-చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలో పెగాసెస్ ఇక్యూప్ మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారు
-పెగాసెస్ ఇక్యూప్ మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్ టీఐ సమాధానం ఇచ్చారు
-కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం
-ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
మంగళగిరిలోని జాతీయ టీడీపీ కార్యాలయ లో ఎన్టీఆర్ భవన్ నందు గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ఏచంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలో పెగాసెస్ ఇక్యూప్ మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో మార్చి 21వ తేదిన ఈ విషయంపై చర్చ కూడా పెట్టారు. ఆర్థికశాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఈ చర్చ జరిగింది. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు బయటపడి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వారి టెలిఫోన్ లను ట్యాప్ చేయడం కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్ కొన్నారని ఆరోపించారు. దీనిపై చర్చ జరగాలని శాసనసభలో ఒక స్టేట్ మెంట్ ను ప్రవేశపెట్టారు. దేశ భద్రతకే ముప్పు వాటిల్లినంత తీవ్ర స్థాయిలో ఆరోజు టీడీపీపై శాసనసభ లో ఆరోపణలు చేశారు. ఏకపక్షంగా వ్యవహరించారు. సభ అడగకముందే స్పీకర్ చే హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. పెగాసెస్ కొన్నారా లేదా? నిఘా పెట్టారా లేదా అనే దానిపై ఒక హౌస్ కమిటీని వేశారు.
ఈ హౌస్ కమిటీలో ఏడుగురి పేర్లు చేర్చారు. ఈ హౌస్ కమిటీ సభ్యుల్లో టీడీపీ వారెవరూ లేరు. ఇలాంటి శాసనసభా సంఘం ఎప్పుడూ, ఎవరూ వేయలేదు. అన్ని పార్టీలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సివున్నా అలా ఇవ్వలేదు. వారితో సంబంధం ఉన్న సభ్యుడిని పెట్టుకొని తెలుగుదేశం సభ్యుడు లేకుండా కమిటీని వేశారు. మూడు రోజుల్లోనే రెండు సమావేశాలలో దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. ఈ సంఘటనలో కొండను తవ్వి ఎలుకను కాదుకదా పురుగును కూడా పట్టలేకపోయారు. పెగాసెస్ ఇక్యూప్ మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్ టీఐ సమాధానం ఇచ్చారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు డేటా చోరీ చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారు. పెగాసెస్ పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రాయాసే అయింది. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో సమయాన్ని వృధా చేస్తూ చర్చ పెట్టారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతభావానికి నిదర్శనం. బుగ్గన రాజేందర్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లు ఏ ఎమ్మెల్యే వాడటంలేదు. సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పెట్టి నిరర్థకం కొనసాగిస్త్తోంది.
రాజకీయ నేతలు, సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజం కాదా? కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్ కు సిద్ధమా? మంత్రులు, ఎమ్మెల్యేలచే అసత్య ఆరోపణలు చేయించడం సబబుకాదు. మీ నిఘా సంస్థలమీద పెట్టిన ఖర్చుపై సీఐజీ ఆడిట్ చేయించాలి. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట గంటలకొద్ది తిట్టినంతమాత్రాన ఉపయో్గం ఉండదు. అప్పుడు పెగాసెస్ కొనుగోలు అన్నారు. ఇప్పుడు డేటా చోరీ అంటున్నారు. 50 మందిపై కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టడం తప్ప ఉపయోగంలేదు. నేడు డేటా చోరీ ఎవరు చేస్తున్నారన్నది కళ్లముందే కనబడుతోంది. యాప్ పెట్టి మరీ ఎవరు చేస్తున్నారో తెలుస్తూనే ఉంది. ఆధార్ కార్డు లింక్ చేసింది వైసీపీ ప్రభుత్వమే. కరెంటు, మోటార్ సైకిల్, వాళ్ల రేషన్ కార్డు వివరాలు అన్ని లింక్ చేసి ఎమ్మెల్యేలకు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంకాదా? డేటా చోరీ వైసీపీ చేసి దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. అధికార యంత్రాంగం ద్వారా మీరే డేటా దొంగతనం చేస్తున్నారు. నేడు గడప గడపకు కార్యక్రమం ద్వారా కూడా డేటా చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డేటా చోరీ జరిగిందా లేదా అనేది వైసీపీ నాయకుల వద్ద ఉన్న ఆ యాప్ ద్వారా తెలిసిపోతుంది. దానికి గవర్నమెంట్ అనే ముసుగును కప్పారే తప్ప మరొకటి కాదు.
టీడీపీ హయాంలో 40 లక్షల ఓట్లు గల్లంతు చేశారని హౌస్ కమిటి నడుస్తోంది. అందులో టీడీపీ పార్టీలో యాక్టివ్ గా కొనసాగే సభ్యులను ఆ కమిటీలో వేయలేదు. తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని కమిటీలో వేసే ధైర్యంకూడా వైసీపీకి లేదు . ఆనాడు శాసనసభలో మీ మంత్రి పెట్టిన స్టేట్ మెంట్ కే దిక్కులేదు. గతంలో ఎన్నికల్లో ఎంత లబ్ధి పొందాలో అంతా పొందారు. డేటా చోరీ, నిఘా పెట్టింది మీరు. మావద్ద ఎలాంటి తప్పు జరగలేదు కావున సంయమనం పాటిస్తున్నాం. ఈనెల 18, 19 శాసనసభ సమావేశాలు ఉన్నాయి, ఈ సభల్లో చర్చ పెడతామంటున్నారు కావున ప్రస్తుతం ప్రెస్ మీట్ లో చర్చించాం. ప్రజా సమస్యలపై తప్ప ఇతర విషయాలపై మాకు ఆసక్తి లేదు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తోంది.
ప్రజలకు వాస్తవాలు తెలియాలి కావున స్పష్టత ఇవ్వడానికి నేడు పత్రికాముఖంగా ముందుకు వచ్చాం. సభా కమిటి ఒక నివేదిక మాత్రమే ఇవ్వగలదు, ప్రభుత్వానికి సిఫార్సు మాత్రమే చేయగలదు. ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అర్హత ఉంది, అంతేగానీ సభా కమిటి కేసులు పెట్టలేదు. టీడీపీ హయాంలో పెగాసెస్ ఇక్యూప్ మెంట్ కొన్నారని ఉద్యోగస్థులచే చెప్పించాలని చూశారు. వారిని చిత్రహింసలకు గురిచేశారు. కేసు నీరుగారిపోవడంతో మళ్లీ దానికి రంగులు పూసే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాపింగ్ మీద ప్రభుత్వం విచారణకు రాకపోతే న్యాయవ్యవస్థ తలుపు తట్టే ప్రయత్నం తప్ప ఏమీ చేయలేం. వెంకటేశ్వరరావును ఇదే విషయంపై సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టులో పెగాసెస్ పై కేసు నడుస్తోంది. పెగాసెస్ ఇక్యూప్ మెంట్ లు టీడీపీ ప్రభుత్వం కొనలేదు కావున సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేదు. వైసీపీ ఎంక్వైరీకి సిద్ధం కావాలి. చంద్రబాబునాయుడు పెగాసెస్ ఇక్యూప్ మెంట్ కొనడం నిజమని రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా? కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీకి సిద్ధమా? అని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు.