– శాసనమండలి మాజీ అధ్యక్షులు ఎం ఏ షరీఫ్
చట్టసభలకు ఉన్న గౌరవాన్ని ఔనిత్యాన్ని మంట కలిపే విధంగా ఈరోజు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మాట్లాడటం బాధాకరం. రాజకీయాలకతీతంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించవలసిన స్పీకర్ ఈరోజు తనకున్న హద్దులను పరిధులను అతిక్రమించి చంద్రబాబు నాయుడు గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ప్రజాస్వామ్య విధానాలకు, చట్టసభల సాంప్రదాయాల విలువలకు తీవ్ర విఘాతం కలిగించినారు.
చంద్రబాబు నాయుడు కి రోజురోజుకు పెరుగుతున్న ప్రజలలో ఆదరణ చూసి ఓర్వలేక, అహంతో, రాజకీయ అక్కసుతో వెళ్ళ కక్కేన మాటలు తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారి ఉన్నా జెడ్ ప్లస్ రక్షణ తొలగిస్తే చంద్రబాబునాయుడు గారు “ఫినిష్ “అని ఒక శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ మాట్లాడే మాటలు కావు. వారు తన స్థాయిని మరిచి గల్లి లీడర్గా కంటే హీనంగా మాట్లాడి ప్రజల ఛీత్కారానికి ఆయన గురి అవుతున్నారు అనే విషయాన్ని వారు గమనిస్తే మంచిది .
రాబోయే రోజులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సహా మీరందరూ, రాజకీయంగా ఫినిష్ అయ్యే రోజులు దగ్గరపడ్డాయి, అనే విషయాన్ని గుర్తుఎరిగి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు కూడా గల్లంతు చేసే పరిస్థితి దాపురిస్తుంది జాగ్రత్త..