-గజదొంగ జగన్ రెడ్డి పాలనలో వైసిపి ఎమ్మెల్యే మాఫియాలుగా తయారయ్యారు
-రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు రానీయం
-యువనేత నారా లోకేష్
యువనేతను కలిసిన ధాన్యం రైతులు
కోవూరు నియోజకవర్గం నార్త్ రాజుపాలెంలో ధాన్యం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మాది డెల్టా ప్రాంతమైన వరిపంట ఎక్కువగా పండిస్తున్నాము. గత నాలుగేళ్లుగా ధాన్యం దిగుబడులు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.30వేల నుంచి 40వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదు. ఆర్ బికె ల్లో అధికారపార్టీ వారికి చెందిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.నెమ్ముపేరుతో పుట్టికి 7వేల రూపాయల తక్కువకు ధాన్యం కొంటున్నారు.ధాన్యం డబ్బు కూడా ఆరునెలల వరకు చెల్లించడం లేదు.2సంవత్సరాల క్రితం ధాన్యం ట్రాన్స్ పోర్టు డబ్బులు ఇప్పటికీ అందించలేదు. రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి మమ్మల్ని మోసగిస్తున్నారు. ఈ నష్టాలను భరించలేక మేము రెండేళ్లు క్రాప్ హాలిడే ప్రకటించాము. మీ ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం చేయండి. – నార్త్ రాజుపాలెంలో యువనేత లోకేష్ తో రైతులు
నారా లోకేష్ మాట్లాడుతూ…
ధాన్యం కొనుగోళ్లలో వైసిపి నేతలు మాఫియాగా మారి ఒక్క నెల్లూరు జిల్లాలోనే వెయ్యికోట్లు దోచుకున్నారు.కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రైతులను ముంచేసి 50కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారు. గజదొంగ జగన్ రెడ్డి పాలనలో వైసిపి ఎమ్మెల్యే మాఫియాలుగా తయారయ్యారు.టిడిపి అధికారం ఉన్నపుడు 21రోజుల్లో రైతుల ధాన్యానికి డబ్బు చెల్లించాం.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తాం.రైతులను మోసగించే ధాన్యం మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు రానీయం. అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన కొడవలూరు గ్రామస్తులు
కోవూరు నియోజకవర్గం కొడవలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామంలో ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూములను అధికార పార్టీ నాయకులు అధికారులను లొంగదీసుకుని దోచుకుంటున్నారు. సాగునీటి కాలువలను ఆక్రమించి వాటిపై పెద్దపెద్ద బిల్డింగులు కడుతున్నారు. వైసీపీ నేతల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. లేఅవుట్ లు వేసి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర భూములను కబ్జా చేస్తున్నారు. పంచాయతీల్లో గ్రామకంఠం భూములను చదును చేసి అమ్ముకుంటున్నారు. ఈ కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములతో పాటు ప్రజల భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కబ్జాదారులకు కొమ్ము కాయడం దుర్మార్గం. సాగునీటి కాల్వలు, కొండలు, గుట్టలను సైతం వైసిపి నేతలు మాయం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక భూకబ్జాదురులపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వ భూములతోపాటు ప్రజల భూముల రక్షణకు చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన గుండాలమ్మపాలెం పంచాయితీ సభ్యులు
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం గుండాలమ్మపాలెం గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామంలో 1,700మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 1.5కిలోమీటర్ల దూరం సిమెంటు రోడ్డు, దీనికి కిలోమీటరు దూరం డ్రైనేజీ నిర్మించారు.మా పంచాయతీకి 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.12లక్షలు రాగా, మొత్తం ప్రభుత్వం లాక్కుంది. మా గ్రామంలోని 4 శ్మశానాలకు ప్రహరీలు లేవు.గ్రామంలో మంచినీరు, ఇంటి పట్టాల సమస్యలు ఉన్నాయి.పొలానికి వెళ్లే దారులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు అసంపూర్తిగా ఉన్నాయి.మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలోని పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి పాలన పంచాయతీలకు శాపంగా మారింది. పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.8,600కోట్లను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా పంచాయతీలను నిర్వీర్యం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి మళ్లీ గత వైభవం తెస్తాం.