Suryaa.co.in

Political News

జగనన్న పాలనలో పంచాయితీలన్నలకు మొండిచేయి

నరేంద్ర మోడీ గారు పంచాయతీలు అభివృద్ధి చెందాలని ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. గ్రామాలలో జరుగుతున్న సిమెంట్ రోడ్లు , కాలువలు కట్టడం ,ఇండ్ల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మించడం, వీధి స్తంభాలకు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయించడం ,లాంటి ఎన్నో పనులు గ్రామీణ అభివృద్ధి కోసం చేస్తున్నారు . చెప్పాలంటే గ్రామాలలో జరిగే ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే .

73 ,74 అధికరణ క్రింద గతంలో గ్రామాలకు 32% నిధులు సమకూరుస్తుంటే… మోడీ గారు వచ్చిన తర్వాత 42% నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి పయనంలో నడిపిస్తున్నారు .అదేవిధంగాpanchayatస్వచ్ఛభారత్ ద్వారా ప్రతి పంచాయతీకి ఇతోధిక సహాయం చేస్తున్నారు .అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ,3 నుండి 6 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలందరికీ పౌష్టికాహారం ,గుడ్లు, పాలు, బాలామృతం, జొన్న పిండి ,రాగి పిండి, చిక్కిలు ,బెల్లం, ఖర్జూరం ,అటుకులు బలవర్ధకమైన ఆహారం తదితర సౌకర్యాలను కూడా కేంద్రమే కల్పిస్తుంది .అందులో 10% వాటా మాత్రమే రాష్ట్రానిది . వాటి మీద బొమ్మలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వి.

మిగతా కొన్ని పనులు పంచాయతీలలో జరగాలని ఉద్దేశంతో, జనాభా ప్రాతిపదికన ఇప్పటికీ ఈ మూడున్నర సంవత్సరాలలో పంచాయతీలకు 8,700 కోట్లు కేంద్రం పంపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తనsapanchసీ.ఎం. ఎఫ్. ఎస్ ఖాతాలో జమ చేసుకొని పంచాయతీలకు, సర్పంచులకు మొండి చేయి చూపించి, గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం .

ఈ పరిస్థితి గమనించి కేంద్రం ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న 12,918 పంచాయతీలను ఏప్రిల్ నుండి ఏ పంచాయతీకా పంచాయతీ యూనియన్ బ్యాంకులో ఖాతా తెరుచు కోమని ఆదేశించారు .కేంద్రంpanchayat-dis పంపించే నిధులు ఆ ఖాతాలలోనే జమచేయాలని, రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశిస్తే .. ఇంతవరకు అమలు చేయకుండా ఆ డబ్బులు వాడుకొని వారికి మొండి చేయి చూపిస్తూ . సర్పంచ్ లను అప్పులపాలు చేస్తున్నారు.

చాలా జిల్లాలలో సర్పంచ్ లే సొంత నిధులు ఖర్చు పెట్టుకుని, అప్పుల పాలై ప్రజలకు సమాధానం చెప్పలేక, గ్రామాలలో తిరగలేక నానా నరకయాతన అనుభవిస్తున్నారు. కొంతమంది సర్పంచులు ముఖం చాటేసి వేరే ఊర్లకి పోతున్నారు. ఏపీలోని అనేక గ్రామ సర్పంచులు బిల్లులు రాక అప్పుల పాలై, ఉన్నదిsarpanch1తెగనమ్ముకుని హైదరాబాద్‌కు వలస వెళుతున్న దయనీయ పరిస్థితికి నిస్సందేహంగా జగన్మోహన్‌రెడ్డి పాలనే కారణం. కొందరు సర్పంచులు హైదరాబాద్ వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. మరికొందరు వేరే పట్టణాలకు వెళ్లి కూరగాయలు అమ్ముకోవడమో, పొలాల్లో కూలీలుగా మారుతున్న విషాద పరిస్థితికి సీఎం జగన్మోహన్‌రెడ్డి అసమర్థత కాదా?

ఇప్పటికీ చదువుకున్న సర్పంచులు, బిల్లులు రాకపోవడంతో తమ విధులు వదిలేసి, పొట్టకూటి కోసం పట్నాల్లో ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తున్న వైనం మన గ్రామస్వరాజ్యానికే సిగ్గుచేటు. ఇవన్నీ ఎవరూsarpanch2 ఆరోపిస్తున్నవి కాదు. సాక్షాత్తూ మీడియా-సోషల్‌మీడియాలో రోజూ చూస్తున్నవే. ప్రజలకు నిత్యం కనపడేది సర్పంచ్. ముఖ్యమంత్రి ఏమీ ప్రజలకు నేరుగా కనపడే వ్యక్తి కాదు. ఎమ్మెల్యేలకే వారి దర్శనం దొరకదు. ఈ ముఖ్యమంత్రి సర్పంచులను నానా ఇబ్బందులు పెడుతూ ప్రజలలో దోషిగా చూపే దానికోసం దోహదపడుతున్నారు.

సర్పంచులు కక్కలేక ,మింగలేక కొంతమంది ఏం మాట్లాడాలో అర్థం కాక .. పత్రికలకు రాకుండా గ్రామాలలో మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, మమ్మల్ని క్షమించండి.మా ఎమ్మెల్యేలను అడిగితే వారు సరిగా సమాధానం చెప్పడం లేదు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూలు ఇవ్వక వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారున్నారు. మీకు తెలుసు కదా అని నర్మగర్భంగా మాట్లాడుతున్నారు .ఏమి చేయమంటారు అని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కేంద్రం పంపించిన 7,800 కోట్ల సంగతి దేవుడెరుగు. ప్రస్తుతం మన రాష్ట్రానికి పంచాయతీలకు 948 కోట్లు పంపించి ఉన్నారు. కానీ ఇప్పటికీ పంచాయతీ ఖాతాలలో జమ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక,న్యాయ, సాధికారత శాఖ మంత్రి నారాయణ స్వామి గారు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని అధికారులను నివేదికలు కోరుతానని చెప్పారు .

ఈ విధంగా పంచాయతీలు అభివృద్ధి చెందనందువలన గ్రామీణ వికాసం, తద్వారా దేశ వికాసం దెబ్బతింటుంది . గ్రామీణాభివృద్ధి మీద ఇ ప్సొ స్ రీసెర్చ్ అనే సంస్థ ఈమధ్య చేసిన సర్వేలో, మన రాష్ట్రం గ్రామీణ వికాసంలో 12వ స్థానానికి పడిపోయింది . అందుకే తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చులకనగా కామెంట్,ఎగతాళి చేస్తున్నారు .

ఈ పరిస్థితులు మారాలంటే ప్రజల చేతుల్లోనే ఆయుధం (ఓటు). రాబోయే 2024 ఎన్నికల్లో మన రాష్ట్ర అభివృద్ధి , గ్రామీణాభివృద్ధి కోసం జనసేన + బిజెపి అభ్యర్థులను గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి వచ్చే దానికోసం మనమందరం కృషి చేద్దామని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను.

 

LEAVE A RESPONSE