– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
ఇది నూజివీడులోని అన్నా క్యాంటీన్. తాను పేదలపక్షమనే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దుచేసి వారి నోళ్లుకొట్టాడు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేసి లక్షలాది పేదల ఆకలి తీర్చాం. అధికారంతోపాటు పదిమందికి సాయపడే గుణం కూడా ఉన్నవాడే నిజమైన పాలకుడవుతాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ద్వారా లక్షలకోట్లు పోగేసుకుంటున్న జగన్ కు ఆకలిగొన్న అభాగ్యులకు పట్టెడన్నం పెట్టడానికి మాత్రం మనసు రావడం లేదు. ధనదాహంతో ప్రజల రక్తం తాగుతున్న ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి జగనాసురుడికి అన్నార్తుల ఆకలి విలువ ఎలా తెలుస్తుంది?!