Suryaa.co.in

Andhra Pradesh

అసలు సినిమావస్తే జగన్మోహన్ రెడ్డి, అతని బ్యాచ్ మొత్తం పెట్టాబేడా సర్దుకోవడమే

– మహానాడు వేదికగా రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్ కు గ్యారంటీపేరుతో చంద్రబాబు వదిలిన టీజర్ కే మంత్రులకు మతిపోయింది
• చంద్రబాబు ప్రజల భవిష్యత్ కు గ్యారంటీ అనగానే, జగన్ అతని బృందానికి వారి భవిష్యత్ పై భయం మొదలైంది
• టీడీపీ టీజర్ పై 15మంది మంత్రులు నోటికి పనిచెప్పడం, ప్రభుత్వ, పాలకుల భయానికి నిదర్శనం
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్

“మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు ప్రజల, రాష్ట్ర భవిష్యత్ కు గ్యా రెంటీ పేరుతో విడుదలచేసిన మేనిఫెస్టోపై వైసీపీనేతలు, ప్రభుత్వపెద్దలు, మంత్రు లు గావుకేకలు పెడుతున్నారని, వైసీపీ ప్రభుత్వ పాదాల కింద, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపుపాలనకు బలైన ప్రజల్ని ఆదుకునేదిశగా, టీడీపీ ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పేపర్లుచింపుతూ గంగవెర్రులెత్తుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

టీడీపీ టీజర్ పై 15మంది మంత్రులు నోటికిపనిచెప్పడం, పాలకుల ప్రభుత్వ భయానికి నిదర్శనమనే చెప్పాలి. “ మహానాడులో టీడీపీవదిలిన టీజర్ పై ఇప్పటికే దాదాపు 15మంది మంత్రులు నోళ్లకు పనిచెప్పారంటే, అది ముమ్మాటికీ ప్రభుత్వ, పాలకులభయానికి నిదర్శన మనే చెప్పాలి. రాష్ట్రంలో 4ఏళ్లుగా  వైసీపీ ప్రభుత్వ పాలనతో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకునే దిశగా చంద్రబాబుగారు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో కొన్నిపథకాలు ప్రకటించారు. 18నుంచి 59ఏళ్ల మహిళలందరికీ మహాశక్తిపథకం కింద ప్రతి ఒక్కరికీ నెలకు రూ.1500లు ఇస్తానని చంద్రబాబుగారు ప్రకటించారు. అలానే తల్లికి వందనం పేరుతో చదువుకునే ప్రతిబిడ్డకు సంవత్సరానికి రూ.15వేలు, గ్యాస్ సిలిండర్లధరలు పెరిగి మహిళలు ఇబ్బందులు పడుతున్నం దున ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామనిచెప్పారు. మహిళలకు జిల్లాపరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణ సౌకర్యం కల్పించారు.

ఇవన్నీ మహిళల మహాశక్తిలో భాగమే. నిరుద్యోగసమస్యతో జీవితాలు వెళ్లదీస్తున్న యువతను ఆదుకోవడానికి వారికి భవిష్యత్ పై భరోసా కల్పించడానికి 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగాలు లేని వారికి నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి ఇస్తామని చంద్రబాబు మహానాడు సాక్షిగా ప్రకటించారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలోనిలిపిన జగన్ రెడ్డి నిర్వాకంతో రాష్ట్ర వ్యవసా యరంగం పూర్తిగానిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులకు అండగా నిలిస్తే నే, వ్యవసాయం నిలబడుతుందని భావించిన చంద్రబాబుగారు, ప్రతిరైతుకి ఏటా రూ.20వేల ఆర్థికసాయం అందిస్తానని చెప్పారు. వైసీపీప్రభుత్వ అరాచకాలకు బలైపోతున్న బడుగు, బలహీనవర్గాలవారి రక్షణకోసం ప్రత్యేకచట్టం తీసుకొస్తా మని టీడీపీ అధినేతచెప్పడంజరిగింది. ప్రతిఇంటికీ తాగునీటి కొళాయి సౌకర్యం కల్పిస్తామని, పేదల్ని ధనవం తులుగా చేస్తామని చంద్రబాబు చెప్పారు.

