జగన్ బాబాయి, పిన్ని నిజాయితీ పరులు అయితే… తిరుమలలో టెండర్ నిబంధనలు సవరించి అక్రమాలకు పాల్పడని సంపాదన అయితే…
SIT అడిగిన బ్యాంక్ లావాదేవీల వివరాలపై “అత్యవసరంగా” కోర్టు ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
నకిలీ నెయ్యి ఆరోపణలపై విచారణ జరుగుతోంది. శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా అయిన నెయ్యి అసలైనదా? నకిలీదా? ఇది తేల్చాలంటే… సరఫరాదారుల బ్యాంక్ లావాదేవీలు చూడాల్సిందే.
“గోప్యత హక్కు” పేరుతో గోప్యంగా?
వైవీ సుబ్బారెడ్డి దంపతులు తమ బ్యాంక్ స్టేట్మెంట్లు SIT అడగడాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
“మేము నిందితులు కాదు, సాక్షులం కూడా కాదు” అని వాదించారు. “బ్యాంక్ లావాదేవీలు అడగడం BNSS సెక్షన్ 94కి విరుద్ధం” అని పేర్కొన్నారు.
సీబీఐ వాదన: “వివరాలు విశ్లేషించి ముందుకెళతాం”
సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తూ,
“పీఏ చిన్న అప్పన్న వాంగ్మూలం ఆధారంగా బ్యాంక్ లావాదేవీలు అవసరం.
ఇప్పటికే కొంత సమాచారం వచ్చింది, మరికొంత రావాలి” అని తెలిపారు.
విచారణ కొనసాగుతోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మిగిలిన వివరాలపై వేచి ఉండాల్సిందిగా సూచన వచ్చింది.
హిందూ భక్తుల అనుమానాలు…
– నిజాయితీ ఉంటే… విచారణకు సహకరించడంలో భయం ఎందుకు?
– “గోప్యత హక్కు” పేరుతో విచారణను అడ్డుకోవడం… ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం ఎందుకు?
– తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో… పారదర్శకతే ప్రసాదం కాదా?
ఇది ప్రజల సందేహం.
ఇది శ్రీవారి విశ్వాసం.
విచారణకు సహకరించడమే నిజాయితీకి అద్దం.
దయచేసి నిజాయితీగా విచారణలో మీ నగదు లావాదేవీలు ఇవ్వండి. టిటిడి డబ్బులు కాకుండా మరేదైనా అవకతవకలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వైకాపాలో సైతం కలుగుతోంది.
-చాకిరేవు