Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలన ఉద్యోగుల పాలిట మరణశాసనం

– రూ.7వేలకోట్ల డీఏ, పీఆర్సీ బకాయిలకుగాను కేవలం రూ.175కోట్లు (కేవలం 2.5శాతం) తమప్రభుత్వ హయాంలో చెల్లించడం ఉద్యోగులకు న్యాయంచేసినట్టా జగన్ రెడ్డి?
– 11వ పీఆర్సీ కమిటీ నివేదిక నేటివరకు బయటపెట్టని నువ్వు, మరలా 12వ పీఆర్సీకమిటీ పేరుతో ఎవర్ని మోసంచేస్తావు జగన్ రెడ్డి?
– ఇటువంటి దురాగతాల్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగసంఘం నాయకులపై తప్పుడుకేసులుపెట్టి, జైళ్లకు పంపడమేనా ఉద్యోగులపై నీకున్న ప్రేమ?
• ఎన్నికలకు ముందు జగన్ మోసపురెడ్డి హామీలునమ్మి ఆయన్ని గెలిపించడానికి పోటీలు పడి ఓట్లేసిన ఉద్యోగులు ప్రస్తుతం సక్రమంగా జీతాలువస్తే చాలని దేవుడిని వేడుకుంటున్నారు
• చంద్రబాబు హాయాంలో ఉద్యోగులకు ఠంఛన్ గా 1వ తేదీనే జీతాలందేవి. ఆర్థిక ఇబ్బందుల్ని లెక్కచేయకుండా ఆయన గతంలో 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు
• ఇతరరాష్ట్రాలు సీ.పీ.ఎస్ రద్దుపై అసెంబ్లీతీర్మానాలు చేస్తుంటే, వారంలో సీ.పీ.ఎస్ ర్దదుచేస్తానన్న జగన్ మోసపురెడ్డి 4ఏళ్లలో ఒక్కసారి కూడా ఆదిశగా ఎందుకు ఆలోచించలేదు?
• ఒకపక్క ఉద్యోగసంఘాలనేతల్ని తప్పుడుకేసులతో వేధిస్తూ, వారిఇళ్లకు పోలీసుల్ని పంపిన ముఖ్యమంత్రి, మరోపక్క ఉద్యోగసంఘాలతో నిన్న సమావేశమై కొత్తడ్రామాకు తెరలేపారు
• ఈ ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా డీఏ. పీ.ఆర్.సీ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సిఉంటే, ప్రస్తుతానికి 2024జనవరిలో రూ.175కోట్లు (కేవలం 2.5శాతం చిల్లర) చెల్లిస్తామంటారా?
• మిగతాసొమ్ముని 2027నాటికి 16విడతల్లో చెల్లిస్తామంటారా? ఈ మాత్రానికేనా ఉద్యోగులుచాలా ఆనందంగా ఉన్నారని ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోంది
• చంద్రబాబుగారు అశుతోష్ మిశ్రా నేత్రత్వంలో వేసిన 11వ పీఆర్సీ కమిటీ నివేదిక ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు బయటపెట్టలేదు? అది బయటపెట్టకుండా ముష్టి 23శాతం పీ.ఆర్.సీ.తో ఉద్యోగుల్ని మోసగించారు
• 11వ పీ.ఆర్.సీ నివేదిక బయటపెట్టని ముఖ్యమంత్రి, మరలా 12వ పీ.ఆర్.సీ కి కమిటీవేసి న్యాయంచేస్తానంటే ఉద్యోగులు ఎలానమ్మాలి?
• ఉద్యోగుల జీ.పీ.ఎఫ్.సొమ్ముని ఎందుకులాక్కున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి
• హెల్త్ కార్డులకోసం ప్రతిఉద్యోగినుంచి రూ.300లువసూలుచేస్తున్న జగన్ ప్రభుత్వం, ఆసొమ్ముని ఆసుపత్రులకు చెల్లించకుండా, ప్రభుత్వవాటా కట్టకుండా ఏ ఉద్యోగికి, వారి కుటుంబానికి సరైనవైద్యసేవలు అందకుండా చేసింది నిజంకాదా?
• 2009కి ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తే, మిగతావారి పరిస్థితి ఏమిటో జగన్ సమాధానం చెప్పాలి
• దాదాపు 24వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులుంటే, కేవలం 4, 5వేలమందిని రెగ్యులరైజ్ చేస్తే మిగతావారు రోడ్డునపడాలా?
• చంద్రబాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులజీతాలు 50శాతం పెంచి, 010 అకౌంట్ ద్వారా వారికి సక్రమంగా జీతాలందేలా చేస్తే, జగన్ మోసపురెడ్డికి వారి ఊసే పట్టడంలేదు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్మోహన్ రెడ్డి మోసాలపరంపర కొనసాగు తూనే ఉందని, రాష్ట్రంలో ఫలానావర్గాన్ని మోసంచేయకుండా ఆయన వదిలేశాడ ని చెప్పుకోవడానికి ఒక్కటీలేదని, ప్రతివర్గాన్ని మాయమాటల తో మోసగిస్తూ, దగాచేస్తూ వారిగొంతుకోస్తూ ఆయన జగన్ మోసపురెడ్డిగా మిగిలాడనేది ఎవరూ కాదనలేని సత్యమని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ఒకరైతు, కార్మికుడు, మహిళ, వ్యాపారి, విద్యార్థి, ఉద్యోగస్తుడు ఎవరిని అడిగినా జగన్ మోసపురెడ్డి బాధితులమేనని వాపోతున్నారు. జగన్ రెడ్డి భస్మాసుర హస్తం ఉద్యోగులపాలిట మరణశాశనమైందనే చెప్పాలి. రాష్ట్రఅభివృద్ధిపథంలో కీలక వర్గమైన ఉద్యోగుల్ని జగన్ మోసపురెడ్డి దారుణంగా వంచించాడు. ఎన్నికలకు ముందు ఆయనచెప్పిన మాయమాటలునమ్మిన ఉద్యోగులు ఇప్పుడు జగన్ మోసపురెడ్డి బాధితులజాబితాలో ప్రథమస్థానంలో నిలిచారు. పీ.ఆర్సీ, సీ.పీ.ఎస్ రద్దు హామీలతో జగన్ మోసానికి, అబద్ధాలకు దారుణంగా బలయ్యారు. జగన్మో హన్ రెడ్డిని గెలిపించడంకోసం గతంలో శక్తికిమించిపనిచేసిన ఉద్యోగులు, ఆయనకు ఓట్లేయడంలోకూడా పోటీలుపడ్డారు. అలాంటి వారు ఇప్పుడు తమకు సమయానికి జీతాలువస్తే చాలని దేవుడిని వేడుకునే స్థితికి వచ్చారు.

తన ప్రభుత్వం ఉద్యోగులకు రూ.7వేలకోట్లకు పైబడి, డీఏ, పీఆర్సీ బకాయిలుంటే, జగన్ రెడ్డి తనపపదవీకాలం ముగిసేలోపు కేవలం రూ.175 కోట్లే చెల్లిస్తాననడం వారిని మోసగించడం కాదా?
ఈ ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా డీఏ. పీ.ఆర్.సీ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సిఉంటే, ప్రస్తుతానికి 2024జనవరిలో రూ.175కోట్లు (కేవలం 2.5శా తంచిల్లర) చెల్లిస్తామంటారా? మిగిలినసొమ్ముని 2027నాటికి 16విడతల్లో (2024లో 4విడతల్లో రూ.700కోట్లు, 2025లో 4 విడతల్లో రూ.1400కోట్లు, 2026లో 4విడతల్లో రూ.2,100కోట్లు, 2027లో 4 విడతల్లో రూ.2,800కోట్లు) చెల్లిస్తామంటారా? 2024 జనవరిలో రూ.175కోట్లు చెల్లించడం అంటే జగన్ రెడ్డి తనపదవీకాలంముగిసేలోపు ఉద్యోగస్తులకు తానుపెట్టిన డీ.ఏ. పీఆర్సీ బకాయి లలో చెల్లిస్తున్నది కేవలం 2.5శాతంమాత్రమే. మిగతాసొమ్ము 2024 ఏప్రియల్ ఎన్నికలతర్వాత ఏర్పడబోయే నూతనప్రభుత్వం చెల్లించాల్సిందే.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్లో కేవలం 2.5శాతం చెల్లించడమేనా జగన్ మోసపరెడ్డి వారికిచేస్తున్న న్యాయం? ఈ మాత్రానికేనా ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నా రని ప్రభుత్వంచంకలు గుద్దుకుంటోంది. ఇలావాయిదాల పద్ధతిలో చెల్లాస్తామని చెప్పడం తప్పించుకోవడమేకదా! వచ్చేమార్చి తర్వాత జగన్ ప్రభుత్వం ఉండ దు.. ఆ తరవాత ఏర్పడబోయే చంద్రబాబునాయుడి ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగులకు న్యాయంచేస్తుంది. నిన్నటి ఉద్యోగుల సమావేశంలో రూ.7వేల కోట్లకుగాను తమప్రభుత్వం కేవలం రూ.175 కోట్లు మాత్రమే ఇస్తుందన్న జగన్ మాటలు, ఉద్యోగులపై ఆయనకున్న కక్షకు నిదర్శనాలనే చెప్పాలి.