టీడీపీకి 23సీట్లే అని హేళన చేసేమంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు చంద్రబాబు వదిలిన టీజర్ కే ఎందుకింతలా బట్టలు చింపుకుంటున్నారు?
చంద్రబాబు మహానాడులో ప్రకటించింది కేవలం టీజర్ మాత్రమే. దానికే వైసీ పీప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోకు సంబంధించిన కాగితాలుచింపేస్తూ, ఇష్టానుసారం మాట్లాడు తున్నారు. 4ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజల్ని వంచించడం తప్ప జగన్, అతని ప్రభుత్వం చేసిందేమీలేదు. టీడీపీకి 23సీట్లే వచ్చాయని హేళనగామాట్లాడే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్షం వదిలిన టీజర్ కి ఎందుకింతలా బట్టలు చింపుకుంటున్నారు?

అంబటి ఇరిగేషన్ మంత్రి అయ్యాకే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం బ్యారేజ్ గా మారింది
టీడీపీ మినీ మేనిఫెస్టోపై మంత్రి అంబటిరాంబాబు నోరువేసుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఇరిగేషన్ మంత్రి అయ్యాక రాష్ట్రజీవనాడి అయిన పోలవ రం ప్రాజెక్ట్ బ్యారేజ్ గా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరంపై జగన్ అతని పరివారంచేసిన అవినీతిఆరోపణలు అన్నీ అబద్ధాలని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగాచెప్పింది. పులిచింతల ప్రాజెక్ట్ గేటుఊడిపోతే దాన్ని బిగించలేకపోయాడు.

పోలవరంఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని అసమర్థ ఇరిగేషన్ శాఖామం త్రికి చంద్రబాబు గురించి మాట్లాడే నైతికఅర్హతలేదు. రాష్ట్రంలో అత్యధిక డబ్బు జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతల వద్దే ఉంది. క్యాష్ వారివద్ద ఉంటే, ప్రజలు మావైపు ఉన్నారని మంత్రులు గ్రహిస్తే మంచిది. చనిపోయేవారికిచ్చే బీమాసొమ్ములో కూడా కమీషన్లు అడిగిన అంబటి సిగ్గులేకుండా చంద్రబాబుపై విమర్శలు చేయ డం విడ్డూరంగా ఉంది. తనపై ఉన్న అక్రమమైనింగ్ కు సంబంధించిన కేసులపై అంబటిఏం సమాధానంచెబుతారు? తనఇరిగేషన్ శాఖగురించి తప్ప అన్నిశాఖ లగురించి, అందరిగురించి సిగ్గులేకుండా అంబటి మాట్లాడతాడు.

చంద్రబాబుని, టీడీపీని ఇష్టమొచ్చినట్టు తిట్టినాకూడా తనమంత్రిపదవి జగన్ ఎందుకు పీకేశాడో నానీ చెప్పాలి
తనమంత్రి పదవి జగన్ ఎందుకు పీకేశాడో కొడాలినాని సమాధానంచెప్పాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్ససత్యనారాయణల పదవులు ఉంచిన జగన్, నానీ మంత్రిపదవి ఎందుకు పీకేశాడు? నానీ అసమర్థు డు, దోపిడీదారుకాబట్టే జగన్ అతనిపదవి పీకేశాడు. రోజూ టీడీపీని, చంద్రబాబు ని ఇష్టమొచ్చినట్టు తిట్టినాకూడా నానీని ముఖ్యమంత్రి నమ్మలేదు. నాని మంత్రి గా ఉన్నప్పుడు తనశాఖకు సంబంధించి పత్రికల్లో వేసిన ప్రకటనలఫొటోల్లో ఎ ప్పుడైనా జగన్ ఫోటోపక్కన నాని ఫోటో ఉందా?

ప్రభుత్వం తరుపున పత్రికల్లో వచ్చే ప్రకటనలన్నింటిలో నానీఫొటో లేనిసందర్భాలు అనేకసార్లు చూశాం. అతని పేరు మాత్రమే ఎక్కడో ఆ ప్రకటనల చివర ఉంటుంది. అదీ నానీకి జగన్ ఇచ్చే గౌరవం, మర్యాద. అలాంటి వ్యక్తి టీడీపీ మేనిఫెస్టోగురించి, ఎన్టీఆర్ ఫోటోల గురించి మాట్లాడటం అతని అజ్ఞానానికి నిదర్శనం. చంద్రబాబు బీఫామ్ ఇవ్వబట్టే నానీ నేడు రాజకీయాల్లో ఉన్నాడు.

