– రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్
యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లాతో పాటు, రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తలకు చెప్పలేనంత ఉత్సాహాన్ని ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని అమలు చేయలేదు. సీఎం అయిన దగ్గర్నుండి మాట తప్పడం, మడమ తిప్పడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రజావేదిక కూల్చివేత మొదలు రుషికొండకు బోడిగుండు కొట్టిన వరకు విధ్వంస పాలనే జగన్ చేస్తున్నాడు.
25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదాను కేంద్రం మెడలు వంచి తెస్తానని అన్నాడు. నమ్మిన ప్రజలు ఎంపీలను ఇస్తే తన 31కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద మెడలు వంచాడు. వివేకా హత్యలో హంతకులను కాపాడడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టాడు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటిన వ్యక్తి ఎన్టీఆర్. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చి తెలుగువారి ఖ్యాతిని కాపాడాలని కోరుతున్నా.
లోకేష్ రెండు పాదాల వెనుక మరో 10 కోట్ల పాదాలు నడుస్తున్నాయి: శాసనమండలి సభ్యుడు పర్చూరి అశోక్ బాబు
వైసీపీ నాయకులు శాసనసభ, మండలిలో చేసిన అరాచకాల వీడియోలను ప్రజలు చూస్తే కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ప్రజాప్రతినిధులు అయ్యే అర్హత లేదు.లోకేష్ రెండు పాదాల వెనుక మరో 10కోట్ల పాదాలు నడుస్తున్నాయి…నడవడానికి సిద్ధంగా ఉన్నాయి.
యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా మిగులుతుంది.2023మార్చిలో 3 ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతోనే టీడీపీ విజయానికి నాంది. ప్రజలంతా తమ ఓట్లు జాబితాలో ఉన్నాయో, లేదో బాధ్యతగా చూసుకోవాలి.జగన్, మరికొంత మంది వెధవల గురించి మాట్లాడడం సమయం వృథా. బిడ్డకు తల్లిపాలు ఎంత అవసరమో…రాష్ట్రానికి చంద్రన్న పాలన అంతే అవసరం.
గుడివాడ గుట్కా కొడాలి నాని, గన్నవరం పశువుల డాక్టర్ వల్లభనేని వంశీకి రాజకీయ సమాధి: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
గుడివాడ గుట్కా కొడాలి నాని, గన్నవరం పశువుల డాక్టర్ వల్లభనేని వంశీకి జిల్లా ప్రజలు రాజకీయ సమాధి కడతారు. కృష్ణాజిల్లా ఆడపడుచు భువనేశ్వరిని కొడాలి నాని, వల్లభనేని వంశీ అవమానించిన రోజునే మేమంతా చచ్చిపోయాం. సమయం లేదు మిత్రమా… వీళ్లను ఇంటికి తరిమికొట్టడానికి జిల్లా ప్రజలంతా సిద్ధమా?
అమెరికాలో చదువుకుని, ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి లోకేష్ ను కించపరిచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి తరిమికొట్టాలి… చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి.వల్లభనేని వంశీ పంచ భూతాలను, కొండలు, గుట్టలు, ఇసుక, మట్టిని, కోట్లాది రూపాయలను దిగమింగాడు.
మా కార్యకర్తల కష్టంతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు. నీకు సిగ్గు ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లో నీపై ఎంత సానుభూతి ఉందో పరీక్షించుకోవాలి. సైకో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేశాడు. రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి…సైకిల్ రావాలి.
గన్నవరం సభ.. విజయభేరి సభ: మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్
4వేల కిలోమీటర్లు 400రోజుల్లో సాధ్యమేనా అని రాష్ట్రమంతా చర్చించుకుంది. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ విజయం ఖాయం అనేది చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతున్నారు.
గన్నవరం సభ విజయభేరి సభగా భావిస్తున్నాను. పార్టీ సిద్ధంతాలకు అనుగుణంగా గన్నవరం పార్టీ సభ్యులు చైతన్యవంతులుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో పసుపుజెండా ఎగరబోతుంది.
వైసీపీ దోపిడీతో రాష్ట్రం నాశనమైంది: మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత, రైతులు, అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ దోపిడీతో రాష్ట్రం నాశనమైంది. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.అందుకే యువగళం పాదయాత్రకు కదం తొక్కుతున్నారు. ఇదే స్ఫూర్తిని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించి పార్టీ విజయానికి పనిచేయాలని కోరుతున్నా.
వంశీ ఇప్పటి వరకు తెలుగుదేశం భిక్షతోనే బ్రతికి ఉన్నాడు: శాసనమండలి మాజీ సభ్యులు బుద్దా వెంకన్న
వల్లభనేని వంశీ భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాడు. వల్లభనేని కాన్వాయ్తో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ రాజకీయంగా కార్యకర్తల చేతిలో సమాధి కాబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో ఫస్ట్ వికెట్ పడిపోయేది వల్లభనేని వంశీదే. గుట్కా నాని గంజాయి, గుట్కా మత్తులో గుడివాడలో తేలుతున్నాడు.విజయవాడలో త్రీ ఇడియట్స్ ఉన్నారు…వీళ్లు బైక్ ర్యాలీ చేస్తామంటున్నారు. ఒకడు వెండి సింహాల దొంగ, మరొకడు క్యాబరీ డ్యాన్సుల పిచ్చోడు, మరొకడు ఎటు ప్రభుత్వం మారితే అటు పారిపోయేవాడు. చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నాం.