చంద్రబాబు హయాంలో వేసిన 11వ పీఆర్సీకమిటీ నివేదికను బయటపెట్టని జగన్ మోసపురెడ్డి, 12వ పీఆర్సీ నివేదికతో ఉద్యోగుల్ని ఉద్ధరిస్తాడా?
చంద్రబాబు 2018లో అశుతోష్ మిశ్రా నేత్రత్వంలో వేసిన 11వ పీఆర్సీ కమిటీ నివేదిక ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు బయటపెట్టలేదు? చెప్పులు అరిగేలా ఉద్యోగసంఘాలు ఎన్నిసార్లు నివేదికకోసం ముఖ్యమంత్రి చుట్టూతిరిగినా అది బయటపెట్టకుండా, నలుగురు సెక్రటరీలతో ఒకనోట్ తయారుచేసి, ముష్టి 23శాతం పీ.ఆర్.సీ.తో ఉద్యోగుల్ని మోసగించారు. 11వ పీ.ఆర్.సీ నివేదిక బయటపెట్టని ముఖ్యమంత్రి, మరలా 12వ పీ.ఆర్.సీకి కమిటీ వేసి న్యాయంచేస్తానంటే ఉద్యోగాలు ఎలా నమ్మాలి?

జగన్ మోసపురెడ్డి మోసాలు రుచిచూసిన ఉద్యోగులు ఎవరూ 12 పీ.ఆర్.సీ కమిటీని, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మడంలేదు. దేశచరిత్రలో ఐ.ఆర్ (27శాతం) కంటే తక్కువ పీఆర్సీని (23శాతం) ప్రకటించిన ముఖ్య మంత్రిగా జగన్ మోసపురెడ్డి నిలిచిపోయాడు. దేశంలో రివర్స్ గేర్ పరిపాలనకు ట్రేడ్ మార్క్ గా మారిన జగన్ సర్కార్ పీ.ఆర్సీ విషయంలోకూడా అదేపంథాను కొనసాగిస్తూ ఒక రివర్స్ పీఆర్సీని ఉద్యోగస్తులకు బహుమతిగా ఇచ్చింది. అదిచాలదన్నట్టు ఆఖరికి ఉద్యోగుల జీ.పీ.ఎఫ్.సొమ్ముని కూడా లాక్కొని పక్కదారి పట్టించిన ఘనుడు నేటి ముఖ్యమంత్రి జగన్ మోసపురెడ్డి.

విభజనకష్టాలు, ఆర్థిక ఇబ్బందుల్ని లెక్క చేయకుండా ఉద్యోగులకు ఏ కష్టం, ఇబ్బంది లేకుండా చంద్రబాబు వారికి న్యాయం చేశారు
చంద్రబాబు హాయాంలో ఉద్యోగులకు ఠంఛన్ గా 1వ తేదీనే జీతాలందేవి. రాష్ట్ర విభజన తర్వాత రూ.16వేలకోట్ల ఆర్థికలోటు ఉన్నప్పటికీ దానిని అధిగమించి రికార్డుస్థాయిలో ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది. 2018లో 11వ పీ ఆర్సీ అమలుకు అశుతోష్ మిశ్రా నేత్రత్వంలో కమిటీ వేస్తే, తరువాత ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి సంవత్సరంలోపు అమలు కావాల్సిన పీఆర్సీకమిటీ నివేదికను తొక్కిపెట్టి, 2022లో కమిటీనివేదిక బయటపెట్టకుండానే కేవలం 23శాతం ఫిట్ మెంట్ ప్రకటించి, ఉద్యోగుల్ని దగాచేశాడు.

ఉద్యోగ సంఘాలు, నేతలు ఏం తప్పుచేశారని ముఖ్యమంత్రి వారిని తప్పుడ కేసులతో వేధిస్తున్నాడు?
దగాకోరు జగన్ మోసపురెడ్డి ఉద్యోగులకు ఇచ్చినహామీలు నెరవేర్చకుండా ఉద్యోగసంఘంనేతలపై తప్పుడు కేసులుపెట్టిస్తూ కక్షసాధింపులకు పాల్పడుతు న్నాడు. ఇతరరాష్ట్రాలు సీ.పీ.ఎస్ రద్దుపై అసెంబ్లీతీర్మానాలు చేస్తుంటే, వారంలో సీ.పీ.ఎస్ ర్దదుచేస్తానన్న జగన్ మోసపురెడ్డి 4ఏళ్లలో ఒక్కసారి కూడా ఆదిశగా ఎందుకు ఆలోచించలేదు? తమడిమాండ్లకోసం ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్న ఉద్యోగసంఘ నేతల్ని ముఖ్యమంత్రి తప్పుడుకేసులతో వేధిస్తున్నారు. ఏ.పీ. గవర్నమెంట్ ఎంప్లాయూస్ ఉద్యోగసంఘం నేత కే.ఆర్.సూర్యనారాయణ చేసిన తప్పేమిటి?
సమయానికి జీతాలు ఇవ్వాలని, తమన్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరడమే ఆయన నేరమా? రాష్ట్రంలో రాజ్యాంగపరిరక్షకుడిగా వ్యవహరించే గవర్నర్ గారినికలిసి, ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను వారికి వివరించి, ప్రభుత్వానికి దిశానిర్దేశంచేయాలని కోరడం సూర్యనారాయణ గారు చేసినతప్పా.. దానికే ఆయన్ని వెంటాడివేధిస్తారా? అంటే ఈ రాష్ట్రంలో పౌరులెవరూ రాష్ట్ర గవర్నర్ ని కలవకూడదా? కలిసి తమసమస్యల్ని విన్నవించుకుంటే జగన్ రెడ్డి అమలుచేస్తున్న జేపీసీ సెక్షన్ల ప్రకారం అది నేరమా?

గతంలో మా పార్టీ శాసనమండలిసభ్యులు, ఒకప్పటి ఉద్యోగ సంఘంనేత అశోక్ బాబుగారిపై ఈ ప్రభుత్వం గతంలో ఇలానే కక్షసాధింపులకు పాల్పడింది. ఉద్యోగులపక్షానే మాట్లాడటమే ఆయనచేసిన నేరం. ఒకపక్క ఉద్యోగ సంఘాలనేతల్ని తప్పుడుకేసులతో వేధిస్తూ, వారిఇళ్లకు పోలీసుల్ని పంపిన ముఖ్యమంత్రి, మరోపక్క ఉద్యోగసంఘాలతో నిన్నసమావేశమై కొత్త డ్రామాకు తెరలేపారు. ఉద్యోగసంఘనాయకులపై జరుగుతున్న ఈ దాడుల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది.

ఉద్యోగుల హెల్త్ కార్డుల్నిచిత్తుకాగితాలుగా మార్చిన జగన్ రెడ్డి
హెల్త్ కార్డులకోసం ప్రతిఉద్యోగినుంచి గతంలో టీడీపీప్రభుత్వం ప్రతినెలా 90రూపాయాలు వసూలుచేస్తే, జగన్ సర్కార్ ఆ మొత్తాన్ని అమాంతంపెంచి, నెలకు రూ.300లు వసూలుచేస్తోంది. ఆవిధంగా పెంచివసూలుచేస్తున్నప్పటికీ ఆ సొమ్ముని పక్కదారి పట్టించి ఆసుపత్రులకు చెల్లించకుండా ఏ ఉద్యోగికి, వారి కుటుంబానికి సరైనవైద్యసేవలు అందకుండా చేసింది నిజంకాదా? హెల్త్ కార్డుల కు ప్రభుత్వవాటాగా కట్టాల్సింది కట్టకుండా ఉద్యోగులహెల్త్ కార్డుల్ని చిత్తుకాగితా లుగా మార్చిన ఘనత ఈ ముఖ్యమంత్రిది.

కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులూ జగన్ మోసపురెడ్డి బాధితులే
నిన్నజరిగిన సమావేశంలో 2014 జూన్ నాటికి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్నిమాత్రమే రెగ్యులరైజ్ చేస్తాననడం నూటికి నూరుశాతం వారిని దగాచేయడమే. 2009కి తర్వాత నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఈ నిర్ణయంవల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయంతో వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కల ఆవిరైపోయినట్టే. దాదాపు 24వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులుంటే, కేవలం 4, 5వేలమందిని రెగ్యులరైజ్ చేస్తే మిగతావారు రోడ్డునపడాలా? చంద్రబాబుగారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 50శాతం పెంచి, 010అకౌంట్ ద్వారా వారికి సక్రమంగా జీతాలం దేలాచేస్తే, జగన్ మోసపురెడ్డికి వారి ఊసేపట్టడంలేదు. నేటికీ ఒక్కరూపాయి కూడా దాదాపు లక్షమందికి పైబడిఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచలేదు.

జగన్ రెడ్డికి ఉద్యోగులపై అంతప్రేమాభిమానాలుంటే, వారికి చెల్లించాల్సిన రూ.7వేలకోట్లబకాయిల్ని తనపదవీకాలం ముగిసేలోపు ఒకేసారి చెల్లించాలి
ఉద్యోగుల్ని ఉక్కుపాదంతో, అధికామదంతో అణచి వేయాలనిచూస్తున్న ముఖ్య మంత్రి ఆటలుసాగనివ్వం. ఉద్యోగులగొంతునొక్కే ప్రయత్నాలకు చంద్రబాబు, లోకేశ్ లు ఎదురొడ్డినిలిచి భవిష్యత్ లో తప్పకుండా ఉద్యోగులకు న్యాయం చేస్తారు. టీడీపీప్రభుత్వంలో ఏఉద్యోగి జీతకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండ దు. 12వపీఆర్సీకూడా న్యాయబద్ధంగా దక్కేలా చంద్రబాబుగారు చర్యలు తీసుకుంటారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా టీడీపీప్రభుత్వం కచ్చితంగా న్యాయంచేస్తుంది.
జగన్ మోసపురెడ్డి తక్షణమే ఉద్యోగసంఘం నేతలపై పెట్టిన తప్పుడుకేసుల్ని వెనక్కుతీసుకొని, వారిపై పాల్పడుతున్న వేధిం పులకు స్వప్తిపలకాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డికి ఉద్యోగులపై ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా తక్షణమే వారికి చెల్లించాల్సిన రూ.7వేలకోట్ల డీఏ, పీఆర్సీ బకాయిల్ని వాయిదాలపద్ధతిలో 4సంవత్సరాల్లో కాకుండా తమపదవీకాలం పూర్తయ్యేలోపు మార్చి 2024నాటికి వారికి పూర్తిగా చెల్లించాలి.” అని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE