– దేవాలయంలాంటి శాసనసభలో సారామరణాలు, సహజమరణాలని ముఖ్యమంత్రి పెద్ద అబద్ధం చెప్పాడు. ఏ ఆధారాలతో ముఖ్యమంత్రి సభలో అలామాట్లాడాడు?
– చనిపోయినవారి పోస్ట్ మార్టమ్ నివేదికలుఏమైనా ముఖ్యమంత్రివద్ద ఉన్నాయా? ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి రేపు సభలో వాస్తవంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
• 151 మంది శాసనసభ్యులున్న అధికారపార్టీ ఎందుకు దొంగసారా తయారీదారులను కాపాడటానికి ప్రయత్నిస్తోంది? ఆపార్టీకి కూడా సారా అమ్మకాలు, తయారీలో వాటాలున్నాయా?
• సారామరణాలు సహజమరణాలని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై బొత్స పెదవి విరిచింది నిజం కాదా? అది ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ ని అనుమానించడమే కదా!
• ముఖ్యమంత్రి చెప్పిన మద్యపాననిషేధం ఓ పెద్దబూటకం, చంద్రబాబు టైమ్ లో మద్యంపై వచ్చే సంవత్సరాదాయం రూ.6వేలకోట్లయితే, ప్రస్తుతప్రభుత్వం దాన్ని రూ.16,500 కోట్లు చేసింది. ఇంకాపెంచి దాన్ని రూ.20వేలకోట్లకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇదేనా మీప్రభుత్వ మద్యపాన నిషేధ విధానం? .
– టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
రాష్ట్రప్రజలకు దేవాలయం లాంటి శాసనసభలో ముఖ్యమంత్రి, వారి మంత్రిమండలి ప్రతిపక్షా లసహాయ సహాకారాలతో చట్టాలుచేస్తుంటారని, అలాంటిసభకు ముఖ్యమంత్రి మేనేజింగ్ ట్రస్టీ లాంటివాడని, సభానాయకుడే సభలో తప్పుడు ప్రకటనలు ఇస్తుంటే, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతుంటే, ఇక ఆ సభకు ఏం పవిత్రత, ఏపాటి గొప్పతనం ఉంటుందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలన్నీ సహజమరణాలేనంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో ఒకఅబద్ధపు ప్రకటనచేశారు. శాసనసభ ఔన్నత్యం, దాని గొప్పతనం తెలియకుండా ముఖ్యమంత్రి అంతఅసువుగా అబద్ధాలు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నాం? ముఖ్యమంత్రి ఏ ఆధారాలతో సభలో నిన్న సారామరణాలన్నీ సహజమరణాలనిచెప్పాడని ప్రశ్నిస్తున్నాం.
దేవాలయంలాంటి శాసనసభను సాక్షాత్తూసభానాయకుడే అబద్ధాలుచెప్పి దాని పవిత్రతను అమానించాడు. మరణించిన వారి పోస్ట్ మార్టమ్ వివరాలు ఏమైనా ముఖ్యమంత్రివద్ద ఉన్నాయా? కల్తీసారాతాగి చనిపోయినవారికి చెందిన మూడుఎఫ్ఐఆర్ లు నావద్ద ఉన్నాయి. నాటుసారా తాగి మరణించారు అన్నప్పుడు మృతుల పేగుల్లోనుంచి విశ్రాఅనే దాన్ని సేకరిస్తారు. దాన్ని పరీక్షలకోసం ల్యాబ్ లకు పంపుతారు.అక్కడినుంచి రిపోర్ట్ లు వచ్చాకే వైద్యులుపోస్ట్ మార్టమ్ చేసి, వారినివేదికలు బయటపెడతారు. అలాంటివిఏమైనా ముఖ్యమంత్రి వద్దఉన్నాయా?
ఏ ఆధారాలతో ప్రజాక్షేత్రంనుంచి ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటన ఇచ్చారు? నిన్న చంద్రబాబునాయుడు గారు ప్రజల్లోకి వెళ్లి, ముఖ్యమంత్రి ప్రకటన అబద్ధమని తేల్చేశారు. నాటుసారాతాగి మరణించినవారి కుటుంబసభ్యులతో ప్రజల్లో మాట్లాడించిన చంద్రబాబుగారు, అసలువాస్తవాలను బహిర్గతపరిచారు. రాష్ట్ర అధికారయంత్రాంగం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిద్రపోతోంది.
