ద్రవిడ వర్శిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోండి

– చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడయన్ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణుల మృతిపై గవర్నర్ కు చంద్రబాబునాయుడు లేఖ

గవర్నర్‌కు బాబు రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇవీ
• అక్రమ మైనింగ్ కు ద్రవిడ యూనివర్సిటీ హబ్ గా మారింది.
• యూనివర్సిటీకి చెందిన 1100 ఎకరాల భూముల్లో వైసిపి నేతలు అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు.
* ఇష్టానుసారంగా చేస్తున్న గ్రానైట్
బ్లాస్టింగ్, అక్రమ రవాణ కారణంగా వన్యప్రాణులు చనిపోతున్నాయి.
* జాతీయ పక్షి నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోంది.
• యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తూ అక్రమమైనింగ్ కు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు.
• యూనివర్సిటీ విద్యార్థులకు అందించే ఆహారంలో కూడా నాణ్యత లోపించి ఇటీవల వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు.
* యూనివర్సిటీలో అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు.
• యూనివర్సిటీ ఉద్యోగులకు రెండేళ్ల నుంచి అలవెన్సులు కూడా ఇవ్వడం లేదు.
• వైసిపి ప్రభుత్వ హయాంలో రోజురోజుకు యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుంది.
• విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాల్సిన ద్రవిడ విశ్వవిద్యాలయం అందుకు విరుద్దంగా నడుస్తోంది.
• పేద విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
* వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా ద్రావిడ యూనివర్శిటీ పరిశోధన వాతావరణం ప్రమాదంలో పడింది.
* మానవ జాతి ఎప్పటికీ ఉన్నతమైన లక్ష్యాల వైపు సాగిపోయెందుకు విశ్వవిద్యాలయాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పిన లక్ష్యంకు పూర్తి విరుద్ధంగా ద్రావిడ విశ్వవిద్యాలయం తయారైంది
• యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
• వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని యూనివర్సిటిలో అక్రమ మైనింగ్ ను అడ్డుకుని పర్యావరణం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి.

Leave a Reply