వాలంటీర్లు గృహ సారధులు కన్వీనర్లు ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి
చుండూరు సమీక్ష సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి
వేమూరు: ప్రజా ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా వాలంటీర్లు, గృహసారధులు,జగనన్న సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణకోస్తా జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండల గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లలతో శుక్రవారం వలివేరు గ్రామంలో జరిగిన సమీక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే మేరుగు నాగార్జున,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..ఈ సమవేశంలో వాలంటీర్లు, గృహసారథులు,సచివాలయ కన్వీనర్లు నుండి సలహాలు,సూచనలను ఆయన స్వీకరించారు..వారు లేవనెత్తిన అంశాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు…అలాగే ఈ సమావేశంలో ఇచ్చిన సలహాలు,సూచలను స్వికరిస్తామని,కోన్ని సమస్యలను పరిష్కారం చూపుతామన్నారు.
గృహాసారథులకు ఇన్సూరెన్స్ తో పాటుగా ఏ విధంగా న్యాయం చెయాలి అన్న పార్టీ దృష్టికి తీసుకెళ్తానాని ఆయన చెప్పారు..అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజా ప్రభుత్వమని,బడుగు బలహీన వర్గాల తో పాటు, అగ్రవర్ణాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో 87% పైగా గృహాలు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. అభివృద్ధి పథకాల విషయంలో ఈ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా అమలు చేస్తుందని చెప్పారు .
ఈ ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుందని చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైయస్సార్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని చెప్పారు.. నియోజకవర్గ, మండల స్థాయిలోనే కాకుండా గ్రామస్థాయి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. వాలంటీర్లు, గృహ సారధులు కన్వీనర్లు ప్రజా ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మూడు వ్యవస్థల మధ్య సమన్వయ లోపం ఉంటే ప్రజలకు అనుకున్న రీతిలో సంక్షేమం అందడంలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..ఈ ప్రభుత్వానికి అన్ని విధాలుగా పై మూడు వ్యవస్థలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు… మీ నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మెరుగు నాగార్జున దృష్టికి తీసుకురండి,లేదా స్థానిక జిల్లా అధ్యక్షుడు,ఎంపీ మోపిదేవి వెంకటరమణ దృష్టికి తీసుకురండి, లేనిపక్షంలో నా దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశంలో ఆయన చెప్పారు.
మా స్థాయిలో మీ సమస్యలు పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు…మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా కృషి చేస్తున్నారని చెప్పారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా దళిత, బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ… అంబేద్కర్ ఆశయ సాధన కోసం జగన్.. కృషి చేస్తున్నారని కొనియాడారు..
బాపట్ల వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు,ఎంపి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎవరి మీద వివక్షత చూపకుండా అందరికీ, అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పారు.. సాంకేతిక కారణాలతో ఒకరిద్దరికి సంక్షేమ పథకాలు అందడం లేదే తప్ప, ఈ ప్రభుత్వం , ఏ ఒక్కరిని విస్మరించకుండా సంక్షేమ పథకాలు అందిస్తుందని వెల్లడించారు.. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన చెప్పారు.
దిండ్డుపాలెం గ్రామాభివృద్ధికి 25 లక్షల గ్రాంటును ప్రకటించిన విజయసాయిరెడ్డి
చుండూరు మండలంలోని దిండ్డుపాలెం గ్రామంలో డ్రైనేజీ పనుల నిమిత్తం తన ఎంపీ లాండ్స్ నిధుల నుంచి 25 లక్షలు గ్రాంటును మంజూరు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.. అంతకుముందు ఆ గ్రామ సర్పంచ్ భగవద్గీత,స్థానిక మంత్రి మేరుగు నాగార్జున ఈ గ్రామానికి నిధులు మంజూరు చేయాలని సభాముఖంగా విజయసాయి రెడ్డి ని విజ్ఞప్తి చేశారు.