Suryaa.co.in

Andhra Pradesh

కోడికత్తి కేసులో జగన్ డ్రామా బట్టబయలు

-విచారణే జరగలేదన్న జగన్ రెడ్డి వాదనకు చెక్
-అమాయక దళిత యువకుడి జీవితాన్ని ఛిద్రం చేస్తున్న తుగ్లక్
– మాజీ మంత్రి కె.ఎస్.జవహర్

ఎన్నికల్లో లబ్ది కోసం పికె డైరెక్షన్లో కోడికత్తి దాడి కుట్ర చేసినట్లు నేటి ఎన్ఐఏ ఛార్జిషీట్‌తో జగన్ రెడ్డి బండారం బట్టబయలైంది. తన కుట్రను కప్పిపెట్టుకోవడానికి తెలుగుదేశంపై బురద వేశారు. తన అధికారం కోసం ఒక దళిత యువకుడిని జైలు పాలు చేసి కుటుంబాన్ని అవస్థలపాలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తి దాడిపై జగన్ రెడ్డి చేసిన డ్రామాలు, ఆరోపణలన్నింటికీ నేడు ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ చెంప పెట్టులా నిలిచింది.

ఎన్ఐఏ అసలు విచారణే జరపలేదంటూ కోర్టుకు వెళ్లకుండా డ్రామాలాడిన జగన్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారు? ఘటన జరిగినపుడు చంద్రబాబే చేయించాడు అన్నారు. తర్వాత టీడీపీ సానుభూతిపరుడి హోటల్‌లో పని చేస్తున్నారంటూ నిర్వాహకుడి పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు అసలు నాటి ఘటనతో తెలుగుదేశం పార్టీకి గానీ, రెండో వ్యక్తికిగానీ ఎలాంటి సంబంధం లేదని ఎన్ఐఏ తన విచారణలో బయటపడినట్లు తేల్చి చెప్పింది.

కుట్రలు చేయడం, దాన్ని ఇతరులపైకి నెట్టేయడం అలవాటుగా మారిన జగన్ రెడ్డి, ఇప్పుడు కోడికత్తి కేసులో ఏం సమాధానం చెప్తారు? గుండుసూది గుచ్చుకున్నట్లున్న గాయానికి గునపంతో పొడిచారంటూ రాద్దాంతం చేశారు. కనీసం విచారణకు హాజరవ్వకుండా దళిత యువకుడిని నాలుగేళ్లుగా జైలు పాలు చేశారు. దళితులపై దాడులు చేయడం, హత్యలు చేయడం, తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది.

జగన్ రెడ్డీ, నీ నాటకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పింక్ డైమండ్, డీఎస్పీల ప్రమోషన్, అమరావతిలో అవినీతి, పోలవరంలో కమిషన్లు అంటూ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలేనని తేలిపోయాయి. వివేకా హత్య కేసులోనూ నాడు చేసిన ఆరోపణలన్నీ అబద్దాలని మీ పిటిషన్లతో తేటతెల్లమైంది. రేపోమాపో.. కోడికత్తి డ్రామాలోనూ నీ బండారం మొత్తం బట్టబయలవ్వడం తధ్యం. నిన్ను బంగాళాఖాతంలో కలిపి.. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడం తధ్యం.

LEAVE A RESPONSE