(రఘునాధ్.జి)
సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ మాత్రమే. జనంలో నానకుండా అట్టర్‌ప్లాప్ సినిమాకు విజయోత్సవ సభా అంటూ పైసా ఖర్చు లేకుండా ఒక ప్రెస్ మీట్ ఇచ్చి తాను కూడా జనంలో నానడం. ఏది హిట్ ఏది ప్లాప్ అనేది జనం తేల్చుకుంటారు.
ఆగి చూసి ఆహా
మెడికల్ కాలేజీల విషయం హైలైట్ చేసుకునే ప్రయత్నం బాగా కనపడింది కాకపోతే ఆ ఒక్క టాపిక్ లో బాబుకి పెద్ద డ్యామేజ్ జరగడం కానీ జగన్ కి ఇమేజ్ పెరగడం కానీ అయ్యేంత సీన్ లేదు. ఎవరైతే ఆ మెడికల్ కాలేజీల లబ్దిదారులో వారే ఆగి చూసి ఆహా అనలేదు ..
గత ఐదేళ్లలో మార్పు లేని నీట్ అభ్యర్థుల లెక్క సాక్ష్యం. పైగా అత్యంత కీలకమైన అంశం 50% కన్వీనర్ కోటా కింద సీట్లు ఉంటాయి అని స్పష్టత ఇచ్చారు కనుక విద్యార్థులకు కొత్త నష్టం ఏమీ ఉండదు. జగన్ హయాం కన్నా ఎక్కువ సీట్లు పేద మధ్యతరగతికి అందుబాటులో ఉంటాయి. ఇక ఈ టాపిక్ ముగిస్తున్నా.
కౌంటర్ ఎన్కౌంటర్
మా అన్న ప్రెస్ మీట్ లో ఒక్క యూరియా అంశం తప్ప ప్రభుత్వం పై విరుచుకుపడే అంశాలు ఏం లేవు. బాబు తన సహజ ధోరణికి మించి సంక్షేమం అమలు చేస్తున్నారు. అయినా విమర్శలు అర్థ రహితం. ఐదు (అందులోనూ రెండు అప్‌గ్రేడ్) కట్టి 17 కట్టినట్లు ప్రచారం చేసుకున్నవారు పావలా బటన్‌కి ముప్పావలా ప్రకటనలు ఇచ్చుకున్నవారు.. ‘మేం చేసింది ఎక్కువ చెప్పుకుంది తక్కువ’ అనడం మాత్రం మహా మహా విడ్డూరం. మా అన్న చెప్పినట్లు ఐదు మెడికల్ కాలేజీల ముందు ఆగి చూసి ఆహా అనుకుందాం అనుకుంటే పులిచింతల గేటు, గుండ్లకమ్మ రెండో గేటు, ఫింఛా ప్రాజెక్టు, అన్నమయ్య డ్యాం, ఫ్లోటింగ్ బ్రిడ్జి వంటి మరో ఐదు కూడా గుర్తుకొస్తున్నాయి.
ఆ నలుగురు
సిఎం ఆటోడ్రైవర్లకు దసరా కానుక ప్రకటించారు
డిప్యూటీ సీఎం అనంతపురం లో మెరిశారు
డిఫ్యాక్టో సిఎం ‘నేపాల్’ అంశం తో మెప్పించారు
ఎక్స్ సిఎం తన రద్దు ధోరణి లో మార్పుండదని తేల్చారు
దించండి జెండాలు
అభిమానుల చర్యలు తమ అధినేతల ఉత్సాహాన్ని పెంచేలా ఉండాలి కానీ తమ అత్యుత్సాహం తో తలవంపులు తెచ్చేలా ఉండకూడదు
ఢాం ఢీం తుస్
న్యాయస్థానం లో డిప్యూటీ ఫోటో అంశం పై విచారణ ఆసక్తికరం అనుకుంటే ఒక్క వాయిదాలో తుస్సుమంది. న్యాయవాది జడ అని ఆరా తీయక ఆసక్తి పెంచుకున్నా. మరో బలమైన న్యాయవాది అయి ఉంటే పిటీషన్ ఉద్దేశానికి సిజె ప్రశ్నకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగేవారు.
ఏడేళ్ళకు ..
టిటిడి ఈవోగా సింఘాల్ ఉన్నపుడే పింక్ డైమండ్ పై (వైకాపా తరపున) రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు. ఇపుడు రెండోసారి ఈవోగా బాధ్యతా తీసుకున్న రోజున అసలు పింక్ డైమండ్ లేదు అది కెంపు మాత్రమే అని అధికారిక ప్రకటన ప్రకటింప చేయడం లో మర్మం ఏమిటో?
అంటే నాడు లేని పింక్ డైమండ్ కు లోల్లి చేసి…. పదవి, సీఎం కావాలనే కండకావరంతో ఆ వేంకటేశ్వరస్వామితో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో పై వాడికే ఎరుక?