26మందిచనిపోతే, తొందరపడి ప్రకటనచేస్తారా? దొంగసారా అమ్మేవాళ్లు.. ప్రభుత్వం చేయిచేయి కలిపి వెళు తోందా ? అలాకాకుంటే ముఖ్యమంత్రి అంతఅబద్ధపు ప్రకటన ఎలాచేస్తారు? 55 వేల మంది జనాభా ఉండే జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారుచేయడం ఎలా సాధ్యమవుతుంది అంటున్న ముఖ్యమంత్రికి, కోటిమంది జనాభాఉన్న హైదరాబాద్ లోని ధూల్ పేటలో దొంగసారా తయారుచేస్తారని తెలియదా? అవగాహనలేకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడటంఏమిటని ప్రశ్నిస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారుచేస్తున్నపదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి, పది ఎఫ్ఐఆర్ల్ రిజిస్టర్ చేశారు. అవినావద్ద ఉన్నాయి. వాటిలోని సమాచారం ముఖ్యమంత్రికి తెలుదయ వాటిఅర్థం.. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారవుతోందనే కదా!
తలాడి నాగదుర్గ వైఫ్ ఆఫ్ రమేశ్ అనే ఆమెను సారా అమ్మడానికి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఆవిధంగా 10మందిపై కేసులుపెట్టారు. దొంగసారా అమ్ముతున్నారని, కాస్తున్నారని ఈ నెల 10వతేదీనుంచి 13వరకు 10ఎఫ్ఐఆర్ లు తయారుచేశారు. వాటిని చూశాక ముఖ్య మంత్రి ఏంచెబుతారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో నాటుసారా అమ్ముతున్నవారు.. తయారుచేస్తున్నారని 10 ఎఫ్ఐర్ లే చెబుతున్నాయి. మూడురోజుల క్రితం ఎఫ్ఐఆర్ లు నమోదైతే, ముఖ్యమంత్రిగారు అంతతేలిగ్గా జంగారెడ్డిగూడెంలో నాటుసారా లేనేలేదని అంతఅసువుగా అబద్ధంఎందుకుచెప్పారు? 151మంది శాసన సభ్యులు కలిగిన పార్టీ దొంగసారా అమ్ముతున్నవారిని ఎందుకు రక్షించాలని చూస్తోంది. ఆ పార్టీకి దొంగసారా వ్యాపారంలో ఏమైనా వాటాలున్నాయా?
ముఖ్యమంత్రి గారేమో జంగారెడ్డిగూడెంలో సారాలేనేలేదని చెబుతుంటే, అక్కడే ఎక్సైజ్ అధికారులు సారాబట్టీలను, సారా డ్రమ్ములను ధ్వంసంచేస్తున్నారు. (వాటికి సంబంధించిన వీడియోలను ఈ సందర్భంగా రామయ్యవిలేకరులకు ప్రదర్శించారు) జంగారెడ్డిగూడెంలో సారా తయారువుతోంది అనడానికి తానుఇప్ప్పుడు విలేకరులకు ప్రదర్శించిన వీడియోలే నిదర్శనం. వాటితోపాటు తనవద్ద ఉన్న ఎఫ్ఐఆర్ లు మరోరుజువు. ఇంతస్పష్టంగా కళ్లముందు సారాతయారీ, అమ్మకాలకు సంబంధించిన ఆధారాలు కనిపిస్తుంటే, సభానాయకుడైన వ్యక్తి సభను తప్పుదోవపట్టించేలా అబద్ధాలు చెబుతారా? ముఖ్యమంత్రి ఇప్పటికైనా తానుఅబద్ధపుప్రకటన చేశానని సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి చెప్పిన మద్యపాననిషేధం ఒక పెద్దబూటకం, చంద్రబాబు హాయాంలో మద్యంపై ప్రభుత్వానికివచ్చే సంవత్సరాదాయం రూ.6వేలకోట్లయితే, ప్రస్తుతప్రభుత్వం దాన్ని రూ.16,500 కోట్లు చేసింది ఈప్రభుత్వంకాదా? ఇంకాపెంచి దాన్ని రూ.20వేలకోట్లకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇదేనా మీప్రభుత్వ మద్యపాననిషేధ విధానం? ముఖ్యమంత్రి చెప్పిన మద్యపాననిషేధం అమలువిధానం ఇదేనా?
ఇంతటితో ఆగకుండా, మద్యంపై వచ్చేఆదాయాన్ని 15ఏళ్లకుతాకట్టుపెట్టి రూ.25వేలకోట్లు ఈప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. ఇదిజరిగాకకూడా ఈప్రభుత్వం మద్యాన్నినిషేధిస్తుందని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఇలాచేసిన మీది 420ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రి గారు? 15ఏళ్లపాటు మీరు అధికారంలో ఉంటారనే మద్యంఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పు తెచ్చారా?
దొంగసారాకు మూలకారకులైన జంగారెడ్డిగూడెంలోని డాంగేనగర్ కుచెందిన ఆ ముగ్గురు వైసీపీ నేతలెవరో చెప్పండి? వారి పేర్లు ముఖ్యమంత్రికి తెలియదా? వారుఅమ్మిన సారా తాగేకదా… 26మందిచనిపోయారు.
