– 500 కిలోల భారీ కేకు కటింగ్
సంక్షేమ సారథి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు
– మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
గొల్లపూడి వేదికగా జనం గుండెల్లో నిలిచిన అభిమాన నేత మన జగనన్న జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఓ జాతరలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలం నడుమ 500 కిలోల భారీ కేకును కట్ చేశారు. భారీ జనసందోహం మధ్య జై జగన్ అనే నినాదాలతో గొల్లపూడి మార్మోగింది.
మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సచివాలయం-1 ఎదురుగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున , బాపట్ల ఎంపీ నందిగం సురేష్ , ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు , జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను , సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ , విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు , ఏపీ ఫైబర్ కార్పొరేషన్ అండ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, వైకాపా సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ , పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఏకకాలంలో కేకును కట్ చేశారు.
ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ పేదప్రజల సంక్షేమ సారథి జగనన్న జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరి ఆశీస్సులతో జగనన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.