Suryaa.co.in

Andhra Pradesh

అదానీ కేసులో జగన్ అరెస్టు ఖాయం

ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ జోస్యం

హైదరాబాద్: సౌర విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా అదానీ ముడుపుల వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా ఇరుక్కున్నారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశమే లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. లంచం కేసులో అదానీ, జగన్ ఇద్దరూ అరెస్ట్ అవుతారు. వీరి అరెస్ట్ ను ప్రధాని మోదీ కూడా ఆపలేరని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ లో దీనికి సంబంధించిన కథనం వచ్చింది. ఆ పత్రికలో కథనం వస్తే కథ ముగిసినట్టే. వీరిద్దరినీ తమకు అప్పజెప్పాలని అమెరికా కోరుతుంది. మోదీ కూడా దీన్ని ఆపలేరు. అయితే దీనికి మూడు నెలలు పడుతుందా? లేదా ఆరు నెలలు పడుతుందా? అనేది చెప్పలేమని గోనె ప్రకాశ్ రావు అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE