Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థులకు సీఎం వైయస్‌ జగన్‌ ‘బెస్ట్ విషెస్‌’

క్రోసూర్‌లో ఏపీ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన సీఎం

పల్నాడు: వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూర్‌ చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. క్రోసూర్‌లో ఏపీ మోడల్‌ స్కూల్‌ను సీఎం వైయస్‌ జగన్‌ సందర్శించి డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. ఇంటరాక్టివ్‌ ప్యాడ్‌ ప్యానల్‌పై ఆల్‌ ది బెస్ట్‌ అని రాసి విద్యార్థులకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. మ‌రికాసేప‌ట్లో క్రోసూరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో విద్యార్థుల‌ను ఉద్దేశించిన ప్ర‌సంగించిన అనంత‌రం జ‌గ‌న‌న్న విద్యా కానుక కిట్ల పంపిణీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.

LEAVE A RESPONSE