– మంగళగిరి నియోజకవర్గం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజి మంత్రి, ఎమ్మెల్సీ, నారా లోకేష్ పర్యటన
– ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్
– బాదుడే బాదుడు కరపత్రం పంచుతూ వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్
– ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తెచ్చిన ప్రజలు.
– చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్న లోకేష్
కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్ జగరోనా వైరస్. వైరస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారు. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలి.మద్యపాన నిషేదం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలితీసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అంటూ రూ.10 కుడి చేత్తో ఇచ్చి బాదుడే బాదుడు పేరుతో ఎడమ చేత్తో రూ.100 కొట్టేస్తున్నారు జగన్ రెడ్డి.ఫ్రీ దొరికే ఇసుకను బంగారం చేసి ఎంతో మందికి ఉపాధి లేకుండా చేశారు.ఇసుక బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు.
దోచుకున్న సొమ్మంతా నేరుగా తాడేపల్లి ప్యాలస్ కి వెళ్తుంది. రాష్ట్రంలో రోడ్ల పై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది. ప్రతి ఏడాది సిఎం రివ్యూల్లో రోడ్లను బాగు చెయ్యాలనే ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్యడం లేదు. అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని పెన్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు కట్ చేస్తున్నారు.ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు.
ఆత్మకూరు లోని చేనేత డైయింగ్ షేడ్ ని పరిశీలించిన నారా లోకేష్
★ చేనేత డైయింగ్ కార్మికులను అడిగి విధానాన్ని తెలుసుకున్న లోకేష్.
★ ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా మాకు గుర్తింపు లేదు.
★ మా కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువ.
★ నూలుకి రంగులు అద్దె ప్రక్రియ ఎంతో కష్టం తో కూడుకున్నదని అయినా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు, సహాయం అందడం లేదని వివరించిన చేనేత డైయింగ్ కార్మికులు.
★ డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నా మాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నాం.
★ వర్షా కాలం పని ఎక్కువ ఆదాయం తక్కువ ఉంటుంది అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని లోకేష్ కి వివరించిన కార్మికులు.
చేనేత డైయింగ్ కార్మికులకు గ్లవ్జులు, సేఫ్టీ షూస్ అందజేసిన నారా లోకేష్
★ చేనేత రంగం సంక్షోభం ఎదుర్కుంటుంది.
★ చేనేత రంగాన్ని నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
★ నేతన్నలు పడుతున్న కష్టాల పై నాకు పూర్తి అవగాహన ఉంది.
★ సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలి. ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చెయ్యాలి.
★ నూలుకి రంగులు అద్దె ప్రక్రియ మొదలుకొని అన్ని ప్రక్రియల్లో ఉన్న కార్మికుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి పరిష్కరించాలి.
★ పనిచేసుకోవడనికి మెరుగైన వసతులు కల్పించాలి.
★ చేనేత డైయింగ్ కార్మికులను ఆదుకోవాలి.