-రాష్ట్రపతి ఎన్నికల్లో హోదా సాధన డిమాండ్ ముందు పెట్టాలి
– హోదా డిమాండ్ పై పట్టు పట్టడానికి ఇదే మంచి అవకాశం -రాష్ట్ర ప్రయోజనాలా? సొంత రాజకీయ ప్రయోజనాలా? జగన్ తేల్చుకోవాలి
విలేకర్ల సమావేశంలో జె డి ఎఫ్ నేతల డిమాండ్
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలంటే ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టుపట్టాలని ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించడానికి జగన్ కు ఇది సువర్ణ అవకాశం అన్నారు.
25 ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతానన్న జగన్… ఈ మూడేళ్లలో కేంద్రం దగ్గర సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలా? వైసిపి రాజకీయ ప్రయోజనాలా? తేల్చుకోవాలని కృష్ణాంజనేయులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రదేశ్ హక్కులని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. తన కేసుల విషయంలో భయపడి బిజెపి దగ్గర హోదా విషయంలో జగన్ మాట్లాడలేకపోతున్నాను అని ఆరోపించారు. ఇప్పటికైనా హోదా విభజన హామీలు సాధించకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మేడా శ్రీనివాస్.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్ర ద్రోహులకు మద్దతిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి వినియోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసేవిధంగా వ్యవహరిస్తే ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. ఆంధ్ర అభివృద్ధి పై విషం కక్కుతున్న మోది, అమిత్ షా ,.బిజెపి పార్టీలకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వరాదని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్ర ప్రయోజనాలనే ప్రధాన ధ్యేయంగా ఆంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దత్తు ఇవ్వాలని, సొంత రాజకీయ ప్రయోజనాలను వదులు కోవాలని పిలుపునిచ్చారు.
పెళ్లకూరు సురేందర్ రెడ్డి,ఏ ఆర్ పి ఎస్ అధ్యక్షుడు:
కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి బిజెపి దగ్గర ఆంధ్ర హక్కు తాకట్టు పెడుతున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అధ్యక్షులు పెళ్లకూరు సురేందర్ రెడ్డి విమర్శించారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి మూడేళ్ళు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్ట్, వెనకబడిన జిల్లాలకు నిధులు సాధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ పై రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.
విటలదేవుని గణేష్ కుమార్,జె డి ఎఫ్ అధ్యక్షుడు:
ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని
జె డి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుమార్ వెల్లడించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎజెండా పైకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.