Suryaa.co.in

Andhra Pradesh

బీసీలపై జగన్ చూపిస్తున్న కపట ప్రేమ మానాలి

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు

బీసీలపై జగన్ చూపిస్తున్న కపట ప్రేమ మానాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయన మాటల్లోనే …

జగన్ బీసీలను ఉద్ధరించామని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు. మూడున్నర సంవత్సరాల తరువాత జగన్ కు బీసీలు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. జగన్ రెడ్డి కుటుంబమంతా బీసీల శవాలమీదే బతుకుతూ వచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. మంగంపేట బెరైటీస్ గనులను స్వాధీనం చేసుకోవడానికి బీసీకి చెందిన జింకా వెంకట నరసయ్యను చంపింది వైఎస్ రాజారెడ్డి కాదా?

ఆక్రమించుకోవడానికి నరసయ్యను హత్య చేసిన విషయం అందరికీ తెలుసు. గనులను రాజారెడ్డి ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోగా నేడు జగన్ అనుభవిస్తున్న విషయం వాస్తవం కాదా? బీసీల ఆస్తులపై బతికే జగన్ రాజీనామా చేయాలి. బీసీలను ఉద్ధరించిందేమీ లేదు. పేరుకు మాత్రం బీసీ పదవులు ఇచ్చి పెత్తనమంతా రెడ్లకు ఇచ్చారు. రాష్ట్రాన్ని ముక్కులు చేసి ఒక్కో ప్రాంతానికి ఒక్కో సామంతరాజును పెట్టారు. రాష్ట్రంలో రెడ్డి పెత్తనం సాగుతోంది. ఉత్తరాంధ్ర సామంతరాజుగా మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉండగా నేడు వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.

గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి, గుంటూరు, కృష్ణా జిల్లాలలకు సామంతరాజుగా రామిరెడ్డి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు సామంతరాజుగా ప్రతాపరెడ్డి, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు సామంతులుగా సజ్జల రామకృష్ణారెడ్డిలను పెట్టారు. వీరిని రాష్ట్రాన్ని దోచుకోమని చెబుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతున్నారు. వెధవ పనులు చేసి పతివ్రతా శిరోమణుల్లా మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏం న్యాయం చేసిందో?, ఏ కార్యక్రమం చేశారో తెలపాలి. డిబేట్ కు రావాలి. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు నోరెత్తడంలేదు.

బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు? సీఎం వద్ద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వైసీపీ 56 కార్పొరేషన్లు పెట్టి రిక్తహస్తం చూపింది. నిధులు ఇవ్వలేదు. గతంలో టీడీపీ బీసీలకు రుణాలు, పనిమట్లు ఇచ్చి ఆదుకుంది. వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ నిధులు రూ36 వేల కోట్లు దారిమళ్లించింది. ఆదరణ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు కావాల్సిన పనిముట్లు ఇచ్చేది.

టీడీపీకి బీసీలు మద్దతిస్తుంటే వారు అడ్డుగా ఉన్నారని బీసీలు మద్దతు ఇవ్వకూడదని భయపెడుతున్నారు. బీసీలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి 24 మంది బీసీ నాయకులను దారుణంగా చంపించారు. పోలీసు స్టేషన్ లలో వీటికి సంబంధించిన రికార్డులున్నాయి. 2,650 మంది బీసీలపై ఏ కారణం లేకుండా తప్పుడు కేసులు పెట్టారు. ఎన్టీరామారావు హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.

దాన్ని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 10 శాతం తగ్గించి 24 శాతానికి తెచ్చారు. దీంతో సుమారు 16,800 మంది బీసీలకు పదవులు లేకుండా పోయాయి. ఇది బీసీలకు చేసిన అన్యాయం కాదా? ఈ విషక్ష్ంపై ప్రజల్లో డిబేట్ పెడదాం. అందుకు వైసీపీ నాయకులు సిద్ధమా? కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధులను దారి మళ్లించారు. సర్పంచులకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సర్పంచులను నిర్వీర్యం చేశారు. గ్రామపంచాయతీలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. వారికి ఏ అధికారం లేకుండా చేశారు. వైసీపీ నాయకులు బీసీలకు సంజాయిషీ చెప్పాలి.

981 నామినేటెడ్ పదవుల్లో 742 పోస్టులు రెడ్డీలకు ఇచ్చారు. మిగతా కులస్థులేమయ్యారు?. 76 శాతం రెడ్లకిచ్చారు. ఆరుగురికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇచ్చారు. ఇది అన్యాయం చేయడం కాదా? తిరుపతి తిరుమల దేవస్థానంలో 36 పోస్టుల్లో 11 మంది రెడ్లే. ముగ్గురు మాత్రం బీసీలు, వైస్ ఛాన్సలర్ లు 12లో 10 పోస్టులు రెడ్డీలకు ఇచ్చారు. ఒక పోస్టు బీసీలకు ఇచ్చారు. 42 మంది సలహదారుల్లో 35 మంది రెడ్లే ఉన్నారు. ఒక్కరు మాత్రమే బీసీలున్నారు. విప్ లో ఒక్కరే. బీసీలున్న ప్రాంతాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది.

తెలుగుదేశం బీసీలకు ఎంతో మేలు చేసింది. విజయసాయిరెడ్డి విశాఖలో రూ.45 వేల కోట్ల ఆస్తులు దోచేస్తే ఏంచేస్తున్నారు? రుషికొండను ఆక్రమించుకుంటుంటే నిరసన తెలిపినందుకు అరెస్టులు చేస్తున్నారు. బీసీలకు అన్యాయం చేయొద్దు, వారి ఓట్లకు గాలం వేయొద్దు. బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. భారతిరెడ్డిపై ఎవరైనా పోస్టులు పెడితే వెంటనే సీఐడీ డిపార్టుమెంటు కేసులు పెడుతున్నారు. సాక్ష్యాలు, రుజువులు లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారు. భారతరెడ్డిగారికి ఒక చట్టం, ఇతరులకు ఒక చట్టమా?

గౌతు శిరీష, అనురాధలపై అనేక కేసులు పెట్టారు. సీనియర్ జర్నలిస్టు 71 సంవత్సరాల అర్ధరాత్రి తీసుకెళ్లి హరాష్ మెంట్ చేశారు. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడితే ఇబ్బందులా? రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్ ను కాపాడాల్సిన అవసరం ఉంది. అమర్నాథ్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఉండాలని ఏదేదోమాట్లాడుతున్నాడు. ఆస్తలు దోపిడీపై క్లారిటీ ఇవ్వాలి. సిట్టింగ్ జడ్జీతో ఎంక్వైరీ చేయించగలరా? భారతీరెడ్డి సిమెంటుకు ముడిసరుకు టిప్పర్లతో ట్రాన్స్ పోర్టు చేస్తారు. రోజుకు వంద టిప్పర్లు వెళ్తుంటాయి.

పోలీసుల సహకారంతో దోపిడీ చేస్తున్నారు. అక్రమంగా మైనింగ్ తరలుతున్నా కలెక్టర్, ఎస్పీలు ఏంచేస్తున్నారు. ఇది దోపిడీ కాదా? అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టకపోతే బీసీల కు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. బీసీల నాయకులు ప్రాంతాలవారీగా ఐక్యంగా పోరాడాలని పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు బీసీలకు పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE