గత పాలకులు అమరావతి– తుళ్లూరు రోడ్డు వేయలేకపోయారు

Spread the love

ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు

క్రోసూరు: గత పాలకులు అమరావతి నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయలేకపోయారని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం సందర్భంగా క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు మాట్లాడారు.

ఎమ్మెల్యే శంకర్‌రావు ఏమన్నారంటే..
జగనంటే జనం..జగన్‌కే నిరాజనం..జగన్‌ అంటే ప్రభంజనం.. మొట్ట మొదటిసారిగా సీఎం అయిన తరువాత నియోజకవర్గానికి వచ్చిన వైయస్‌ జగన్‌ గారికి, అందరికీ నమస్కారాలు.. పెదకూరపాడు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలాడాలంటే నాపై నమ్మకం ఉంచి నాకు టికెట్టు ఇచ్చిన వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు.

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు–నేడు ద్వారా మా నియోజకవర్గానికి సుమారు రూ.257 కోట్లు వైయస్‌ జగన్‌ ద్వారా మాకు అందాయి. గత ప్రభుత్వాలు ఇందులో కనీసం నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలి.

విద్య తరువాత, వైద్యానికి కూడా పెద్ద పీట వేశారు. వైద్యం కింద మా నియోజకవర్గానికి రూ.24 కోట్లు ఇచ్చారు. మూడు పీహెచ్‌సీలు కొత్తగా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలో ఎన్నో దశాబ్ధాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న అమరావతి–బెల్లంకొండ రోడ్డు కలను వైయస్‌ జగన్‌ సాకారం చేశారు. 33 అడుగుల రోడ్డును వైయస్‌ జగన్‌ మంజూరు చేశారు. ఇందుకు రూ.150 కోట్లు విడుదల చేశారు. ఈ రోడ్డు కృష్ణమ్మ తల్లికి మణిహారం. మా నియోజకవర్గానికి ఈ రోడ్డును గిప్టుగా ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు మరోక్కసారి ధన్యవాదాలు.

రెండు రోడ్లను కలిపే హైలెవల్‌ రోడ్డును మంజూరు చేసిన వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు. విజయవాడ, హైదరాబాద్‌ నుంచి వచ్చే వారికి చెన్నై వెళ్లే వారికి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జికి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరుగా నామకరణం చేయాలని కోరుతున్నాను. గతంలో పులిచింతల డ్యామ్‌ను వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్మిస్తే..ఇప్పుడు ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ రహదారి నిర్మిస్తున్నారు..అభివృద్ధి అంటే ఇది. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు.

మా నియోజకవర్గంలో ఇవాళ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రారంభించుకున్నాం. 2009లో వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారు. గత పాలకులు ఇంత వరకు ఆ బిల్డింగ్‌ కట్టలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చాక స్థల సేకరణ చేసి, భవనాలు నిర్మించారు. అభివృద్ధి అంటే ఇది.. అమరావతికి వెళ్లాలంటే సరైన రోడ్లు లేవు. రూ.44 కోట్లు నిధులు మంజూరు చేసి మద్దూరు బ్రిడ్జి, రోడ్డు నిర్మించారు. గత ప్రభుత్వం అమరావతికి రోడ్డు కూడా వేయలేకపోయింది. ఇదేనా అమరావతిపై చంద్రబాబుకు నిజాయితీ.

నరసరావుపేట డివిజన్‌ నుంచి సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మా నియోజకవర్గంలో మైనారిటీ, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ముస్లింల కోసం 17 షాదీఖానాలు కట్టించారు. 20 కమ్యూనిటీ హాల్స్‌ కట్టించారు. మా నియోజకవర్గానికి మన ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా రూ.13 కోట్లు, అభివృద్ధి ద్వారా రూ.660 కోట్లు ఇచ్చారు. గతంలో నాలుగో వంతు కూడా ఇవ్వలేకపోయారు.

చంద్రబాబు వంకర బుద్ధితో ఇక్కడికి వచ్చి విమర్శించి వెళ్లాడు. గతంలో తాను ఏం చేశాడో చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు. మెంటల్‌బాబును భరించలేక ఆయన మీటింగ్‌లకు కూడా జనం రావడం లేదు.ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో అంతా బూటకమే. తన కుమారుడిని సీఎం చేసుకోవాలని మోసపు వాగ్ఢానాలు ఇస్తున్నారు. గతంలో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు మాఫీ చేయలేదు.

టీడీపీ ఎవరికి కోసం సంపద సృష్టించిందో చంద్రబాబు చెప్పాలి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క రోడ్డు కూడా వేయలేని వ్యక్తి చంద్రబాబు. ఆయన మాటలకు చేతలకు సంబంధం లేదు. చరిత్ర సృష్టించేవారు ఎప్పుడు కూడా నిశ్శబ్ధంగా ఉంటారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ చెప్పిన మాట మాలో ధైర్యాన్ని నింపింది. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం మా నాయకుడు వైయస్‌ జగన్‌కే ఉంది. మళ్లీ మనం వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించి 175 స్థానాలను వైయస్‌ జగన్‌కు ఇవ్వాలి. పెదకూరపాడు నుంచే విజయశంఖారావం పూరిద్దామని ఎమ్మెల్యే శంకర్‌రావు పిలుపునిచ్చారు.

Leave a Reply