ఇదేమాటను జంగారెడ్డిగూడెంలో ఏతలుపుతట్టినా చెబు తారు..కానీ ముఖ్యమంత్రి మాత్రం సారామరణాలు కాదు.. సహజమరణాలని చెప్పడం ఎంత టి సిగ్గుచేటు? సారాతయారీకి అవసరమైన బెల్లంఊట తయారవడానికి 15రోజులు సమయం పడుతుందని, బ్యాటరీల్లోని మిథైల్ ని పొడిచేసి, ఆపొడిని వేడినీళ్లలో కలిపి మిథైల్ ఆల్కహాల్ తయారుచేసి, సారాగా అమ్మేస్తున్నారు. మిథైల్ ఆల్కహాల్ కడుపులోకి వెళితే బ్రెయిన్ పనిచేయదు.. కళ్లుతిరుగుతాయి…ఫిట్స్ తో కొట్టుకుంటారు.. ఈ లక్షణాలన్నీ నిన్న చంద్రబాబుగారితో సారామృతులకుటుంబాల వారు చెప్పారు.
వారు వారి వేదనంతా చంద్రబాబుగారితో, మీడియావారితో చెప్పుకుంటే, ముఖ్యమంత్రి గారేమో సహజమరణాలని, కాలంతీరి చనిపోయారని చెబుతారా? జంగారెడ్డిగూడెంలో చనిపోయినవారంతా కాలంతీరి చనిపోలేదు ముఖ్యమంత్రిగారు.. మీకల్తీసారా కాటుకి చనిపోయారు.
అర్థంలేకుండా మాట్లాడే మిగతామంత్రులు, దబిడిదిబిడిగామాట్లాడే బొత్సగారు రాష్ట్రప్రజలకు తెలుసుగానీ, రాష్ట్రవైద్యఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్న ఆళ్లనాని ఎవరనేది జంగారెడ్డిగూడెం ఘటనతో, 26మంది చనిపోయాకనే రాష్ట్రప్రజలకు తెలిసింది. ఆళ్లనాని గారు చనిపోయిన వ్యక్తి భార్యతో మాట్లాడి, ఏమని చెప్పారో ఆ వాయిస్ కూడా ఉంది.. రేపు బయటపెడతాం.
ఆ అమ్మాయితో మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబుగారు వచ్చి అడిగితే నీ భర్త సారా తాగి చనిపోయాడని మాత్రం చెప్పొద్దమ్మాఅని బతిమాలాడంటా ! మంత్రి గారు మీరు బతిమాలిం ది నిజమా..కాదా? కాదని చెప్పగలరా? ఎందుకంత ఖర్మ పట్టింది మంత్రిగారు మీకు?
బొత్ససత్యనారాయణేమో ముఖ్యమంత్రిచేసిన ప్రకటనను అనుమానించేలా మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారిప్రకటనను మంత్రులు అలా అవహేళనచేసేలా మాట్లాడొచ్చా?
ముఖ్యమంత్రి సారామరణాలపై సభలోచేసిన ప్రకటన పచ్చి అబద్ధం. ఆయన వాస్తవాలను గమనించి రేపుసభలో అసలువాస్తవం చెప్పాలని, లేకుంటే ఆయన ప్రభుత్వాన్ని రోడ్డుకి ఈడుస్తామని స్పష్టంచేస్తున్నాం.
విలేకరులకు అడిగినప్రశ్నలకు సమాధానంగా…
ప్రజలు చాలానిష్ణాతులైన క్రిటిక్స్ . వారి వేడి ముఖ్యమంత్రిగారికి తగిలింది. నిన్న జరిగిన పవన్ కల్యాణ్ సభకువచ్చిన జనాన్ని చూసి ఈ ప్రభుత్వం కంగారుపడలేదూ…! చంద్రబాబు గారు నిన్న తాడేపల్లి గూడెం వెళితే, సారాతాగి మరణించినవారి కుటుంబాలకు చెందిన ఒక తల్లి “అయ్యా..నువ్వు అధికారంలోఉండి ఉంటే, నాకొడుకు బతికేవాడయ్యా” అని వాపోయింది. అదీ నమ్మకమంటే. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకంఉంది.
ఒకదుర్మార్గమైన పరిపాలనచేస్తున్న వైసీపీప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటే, పరిపక్వతతో వ్యవహరించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా స్వాగ తిస్తున్నా. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా.. ఏంచేసినా అన్నీ చంద్రబాబే గారే చేయించారంటే ఎలా?ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సభలో తప్పుడు ప్రకటనలు చేయడమనేది చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేదు.