Suryaa.co.in

Editorial

జగనన్న దగ్గర ఆంధ్రా ఉద్యోగుల పప్పులు ఉడకవ్ భయ్యా!

( మార్తి సుబ్రహ్మణ్యం)
‘అన్నా… సీపీఎస్ గురించి నాకు వదిలేయండి. మీ అందరి దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో ఆ సమస్య పరిష్కరిస్తా’నన్నా అని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగనన్న అతి తేలిగ్గా హామీ ఇచ్చేశారే అనుకోండి. ఆయనంటే రాజకీయ నాయకుడు. అధికారం కోసం, అవసరం కోసం లక్షాతొంభై అబద్ధాలాడతారు. హామీలు గుప్పిస్తారు. అది ఆయనొక్కడే కాదు. రాజకీయ పార్టీల నైజమే అంత. కాబట్టి వారిని తప్పుపట్టలేం. రాజకీయ పార్టీలకు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉంది కాబట్టి వారిని విమర్శించలేం.
మరి అంత చదువుకుని, రోజూ సర్కారు బండి ఎలా నడుస్తుందో స్వయంగా చూస్తూ, అసలు బడ్జెట్ బండి కుంటిదా? గుడ్డిదా అని అనుభవంలో తెలిసిన ఉద్యోగులు, వారి నాయకుల బుద్ధి ఏమైంది? బుర్ర

ఎక్కడకు పోయింది? ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు నిజంగా సీపీఎస్ రద్దు చేస్తాడా? అది సాధ్యమవుతుందా? అసలాయన దానిపై అవగాహన ఉండే ఆమాట చెప్పాడా? లేక తమను అవులేగాళ్లను చేయడానికేమైనా బిస్కెట్ వేశాడా ఒకటికి పదిసార్లు అని ఆలోచించుకోవద్దూ!?
గొర్రెల్లా తలూపుతూ, జగనన్న మాటలకు మహదానందపడిపోతూ, అడిగినవన్నీ ఇస్తున్న చంద్రన్నను తక్షణం పీకిపారేసి ఆ ప్లేసులో జగనన్నను తెచ్చుకోవాలన్న అత్యుత్సాహంలో, బండి శీనన్న మాటల్లో
prc-cartoonచెప్పాలంటే.. జగనన్న కోసం రెండుచేతులా ఓట్లేస్తే.. ఇదిగో.. పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఎందుకుంటుంది? ఇప్పుడు సకల శాఖల మంత్రిగా పేరున్న సజ్జల ఏదో అన్నారని తెగ పిసుక్కోవడం దేనికి?
జగనన్న మమ్మల్ని మోసం చేశారని బయటకొచ్చి వాంతులూ, విరేచనాలూ చేసుకోవడం ఎందుకు? మళ్లీ అంతలోనే భయపడి సీఎం అంటే మాకు తండ్రిలాండోడు. ఆయనపై కోపం తెచ్చుకుంటే తప్పేందని

నాలిక మడతేయడం ఎందుకు?రావుగోపాలరావు అదేదో సినిమాలో చెప్పినట్లు ఆ ముక్క ముందు చెప్పాల మరి! దీపం బాగుందని ముచ్చటపడి ముద్దు పెట్టుకుంటే కాలేది మన మూతి మాత్రమే. ఈ చిన్న లాజిక్కును ఉద్యోగులు, పెన్షనర్లు మిస్సయి ఇప్పుడు కస్సుమంటే ఎలా?
ఇంతకూ సజ్జలన్న ఏమన్నారని? ఎన్నికలప్పుడు జగనన్నకు తెలియక, అవగాహన లేక సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారట. అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ దాని కష్టనష్టాలు తెలియలేదట. ఇప్పుడేం చేయాలో ఇంకా అర్ధం కావడం లేదు. దానిని రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి, పెన్షన్ సెక్యూరిటీ ఎలా అన్న దానిపై ఆలోచించేస్తున్నారట. సీపీఎస్ విషయంలో టెక్నికాలిటీస్ తెలియక హామీ ఇచ్చారు కాబట్టి ప్రత్యామ్నాయం గురించి కూడా సేమ్ టు సేమ్ ఆలోచించేస్తారట. సరే సజ్జలన్నా… మరి కాంట్రాక్టు
prc-joఉద్యోగులను కూడా పర్మినెంటు చేస్తామని, వారి తలపై చెయ్యి పెట్టి మరీ ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే.. ఆ యవ్వారం అంతా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడేమీ చేయలేము. కాబట్టి.. ఇహ కాంట్రాక్టు ఉద్యోగులంతా హరేరామ భజన, నడిపించు నా నావ నడిసంద్రమూ లోన అని పాటలు పాడుకోమని చెప్పకనే చెప్పేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మోసం చేసేవారి తప్పు ఎంతమాత్రమూ ఉండదు. తప్పంతా మోసపోయేవారిదే. చూడప్పా సిద్దప్పా. ఈ డైలాగు ఇష్టమైతే ఈడనే వాడుకో. నచ్చితే యాడ్నైనా వాడుకో! ఇది ప్రపంచంలోని అందరికీ వర్తించే సూత్రం. అందుకు ఆంధ్రా ఉద్యోగులు,జనాలు అతీతులేమీ కాదు. వారికేమీ ఎక్స్‌ట్రా కొమ్ములేమీ లేవు.
నిజానికి ఉన్నది ఉన్నట్లు, జగనన్న మనసులోని మాటను ధైర్యంగా, నిర్భయంగా చెప్పిన సజ్జలన్నకు సలామ్ కొట్టాల్సిందే. సజ్జలన్న అలా చెప్పినందుకు ఉద్యోగులు కొంపదీసి కళ్లెర్ర చేస్తారా ఏంటి? అలాంటి
employ-fireసీన్లు ఉంటాయనే.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించలేరు. మీ బెదిరింపులకు మేమేం భయపడబోమని, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి చెప్పిన ట్లు.. ‘నువ్వు ఉరిమిచూసినా ఒకటే నేను ఊరకచూసినా ఒకటే’నని, సజ్జలన్న కొద్దిరోజుల ముందే పిచ్చలైట్ తీసుకున్నారు.
అంటే ప్రతిపక్షంలో ఉండి సవాలక్ష హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగనన్న అండ్ కో కు, రెండున్నరేళ్లకు అనుభవమయిన ఫలితంగా తత్వం బోధపడింది. మరి ఈ రెండున్నరేళ్లలో అన్నీ చూస్తూ,

‘జగనన్న జనరంజక పాలన’లో భాగస్వాములయిన ఉద్యోగులకు మాత్రం, ఇప్పటికీ తత్వం బోధపడకపోవడమే ట్రాజిడీ. ఎన్నికలప్పుడంటే ఏదో సరదాకు జగనన్న, ఎదుటివారి నెత్తిన చెయ్యి పెట్టి సరదాగా సెల్ఫీ తీసుకున్నంత మాత్రాన, ఆయన సీఎం అయితే తాము చెప్పినవన్నీ చేస్తాడనుకుంటే ఎలా? అన్నను అంత అండర్ ఎస్టిమేట్ వేస్తే ఎలా?
వైసీపీ సీమసింహాలు చెప్పినట్లు జగనన్న పులి, సింహం లాంటోడు మరి! ‘యమదొంగ’సినిమాలో ఎన్టీఓడు చెప్పినట్లు.. ‘పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో. పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్కయినా ఫర్వాలేదు. ట్రై చేయొచ్చు. సరే చనువువిచ్చింది కదాని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’. లేటెస్టుగా ‘అత్తారింటికిదారేది’లో పవనన్నయ్య చెప్పినట్లు.. ‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడవేయకూడదు. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫొటో దిగాలనుకోకూడదురోయ్’’ డైలాగులు ఇప్పుడు జగనన్న-ఉద్యోగ నేతలను చూస్తే సరిగ్గా సరిపోతాయన్నది జనవాక్కు.
జగనన్న సీఎం అయిన కొత్తల్లో, ఎంప్లాయిస్ లీడర్లు అన్నయ్య పక్కనే నిలబడి ఫొటోలు తీయించుకుని తెగ సంబరపడ్డారు. ఇహ ఆ తర్వాత అన్నయ్య అపాయింటుమెంట్లే కరవు. ఏదైనా ఉంటే సజ్జలన్నతో
YS-Jagan-with-Secretariat-employeesమాట్లాడటమే దిక్కు. ఆమాటకొస్తే పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకే అన్నయ్య అపాయింట్‌మెంట్లు లేవు. వారితో పోల్చుకుంటే ఉద్యోగ సంఘ లీడర్లెంత? అంతకుముందు చంద్రన్న దగ్గరకు ఎప్పుడంటే అప్పుడు, వితవుట్ అపాయింట్‌మెంట్లతో కలిసే లీడర్లకు ఇప్పుడు అన్ని చోట్లా నో ఎంట్రీ పాపం.
అయినా ఉద్యోగుల పిచ్చిగానీ.. జగనన్న ఏమైనా చంద్రన్నలాంటోడా ఏంటి! ఉద్యోగులకు భయపడి.. వాళ్లు తలచుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని వణికిపోయి అడిగిన వన్నీ చేసేసి, హైదరాబాద్ నుంచి ఎంప్లాయిస్ ట్రైన్ వేయించడానికి?! జగనన్న ఏమైనా చంద్రబాబంత పిరికివాడా ఏంటి! ఉద్యోగులు

ఎప్పుడొచ్చినా కిమ్మనకుండా, వారానికి ఐదురోజులే పనివ్వడానికి?! అప్పట్లో మంత్రులను కూడా ఉద్యోగ సంఘ నేతలు ఖాతరు చేసేవాళ్లు కాదు. మేం సీఎం దగ్గరే తేల్చుకుంటాం అనేవాళ్లు. ఇప్పుడు పాపం సజ్జలన్న అపాయింట్‌మెంట్ కూడా కష్టంగా దొరుకుతోంది. చేసుకున్నవారికి చేసుకున్నంత!
 

LEAVE A RESPONSE