీక్ష చేయాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ను ఆదేశించినా, జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరించడం దేనికి సంకేతం? కేంద్ర నిర్ణయంతో కృష్ణాజలాలనే నమ్ముకున్న రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా, తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం మొత్తం ఎడారిగా మారే పరిస్థితులున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఏమనాలి? ప్రతిపక్షనేత చంద్రబాబుని అక్రమకేసులతో వేధించడంపై పెడుతున్న శ్రద్ధలో సగం కూడా, ముఖ్యమంత్రి సొంతప్రాంత సాగునీటి ప్రయోజనాలపై పెట్టడం లేదు
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నుంచి 6 రకాల అనుమతులు పొందేవరకు జగన్ నిద్రపోయాడు
తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులపై ఏనాడు జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణా న్ని తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా కొనసాగిస్తోంది. ఆ పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యున ల్ అభ్యంతరాలు లేవనెత్తినా తెలంగాణ సర్కార్ నిర్మాణ పనులు ఆపలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్ లో స్టే ఉన్నాకూడా కేవలం కేంద్రప్రభుత్వ మద్ధతుతోనే తెలంగాణ సర్కార్ ఆ పథకానికి సంబంధించి 6 రకాల అనుమతులు సాధించింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే, కృష్ణాజలాల్లో రాయలసీమకు తీవ్ర నష్టం జరుగు తుంది. ఇదంతా తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు తప్ప, ఏనాడూ కేంద్రప్రభుత్వం వద్ద తన వాదన చెప్పే ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇదంతా గమనిస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తున్నట్టే కనిపిస్తోంది.
తన స్వ ప్రయోజనాలకోసం తెలంగాణ ప్రభుత్వంతో అంటకాగుతున్న జగన్, ఏకంగా సీమ కే తీరని ద్రోహం చేయడానికి సిద్ధమయ్యాడు. కేంద్రం కృష్ణాజలాల వినియోగంపై పున: సమీక్ష చేయాలన్నప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని అడగలేని దుస్థితిలో జగన్ ఉండటం సిగ్గుచేటు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంతో పాటు, శ్రీశైలం ప్రాజెక్ట్ లో తమ వాటాగా తెలంగాణ సర్కార్ ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేస్తూ, పరిమితికి మించి నీటిని దుర్వినియోగం చేస్తున్నా ఏపీ ప్రభుత్వం స్పందించ లేదు. నీటి వినియోగంలో తెలంగాణ అనుసరిస్తున్న నియంత్రత్వ విధానాలపై గతంలోనే సుప్రీంకోర్టులో ఉన్న కేసుల విచారణలో జగన్ ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు?
పేరు ప్రఖ్యాతులు ఉన్న న్యాయవాదుల్ని నియమించి, ఏపీ వాదనలను సమర్థవంతంగా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? కృష్ణాజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మెతకవైఖరితో అటు రాయల సీమకు, ఇటు కృష్ణాడెల్టాకు, గుంటూరు పల్నాడు జిల్లాల్లోని చివరి ఆయకట్టు భూము లకు నీరందే పరిస్థితి లేకపోయినా ముఖ్యమంత్రిలో కించిత్ కూడా చలనం లేకపోవడం బాధాకరం.
అలానే కర్ణాటక ప్రభుత్వం గతంలో తుంగభద్ర నదిపై అప్పర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలపలేదు. ఆ ప్రాజెక్ట్ ను నేడు జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన కేంద్రప్రభుత్వం, రూ.5,339కోట్ల నిధులు విడుదల చేయడానికి సిద్ధమైంది. అప్పర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తైతే, రాయలసీమకు తాగునీరు కూడా అందదు. ఇంత దారుణం జరుగుతున్నా కూడా జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఏనాడూ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడింది లేదు.. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లిం ది లేదు.
బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కృష్ణాజలాలపై పున:సమీక్ష చేస్తే రాష్ట్రం 100టీఎంసీల కృష్ణా నీటిని కోల్పోతుంది. దానివల్ల తీవ్రంగ నష్టపోయేది రాయలసీమే
సాగునీటి కేటాయింపులు ఒకసారి జరిగాక వాటిపై మరలా పున:సమీక్షలు చేయడం అంటే అది నిజంగా ఏదోఒక ప్రాంతానికో, రాష్ట్రానికో అన్యాయం చేయడమే అవుతుంది. కృష్ణా ఆయకట్టు రైతాంగం ప్రయోజనాలు, ఏపీకి న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాల పై ముఖ్యమంత్రి తక్షణమే నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ పున:సమీక్ష చేస్తే, కృష్ణాజలాల్లో ఏపీకి ఇప్పుడున్న 512 టీఎంసీల్లో దాదాపు 100టీఎంసీలు తగ్గే అవకాశముంది.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి జరిగే నష్టం వర్ణనాతీతం. వాస్తవాలు తెలిసీ జగన్ మౌనంగా ఉండటం.. తెలిసితెలిసీ రైతులకు తీరని ద్రోహం చేయడం నిజంగా క్షమించరాని నేరం. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపినా కూడా జగన్మోహన్ రెడ్డికి అన్నంపెట్టేవారిపై కనికరం లేకపోవడం విచారకరం. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులే ముందు వరసలో నిలిచింది. తన నియోజకవర్గం రైతులకు నాలుగున్న రేళ్లలో జగన్ చేసింది శూన్యమని అక్కడ నమోదైన రైతుఆత్మహత్యలే చెబుతున్నా యి.
రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని మాయమాటలు చెప్పిన జగన్, తన స్వప్రయోజనాలకోసం తనకు తన తండ్రికి రాజకీయ జీవితమిచ్చిన సీమను శాశ్వతఎడారిగా మార్చేందుకు సిద్ధమయ్యాడు
టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం గతంలో అమలుచేసిన అనేక పథకాల్ని, సబ్సిడీలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తీసేశాడు. పంటలబీమా, ఇన్ పుట్ సబ్సిడీకి మంగళం పాడటంతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో రాయలసీమ రైతులకు కృష్ణాజలాలు అందించి, ఆప్రాంతంలోని చెరువుల్ని నింపి, సీమలో పంటల రక్షణకోసం డ్రిప్, స్ర్పింక్లర్ పద్ధతిని అమలుచేశాడు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండి, ఉత్పత్తి పెరిగేలా చేయడంతో చంద్రబాబు హయాంలో సీమ రైతాంగం, వ్యవసాయం కళకళలాడింది.
రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, కనీసం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న స్టేను ఎత్తేయించే ప్రయత్నం కూడా చేయలేదు. రాయలసీమపై, ఆ ప్రాంత ప్రజలపై జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రేమాభిమానాలు లేవు కాబట్టే, ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చడా నికి సిద్ధమయ్యాడు.
తనకు, తనతండ్రికి రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ ప్రాంతం కోసం జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలి. కృష్ణాజలాల్లో ఏపీకి, సీమకు దక్కాల్సిన నీటి కేటాయింపులపై ప్రభుత్వం తరుపున సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తక్ష ణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా జగన్ కేంద్రంతో మాట్లాడాలి.
రాయలసీమ బాగుకోసం జగన్ ఒకడుగు వేస్తే, టీడీపీ రెండు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్ తరాలను నాశనంచేసే దుర్మార్గపు చర్యలకు జగన్ స్వస్తి చెప్పకపోతే, అతని రాజకీయ జీవితం శాశ్వతం ముగిసిపోతుంది. తెలంగాణ ప్రయోజ నాలకోసం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమైన జగన్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో కోలుకోలేని విధంగా బుద్ధిచెబుతారు.” అని రామ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు.