– సీబీఐ అతన్ని విచారిస్తేనే అసలు దోషులెవరో తేలుతుంది.
• వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలోసీబీఐ ద్వారా బయటకువస్తున్న అంశాలపై వై.ఎస్.విజయమ్మ, షర్మిలలు ఎందుకు మాట్లాడటంలేదు?
• జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంకోసం ఊరూరా తిరిగిన అమ్మా,కూతుళ్లు ఇప్పుడు మౌనంగా ఉండటంలోని ఆంతర్యం ఏమిటి?
• వారి మౌనం, వివేకానందరెడ్ఢిహత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని అంగీకరిస్తున్నారనే భావనకు సంకేతమా?
• సీబీఐ విచారణలో కీలక అంశాలు వెల్లడించిన దస్తగిరి, సునీత, ఆమెభర్తలకు కేంద్రప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలి
– మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యజరిగి మరోపదిరోజుల్లో మూడేళ్లు అవుతోందని, హాత్యకేసుకి సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటి గా సీబీఐవిచారణలో బయటపడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖ ర్ రెడ్డికి, వివేకానందరెడ్డి అంటే ఎనలేని ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు ఉండేవ ని, వై.ఎస్.కుటుంబపు కోటగా పులివెందుల నియోజకవర్గాన్ని అభివర్ణిస్తుంటారని, అలాంటికోటలో వివేకాహత్యజరగడం యావత్ రాష్ట్రాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. 2019 మార్చి 14న వివేకానంద రెడ్డి హత్యజరిగితే, మార్చి10వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.
రాజకీయనేతలు, మీడియా మొత్తం ఎన్నికలప్రచారంలో తలమునకలై ఉండగా తనచిన్నాన్న హత్యజరిగితే, జగన్మోహన్ రెడ్డి దాన్ని చంద్రబాబు, లోకేశ్ లకు ఆపాదించి నానాయాగీ చేసి సిగ్గులేని విధంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు, ఆయన బురదమీడియా అయినా సాక్షిలో వివేకానందరెడ్డిని చంద్ర బాబే చంపించాడంటూ బరితెగించి ప్రచారంజరిగింది. కానీ సీబీఐ విచారణలో వివేకాహత్యతాలూకా వాస్తవాలు ఒక్కొక్కటిగా బయ టకు వస్తుంటే, నేడు ప్రజలంతా అవిచూసి ఛీత్కరించుకుంటున్నారు.
సొంతబాబాయ్ ని చంపినవారిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ఏకంగా తనముఖ్యమంత్రి పదవినే అడ్డంపెట్టాడు. వివేకాహత్య కేసుని సీబీఐ విచారణకు అప్పగించాలంటూ మార్చి 19, 2019న హైకోర్ట్ లో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రయ్యాక దాన్ని 2020 ఫిబ్రవరి-06న వెనక్కుతీసుకున్నాడు. కేవలం ఎన్నికల సమయంలో బాబాయ్ హత్యని వాడుకొని రాజకీయంగా లబ్ధిపొందిన జగన్మోహన్ రెడ్డి తానుఅనుకున్నది సాధించాడు.
వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత నానా అవస్థలుపడి కోర్టులను ఆశ్రయించి వివేకాహత్యకేసుని సీబీఐ విచారణకు అప్పగించేలా చేశారు. వారి విజ్ఞప్తితో న్యాయస్థానం వివేకాహత్యకేసుని సీబీఐ విచారణకు అప్పగిస్తే, జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకోవడానికి సామ, దాన, బేధ, దండోపాయాలన్నీంటినీ ఉపయోగించాడు…నేటికీ ఉపయోగిస్తూనే ఉన్నాడు.
సీబీఐ విచారణలో ఇప్పటివరకు దాదాపు 220మంది వారివారి వాంగ్మూలాలు చెప్పారు. వారందరి వాదనలు విన్నాక వివేకానం దరెడ్డిని చంపింది ఇంటిదొంగలేనని తేలిపోయింది. వివేకానందరెడ్డి వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసి, మానేసిన దస్తగిరి ఏ1గా సీబీఐ ఛార్జ్ షీట్లో ఉన్నాడు. అతని వాంగ్మూలంలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. అతనుఅప్రూవర్ గా మారడంతో వివేకాహత్య సూత్రధారి, ఇప్పుడుఎంపీగా ఉన్నఅవినాశ్ రెడ్డికి దడ మొదలైం ది. సొంత బాబాయ్ చనిపోయినప్పుడు దాన్ని గుండెపోటు గా చిత్రీకరించిన జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి , సాక్షిమీడియా ఇప్పుడుకూడా అదేవిధమైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప, వాస్తవాలు చెప్పడంలేదు.
వివేకానందరెడ్డి కుమార్తె సునీత సీబీఐ కి ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలుచూశాక , జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం, దారుణత్వం బట్టబయలు అయ్యాయి. తనతండ్రిహత్య కేసువిచారణను సీబీఐకి అప్పగించేలా చూడాలని తాను జగన్మో హన్ రెడ్డిని కోరానని, ఆయన అవినాశ్ రెడ్డే చంపించాడని, అతని పై ఇప్పటికే 12వరకుకేసులున్నాయని, ఈకేసుని సీబీఐకి అప్ప గించినంతమాత్రాన అతనికి ఏమీకాదని చెప్పాడనిచెప్పింది. ఒక వేళ సీబీఐవిచారణజరిగితే అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరతాడని జగన్ చెప్పడం, దోషిని వెనకేసుకురావడం ఎంతటిదుర్మార్గమో ప్రజలంతా ఆలోచించాలి.
అదే సునీత అప్పుడు డీజీపీగా ఉన్న సవాంగ్ ని కలిస్తే, ముఖ్యమంత్రి అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శంక ర్ రెడ్డి తనకు రెండుకళ్లు అనిచెబుతున్నాడని, ఈకేసు విషయం లో తానేమీ చేయలేనని ఆమెకు చెప్పింది వాస్తవం కాదా? అదే విషయాన్ని సునీత తనవాంగ్మూలంలో సీబీఐకిచెప్పింది. ఇలా సునీతచెప్పిన అంశాలతో పాటు, ఆమె భర్తవాంగ్మూలంకూడా వివేకానందరెడ్డిని హత్యచేసియించింది అవినాశ్ రెడ్డేనని, ఆయన్ని కాపాడుతోంది ముఖ్యమంత్రిగాఉన్న జగన్మోహన్ రెడ్డే నని స్పష్టంచేస్తున్నాయి.ముఖ్యమంత్రిగారికి మేనమామ అయిన వై.ఎస్.రవీంద్రరెడ్డి ప్రమేయాన్నికూడా సీబీఐ నిగ్గుతేల్చింది. ఇలా అనేక అంశాలు వివేకానందరెడ్డి హత్యలో ముఖ్యమంత్రి, అవినాశ్ రెడ్డిల పాత్రను ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నా కూడా,ఇప్పటికీ వైసీపీనేతలు దుర్మార్గంగా బరితెగించి మాట్లాడుతున్నారు.
ఈ కేసులో సీబీఐ కచ్చితంగా ముఖ్యమంత్రిని విచారించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. వివేకా హత్య కేసు విచారణను దారిమళ్లించే లా సజ్జలరామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత చంద్రబాబుగారి ట్రాప్ లో పడిందని, ఆయనే ఆమెతో అలాచెప్పించాడని సిగ్గులేకుండా, నోటికొచ్చినట్లు మాట్లా డుతున్నాడు. నిజంగా సునీతతో చంద్రబాబే అలాచెప్పించాడని సజ్జల భావిస్తే, అదేమాటను అతను ముఖ్యమంత్రితోకూడా చెప్పించాలి.
జగన్మోహన్ రెడ్డి తల్లివిజయమ్మ, చెల్లిషర్మిలలు కూడా సజ్జలచెప్పినట్టుగా చెప్పగలరా అనిప్రశ్నిస్తున్నాం. తండ్రిని ఎవరుచంపారో తెలియక, నిత్యం నరకయాతన అనుభవిస్తున్న సునీత వ్యాఖ్యలనుకూడా తప్పుపట్టేలా సజ్జల మాట్లాడటం ఎంత టిదుర్మార్గమో చెప్పాల్సిన పనిలేదు. సజ్జలచెప్పింది నిజమేనని విజయమ్మ, షర్మిలకూడా ఒప్పుకుంటే, అప్పుడు ఆకుటుంబం ఎలాంటిదో ప్రజలకు అర్థమవుతుంది. ప్రజాజీవితంలో ఉండి ఇష్ట మొచ్చినట్లు మాట్లాడతాం.. తాముఅనుకున్నట్లు చేస్తామంటే చూస్తూఊరుకోము. వివేకాహత్యతో లబ్ధిపొందిన తొలివ్యక్తి జగన్మో హన్ రెడ్డే. వివేకానందరెడ్డి హత్యకు నైతికబాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామాచేయాల్సింది కూడా అతనే.
తనస్వార్థంకోసం, తనరాజకీయ జీవితంకోసం తరతమ బేధా లులేకుండా జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా చంపుతాడు అనడానికి వివేకానందరెడ్డి హత్యే నిదర్శనం. అలాంటి వ్యక్తిని సీబీఐ వెంటనే అదుపులోకి తీసుకుంటేనే వివేకాను చంపిన అసలుదోషుల గుట్టు రట్టు అవుతుంది. సీబీఐ ఎక్కడా,దేనికి వెరవకుండా అసలు దోషు లను జుట్టుపట్టి బయటకుఈడ్చుకురావాలని కోరుతున్నాం. వివే కానందరెడ్డి హత్యకేసు విచారణతీరు, సీబీఐకి అందుతున్న సాక్ష్యా ధారాలపై వై.ఎస్.విజయమ్మ, షర్మిలలుకూడా స్పందించాల్సిందే నని డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయడంకోసం ఊరూరా బైబిల్ పట్టుకొనితిరిగిన వారు ఇప్పుడు ఇంతజరిగుతున్నా మౌనంగా ఉంటామంటేకుదరదు. వారు అలాఉంటే మౌనంఅర్థాంగీకారమనే ప్రజలు భావిస్తారు. సీబీ ఐ విచారణలో కీలక సాక్షులుగా ఉన్న దస్తగిరితో ఇతరులకు, ముఖ్యంగా వివేకాకుమార్తె సునీత, ఆమెభర్తకు కేంద్రబలగాలతో రక్షణకల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నాం.
వారిప్రాణాల కు ఎప్పుడుఏమైనాజరగొచ్చు అనిచెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సాక్షులుగా వారు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలా లపై అధికారంలోఉన్నవారు ఏకీభవించకుండా, వారిపైనే ఎదురు దాడిచేస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.