Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ కోసం వ్యాపారులపై వేధింపులు

– వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలు
– అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం
– ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం
– నారా లోకేష్ ను కలిసిన విజయవాడ ఆర్యవైశ్యులు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ వినాయక గుడి వద్ద ఆర్యవైశ్య సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• టీడీపీ పాలనలో ఆర్యవైశ్యులకు దక్కిన గౌరవం, అందిన అవకాశాలు మరువలేనివి.
• ఎన్నికల్లో సీట్లు, నామినేటెడ్ పదవులు, వివిధ స్థానాల్లో పదవులు ఇచ్చి ప్రోత్సహించారు.
• ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టి నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుది.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక మా కార్పొరేషన్ కు నిధులు కేటాయించలేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం మాకు నిధులు కేటాయించాలి.
• నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం అవకాశాలివ్వాలి.
• విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలి.
• మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి.

నారా లోకేష్ స్పందిస్తూ….
• జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
• రకరకాల పన్నులతోపాటు జె-ట్యాక్స్ కోసం వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
• వైసిపి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు.
• ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు.
• నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం.
• అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం.
• ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తాం.
• ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.

మాటతప్పడం, మడమతిప్పడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య

విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ వర్కర్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• రాష్ట్రవ్యాప్తంగా7,895మంది గ్రేడ్-2 జూనియర్ లైన్ మెన్లుగా 2019 అక్టోబర్ లో విధుల్లో చేరాం.
• 2సంవత్సరాలు ప్రొవిజన్ కాలం ముగిసినా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు.
• తాజాగా ధర్నా చేయడంతో మా రెగ్యులేషన్ ఆర్డర్ ఇచ్చి, అందులో కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ ఉంటాయని పేర్కొన్నారు.
• దీనివల్ల మాకు తీవ్రంగా నష్టం కలుగుతుంది.
• ఒకవైపు డిపార్ట్ మెంట్ పనులు, మరోవైపు సచివాలయం పనులు చేస్తూ అలసిపోతున్నాం.
• మాకు సచివాలయం పేస్కేల్ అడాప్ట్ చేశారు. కానీ డిపార్ట్ మెంట్ హైరిస్క్ పనులన్నీ మాతోనే చేయిస్తున్నారు.
• 2019 నుండి నేటికి 129మంది చనిపోయారు. 250మంది గాయపడ్డారు.
• మేము సచివాలయం ఉద్యోగులమా? డిపార్ట్ మెంట్ ఉద్యోగులమా నిర్ణయించాలి.
• సచివాలయ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5వరకే పని చేయించాలి.
• డిపార్ట్ మెంట్ ఉద్యోగులమైతే లైన్ మెన్లకు ఇచ్చే పే స్కేలు, అలవెన్స్ ను మాకు అడాప్ట్ చేయాలి.
• మాకు రాష్ట్ర ఖజానా నుండి జీతాన్ని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• మాటతప్పడం, మడమతిప్పడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య.
• తమ న్యాయమైన డిమాండ్లకోసం పోరాడే ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనివిధంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది.
• జూనియర్ లైన్ మెన్ల సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
• వారు పరిష్కరించకపోతే టిడిపి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తాం.
• పేస్కేల్స్ విషయంలో ఎలక్ట్రికల్ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.

సైకోపాలనలో పేదవాళ్ల బ్రతుకులు ఛిద్రమయ్యాయి

– లోకేష్ ను కలిసిన ముఠా వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
• విజయవాడ కాళేశ్వరరరావు మార్కెట్ క్లాత్ ముఠావర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మేం 40ఏళ్లుగా విజయవాడ వస్త్రలత సముదాయంలో ముఠా కార్మికులుగా ఉన్నాం.
• టీడీపీ పాలన వరకు మేం ఎలాంటి ఇబ్బందులు చవిచూడలేదు.
• వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో మా పరిస్థితులు దుర్భరంగా మారాయి.
• కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టతరంగా మారింది.
• నిత్యావసరాలు, కరెంటు బిల్లులు, ఇతర చార్జీలు, గ్యాస్ ధరలు, పన్నులు పెంచేశారు.
• మాలాంటి హమాలీలు బతుకుబండి లాగడం ఇబ్బందిగా మారింది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• నాలుగేళ్ల సైకోపాలనలో పేదవాళ్ల బ్రతుకులు ఛిద్రమయ్యాయి.
• పేదవాడినని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ అన్నాక్యాంటీన్లు రద్దుచేసి పేదోళ్ల నోటికాడ కూడు తీసేశాడు.
• ఇంటిపన్నులు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాడి బతుకును ఛిద్రంచేశారు.
• టిడిపి అధికారంలోకి రాగానే ప్రజలపై మోపిన అన్నిరకాల భారాలను సమీక్షించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం.
• అన్నాక్యాంటీన్లను పునరిద్దించి పేదవాళ్ల ఆకలి తీరుస్తాం.
• ముఠా కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.

LEAVE A RESPONSE