జగన్ ఏలుబడిలో బీసీలపైదాడులు, హత్యలు జరిగినప్పుడు మాట్లాడని జోగి రమేశ్, ఇప్పుడు టీడీపీ మినీమేనిఫెస్టో చింపడానికి పోటీపడుతున్నాడు
జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో బీసీలపై దాడులుజరిగినప్పుడు, వారిని హత్య చేసినప్పుడు, వారిపై తప్పుడుకేసులుపెట్టినప్పుడు ఏనాడూస్పందించని జోగిరమేశ్, ఇప్పుడు టీడీపీమేనిఫెస్టో పత్రాలు చింపుతున్నాడు. రాష్ట్రగృహ నిర్మాణశాఖమంత్రిగా ఉన్న రమేశ్ తనశాఖ, రాష్ట్రంలోని పేదలకు ఎన్నిఇళ్లు కట్టించిందో చెప్పగలడా? 4ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనపథకం కింద 5ఇళ్లుకూడా కట్టలేదని కేంద్రప్రభుత్వమేచెప్పంది. అదీ జోగిరమేశ్ సమర్థత.

గతంలో పోలీసులఅండతో జోగిరమేశ్ చంద్రబాబు ఇంటిపైకి వెళ్లాడు. ఆనాడే మానాయకుడు ఊ అంటే టీడీపీకార్యకర్తలే రమేశ్ ను తన్నితగలేసేవారు. జోగిరమేశ్ చంద్రబాబుగారి ఇంటిపైకివెళ్లాడనే జగన్ అతనికి పిలిచిమరీ మంత్రిపదవి ఇచ్చాడు. గురుకులాల్లో విద్యార్థులబాధలు, ఎస్సీఎస్టీలపై జగన్ చేయిస్తున్న దుర్మార్గాలపై నోరుమెదపని మేరుగనాగార్జున చంద్రబాబుని తిట్టడానికి మాత్రం నోరుతెరుస్తాడు.

సాంఘికసంక్షేమశాఖ మంత్రి మేరుగనాగార్జున టీడీపీని, చంద్రబాబుని తిట్టడం మానేసి, గురుకులపాఠశాలలపై దృష్టిపెడితే మంచిది. గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు నాగార్జునకు కనిపించడంలేదా? డాక్టర్ సుధాకర్ ని జగన్ ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నప్పుడు, దళితయువకుల్ని అన్యాయంగా హత మార్చినప్పుడు నాగార్జున ఎప్పుడూ నోరుతెరవలేదు. సబ్ ప్లాన్ చట్టాన్ని ఉల్లం ఘించి ఎస్సీలకు దక్కాల్సినసొమ్ముని జగన్ దుర్వినియోగంచేస్తుంటే ఒక్కరోజు కూడా నాగార్జున మాట్లాడలేదు. తననియోజకవర్గంలో జరిగే ఇసుకదోపిడీపై నాగార్జునకు తెలియదా?

కాకాణి వ్యవసాయమంత్రి కావడం రైతులదౌర్బాగ్యం
రాష్ట్ర రైతాంగం అకాలవర్షాలకు హాలక్ష్మణా అని విలపిస్తుంటే, వారిని పట్టించుకోని వ్యవసాయశాఖమంత్రి టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలుచేస్తున్నాడు. తనకు పదవి ఉంది చంద్రబాబుని తిట్టడానికే అన్నట్టు కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడటం నిజంగా రాష్ట్రరైతాంగం పాలిట దౌర్భాగ్యమనే చెప్పాలి. వ్యవసాయరంగాన్ని నిలబెట్టి, రైతుల్ని ఆదుకో వడం అంటే, కోర్టుల్లోని ఫైళ్లు మాయంచేసినంత తేలిక కాదని ఇప్పటికైనా గోవర్థన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది.

మంత్రి అయ్యాక భూములు, దేవాదాయశాఖసొమ్ము, భక్తులవిరాళాలు కొట్టేసికొట్టేసి ‘కొట్టు’ కోట్లకు పడగలెత్తాడు
దేవాదాయశాఖమంత్రిగా ఉన్న కొట్టుసత్యనారాయణకు తనశాఖలో జరిగే అవినీ తి తప్ప, రాష్ట్రంలోనిఅన్ని విషయాలు కావాలి. మంత్రి అయ్యాక సత్యనారాయణ దాదాపు రూ.1000కోట్లు కాజేశాడని ఆయన నియోజకవర్గవాసులే చెబుతున్నా రు. లిటిగేషన్ ల్యాండ్స్ ని సెటిల్మెంట్ చేసే పేరుతో సత్యనారాయణ కొట్టేసిన భూ ములకు లెక్కేలేదు. దేవాదాయశాఖకు భక్తులు ఇచ్చే విరాళాలసొమ్ముని కాజే యడం, దర్శనంటిక్కెట్లు ఎక్కువధరకు అమ్ముకోవడం ఇవీ సత్యనారాయణకు తెలిసింది. జగన్ మెప్పుకోసం ఇటీవల విజయవాడలో ప్రభుత్వసొమ్ముతో యాగాలు, యజ్ఞాలు నిర్వహించిన కొట్టుసత్యనారాయణ, ప్రజల్ని బలవంతంగా బస్సుల్లో తరలించి తనస్వామిభక్తిని చాటుకున్నారు.

చంద్రబాబుకి భద్రత ఎందుకంటున్న తమ్మినేని, పోలీసులు భద్రతాసిబ్బంది లేకుండా ఒక్కరోజు ప్రజల్లోకి వెళ్లగలడా? అతనికి అంతధైర్యముందా? దొంగసర్టిఫికెట్లు, దొంగడిగ్రీలతో స్పీకర్ స్థానం పరువుతీసిన వ్యక్తిగా తమ్మినేని చరిత్రలో నిలిచిపోతాడు. స్పీకర్ స్థానంపరువుతీసిన వ్యక్తిగా తమ్మినేని సీతారాం రాష్ట్రచరిత్రలో నిలిచిపో తాడు. చంద్రబాబుగారికి ఎన్.ఎస్.జీ కమెండోలు ఎందుకు అంటున్న తమ్మినేని ఒక్కరోజు తనచుట్టూ భద్రతాసిబ్బంది లేకుండా తననియోజకవర్గంలో తిరగగలడా అని ప్రశ్నిస్తున్నాం.

98 శాతం హామీలు నెరవేర్చాము.. ప్రజల్ని ఉద్ధరించాము అంటున్న జగన్మోహన్ రెడ్డి, అతని ఎమ్మెల్యేలు, మంత్రులకు నిజంగా దమ్ము, ధైర్యముంటే ఎలాంటి పోలీస్ బందోబస్త్, భద్రతాసిబ్బంది లేకుండా ప్రజల్లోకి వెళ్లి వారితో నేరుగా మాట్లాడగలరా అని సవాల్ చేస్తున్నాం. పోలీసులులేకుండా ఈ ప్రబుద్ధులు ప్రజల్లోకి వెళ్తే తన్నితరిమేయకపోతే చూడండి. సుభాషితాలు మాట్లా డే తమ్మినేని ఏంచదివాడు? తనఎన్నికల మేనిఫేస్టోలో తాను బీ.ఏ డిస్ కంటి న్యూ చేశానని చెప్పి, లా ఎలాచదివాడో చెప్పాలి. ఎల్.ఎల్.బీ చదవాలంటే మూడే ళ్ల డిగ్రీ పూర్తికావాలి. డిగ్రీలేకుండానే తాను ఎల్.ఎల్.బీ అడ్మిషన్ ఎలాపొందాడో తమ్మినేని చెప్పాలి. దొంగసర్టిఫికెట్ తో దొంగచదువులు చదివిన తమ్మినేని చంద్ర బాబు గురించి మాట్లాడటం చూశాక ఛీ అనక ఏమనాలి?

అసలుసినిమా వస్తే జగన్మోహన్ రెడ్డి సహా అందరూ పెట్టాబేడా సర్దుకోవాల్సిందే
టీడీపీ ప్రజలకోసం ప్రకటించిన మినీమేనిఫెస్టోపై సోకాల్డ్ పెద్దమనుషులు, మేథా వులు, పనికిరాని మంత్రులు, ప్రజల్నిదోచుకోవడమే పనిగా పెట్టుకున్నవారు ఎం దుకింతలా పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారు? వారి రాజకీయజీవితం ముగిసిపో యేలా చంద్రబాబు విడుదలచేసిన టీజర్ ఉందికాబట్టే, వారిలో భయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి అరాచకానికి, విధ్వంసానికి ప్రజలు ముగింపుపలికే రోజులు దగ్గరపడ్డాయి. టీడీపీ టీజర్ కు మం త్రులకే మతిపోయింది.. పూర్తిసినిమా వస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాబేడా సర్దుకోవాల్సిందే.” అని ధూళిపాళ్ల తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE