-గులకరాయి తగిలి 13 రోజులు… ప్లాస్టర్ తియ్యకుండా ఐప్యాక్ సూచనలతో జగన్ నాటకాలు
-ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి జగన్ డ్రామాలు
-మూడు రోజులకు తియ్యాల్సిన ప్లాస్టర్ ను అలాగే ఉంచుకుని ప్రచారం
-సెప్టిక్ అవుతుదంటున్న డాక్టర్లు… అయినా నాకు ఓట్లే ముఖ్యమంటున్న జగన్
-మహిళలకు పెద్దాపరేషన్ చేసినా.. వారానికే కుట్లు ఊడతీస్తారు
-గొడ్డలి వేటు సూత్రధారి అమాయకుడని అనడం రాష్ట్ర ప్రజలను వంచించడమే
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అధికార దాహంతో ఏదోరకంగా ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు దండుకోవడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు. అందులో భాగంగా ప్లాస్టర్ డ్రామాకు తెరతీసి జగన్ రెడ్డి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గులకరాయి డ్రామాలో భాగంగా 13వ తారీఖున చిన్న దెబ్బ తగిలితే ఇంకా జగన్ రెడ్డి ప్లాస్టర్ తియ్యలేదు. ఐప్యాక్ సూచనలతో ప్లాస్టర్ అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకోవాలని జగన్ జగన్నాటకానికి తెరలేపారు. ప్లాస్టర్ డ్రామాలతో ప్రజలను అమాయకులను చేయాలనుకుంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. చిన్నప్పుడు జగన్ రెడ్డి నాటకాలు వేశారో లేదో కాని ఇప్పుడు మాత్రం ప్లాస్టర్ తో డ్రామాలు ఆడుతున్నారు. మూడు రోజులుకే తీసేయాల్సిన ప్లాస్టర్ ను ఇంకా తియ్యడంలేదు. అది అలాగే ఉంటే సెఫ్టిక్ అవుతందని డాక్టర్లు అంటున్నారు. అయినా జగన్ రెడ్డి మాత్రం ఓట్లే ముఖ్యమంటూ తిరుగుతున్నాడు. జగన్ రెడ్డి ఇకనైనా ఆ ప్లాస్టర్ డ్రామాను ఆపితే మేలు. మహిళలకు పెద్దాపరేషన్ చేసినా.. వారానికే కుట్లు ఊడతీస్తారు… జగన్ గులకరాయి దెబ్బకు మాత్రం 13 రోజులైనా ప్లాస్టర్ ఊడలేదు. తాను ఏది చెబితే అది జనాలు నమ్ముతారని జగన్ రెడ్డి అనుకోవడం పొరపాటు.
ఐదేళ్లు ఎంపీగా పోటీచేసిన అవినాష్ రెడ్డి చిన్న బాలుడు అనడంలో జగన్ ఔచిత్యమేమిటి? అమాయకుడనడంలో అర్థం ఏమిటి? గొడ్డలి వేటు ఘటనలో సూత్రదారిని అమాయకుడని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రజలు అమాయకులు అనా మీ ఉద్దేశం? అతను అమాయకుడు అంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే. కడప పార్లెమెంట్ ఓటర్లను అవమానించడమే.
సీబీఐ దర్యాప్తు తప్పు… మా తమ్ముడు నిప్పు అని జగన్ రెడ్డి చెప్పాలి. జగన్ రెడ్డిపై కూడా సీఐబీ 11 ఛార్జ్ సీట్లు వేసింది. కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకోని కోర్టులకు హాజరు కాలేదు. లేదంటే ఈపాటికే మీ సంగతి తేలిపోయేది. చట్టాన్ని గౌరవించి కోర్టులకు హాజరు అయ్యి ఉంటే. లోనో బయటో అనేది తేలిసిపోయేది.
మీ తమ్ముడు బాలుడు అన్నారు. మీ తమ్ముడు అమాయకుడు అన్నారు. మరి మీపై ఉన్న 11 ఛార్జ్ షీట్ లపై నోరు మెదపరే. నేను కూడా అమాయకున్ని, నేను కూడా బాలున్ని అని చెప్పరే. ఇంకా ఎంత కాలం రాష్ట్ర ప్రజలను మోసగిస్తారు. ఇంక ఎంత కాలం నటిస్తారు. మీ వేషధారణతో, మీ మాయ మాటలతో ఇంక ఎంత కాలం రాష్ట్ర ప్రజలను భ్రమలో పెడతారు. ఇకనైనా మీ డ్రామాలను ఆపాలి.
మీ బాబాయి ఎలా హత్య చేయబడ్డారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడు మీ తమ్ముడు అమాయకుడు, చిన్న బాలుడు అంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. కడప ప్రజలు అసలే నమ్మరు. జగన్ రెడ్డి పెద్ద వేషధారి. మోసపు మాటలు చెప్పడంలో దిట్ట. అబద్దాలు ఆడటంలో ఆరితేరారు. అవినీష్ రెడ్డి అమాయకుడు అని జగన్ రెడ్డి చెబుతుంటే. సీబీఐ ఎందుకు సైలెంట్ గా ఉంది. వివేకా కేసులో సుత్రధారి అతడేనని.. అతను అమాయకుడు కాదని సీబీఐనే ప్రజలకు తెలియజేల్సిన అవసరం ఉంది