Suryaa.co.in

Telangana

జిహాదీలకు అడ్డాగా మారుతున్న తెలంగాణ

ప్రేమించాడనే నెపంతో ఇంట్లోకి చేరబడి కత్తులతో పొడిచి హత్య
పవన్ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
దోషులను ఉరి తీయాలి
బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం

“తెలంగాణ రాష్ట్రంలో హిందువుల హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది. హైదరాబాద్ నగరం జిహాదీలకు అడ్డాగా తయారైంది” అని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. భాగ్యనగర్ శివారు ప్రాంతమైన బాలాపూర్ లో బుధవారం అర్ధరాత్రి పవన్ నాయక్ అనే గిరిజన యువకుడిని ముస్లింలు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. తమ కూతురిని ప్రేమిస్తున్నాడని.. అందుకు తమకు మూడు లక్షల రూపాయలు జరిమానా కట్టాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.

అయితే మూడు లక్షలు కూడా కట్టేందుకు పవన్ నాయక్ తండ్రి ఫుల్ సింగ్ ఒప్పుకున్నాడు. అందుకు కొంత సమయం కావాలని ప్రాధేయపడ్డాడు. కానీ ఇంతలోనే ఇంటిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి చంపడం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వెల్దండ మండలం కేస్లీ తండా వాసి పూల్ సింగ్ నాయక్ తన భార్య, కుమారుడు పవన్(22) కూతురుతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. అయితే బాలాపూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి కత్తులతో వచ్చి వీరంగం సృష్టించారు.భోజనం తర్వాత వాష్ రూమ్ కు వెళ్లి వస్తున్న పవన్ ను దుండగులు అతికిరాతంగా మట్టు పెట్టారు.

ఈ విషయాన్ని వెలుగులోకి రానివ్వకుండా పోలీసులు జాగ్రత్త పడటం విచిత్రం. పోలీసుల చర్యలను తప్పుపడుతూ.. ఇది ప్రభుత్వపు హత్యగానే భావించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కారణం చేత నరికి చంపి నిందితులు పరారైన విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ బాధితులకు బాసటగా నిలిచింది. గురువారం ఉదయం రాచకొండ కమిషనర్, మహేశ్వరం డిసిపిలతో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ దగ్గరికి వెళ్లి బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవన్ నాయకులు హత్య చేసిన దోషులను ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, రేగు అనిల్, మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా గిరిజనులు, దళితులపైనే రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి హత్యలు చేస్తుందన్నారు. మొన్న ప్రీతి హత్యకు పాల్పడిన సైఫ్ ను.. నేడు పవన్ నాయక్ హత్యకు పాల్పడిన దుండగులను కాపాడేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని వారు ఆరోపించారు.

కేసిఆర్ ప్రభుత్వంలో హిందువుల మనుగడ ప్రమాదంలో పడిందని.. ప్రతి హిందువు చైతన్యవంతమై ప్రభుత్వం తిరగుబడాలన్నారు. పవన్ కుటుంబానికి న్యాయం చేయాలని.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనకు సిద్ధమవుతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A RESPONSE