Suryaa.co.in

Andhra Pradesh

పాపపు సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి

-కూల్చడం తప్ప నిర్మాణం చేతగాని జగన్ రెడ్డి
-సిగ్గులేకుండా మేం నిర్మించిన ఇళ్లకు వైసిపి రంగులు మాత్రం వేసుకున్నారు
-టిడ్కో ఇళ్లంటినీ పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తాం
-యువనేత లోకేష్ ను కలిసిన టిడ్కో గృహాల లబ్ధిదారులు, సిపిఐ ప్రతినిధులు

• మదనపల్లి రూరల్ వెంకటప్పకొండలో టిడ్కో గృహాల సముదాయం వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించిన టిడ్కో గృహాల లబ్ధిదారులు, సిపిఐ ప్రతినిధులు.
• పేదలు కూడా విలాసవంతమైన ఇళ్లలో నిర్మించాలన్న లక్ష్యంతో టిడిపి ప్రభుత్వం 2018లో వెంకటప్పకొండ వద్ద 3,773 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
• ఇందులో 365, 300 చదరపు అడుగులతో 1872 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు.
• టిడ్కో గృహాల సముదాయంలో అన్ని సౌకర్యాలతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్, వైద్యశాల, స్కూలు పిల్లలు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలతో పార్కు, అంగన్ వాడీ కేంద్రం వంటివాటిని అప్పట్లో ప్రతిపాదించారు.
• వైసిపి ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు.
• గత ప్రభుత్వంలో 80శాతం పూర్తయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 45నెలలుగా పూర్తిచేసి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
• ఫలితంగా బయట అద్దెలు చెల్లించుకోలేక నానా అగచాట్లు పడుతున్నాం.
• సిపిఐ ఆందోళనతో పెద్దఎత్తున పోరాటంచేశాక టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదు.
• ఇళ్లు రద్దుచేసిన వారికి డిపాజిట్లు కూడా ఇప్పటివరకు వెనక్కి ఇవ్వలేదు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి మాకు అందించే ఏర్పాటుచేయండి.
నారా లోకేష్ మాట్లాడుతూ….
కూల్చడం తప్ప నిర్మాణం చేతగాని జగన్ రెడ్డికి రాష్ట్రప్రజలు అధికారం కట్టబెట్టారు.
• పేదలు కూడా విలాసవంతమైన ఇళ్లలో నివసించాలన్న ఉద్దేశంతో టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 166 ప్రాంతాల్లో 3.13 లక్షల టడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టాం.
• అత్యాధునిక షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టి సెక్రటేరియల్ వేసిన అందమైన టైల్స్ ఈ గృహాల నిర్మాణాల్లో వినియోగించాం.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము నిర్మాణాలను ప్రారంభించిన వాటిలో 51వేల ఇళ్లను వివిధ సాకులు చూపి రద్దుచేసింది.
• మిగిలిన 2.62 లక్షల ఇళ్లను పూర్తిచేసి ఇస్తామని చెప్పి 45నెలలైనా ఎటువంటి పనులు చేపట్టకుండా పాడుబెడుతున్నారు.
• సిగ్గులేకుండా మేం నిర్మించిన ఇళ్లకు వైసిపి రంగులు మాత్రం వేసుకున్నారు.
• టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లలో 2లక్షల ఇళ్లనిర్మాణం దాదాపు పూర్తయిందని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా చెప్పింది.
• పాపపు సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి పేదప్రజలు గూడు కష్టాలు పట్టకపోవడం విచారకరం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసంపూర్తిగా నిలచిపోయిన టిడ్కో ఇళ్లంటినీ పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తాం.

LEAVE A RESPONSE