-ఎన్నికల ముందు కాళేశ్వరం పై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమే
-ఒకటి నుండి రెండు శాతం కాంగ్రెస్ కు లాభం జరిగేలా మోడీ చర్యలు
-తెలంగాణా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు
-కేసులకు,దాడులకు గులాబీ శ్రేణులు భయపడరు
-మేము తిరగ బడితే మీ పత్తా దొరకదు
-అందరూ డిల్లీలో తల దాచుకోవలసి వస్తుంది
-దాడులతో రెచ్చిపోతే మీ భరతం పడతాం
-అధికారఅహంకారాన్ని తెలంగాణా సమాజం ఉపేక్షించదు
-నిజాం నవాబులనే తరిమిన గడ్డ ఇది
-అంతకంటే మీరు గొప్పుళ్ళు కారు
-రండలుకేసులు పెడతమంటూ చేసే బెదిరిస్తున్నారు
-మీరు ఆంద్రా బాస్ ల వద్ద మొకరిల్లి నప్పుడే మెడలు వంచి తెలంగాణా సాధించాం
-ఉడుత ఉపులు,కుక్క అరుపులు ఏమి చేయలేవు
-తెలంగాణా మాది,మీది కాదు
-ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రి పదవులు కేసీఆర్ దయా దాక్షిణ్యాల తోటే
-పైసలున్నా కాంగ్రెస్ పాలకులకు పాలన చేత కాదు
-కేసీఆర్ నాయకత్వం లో ఎదిగిన వారికే పాలనానుభవం
-చంద్రబాబు చెప్పులు మోసినోళ్ళకు,వై యస్ ఆర్ బూట్లు నాకినోళ్ళకు పాలనానుభవం ఎట్లా వస్తుంది?
-అప్పులు చెయ్యమన్నదే కాంగ్రెస్ నేతలు
-అప్పులు లేకుంటా అభివృద్ధి జరగదు
-ఆదాని,అంబానీ లకే అప్పులు తప్పలేదు
-డిసెంబర్ 9 న రుణమాఫీ అన్న హామీ ఏమైంది
-నిలదీస్తే చెప్పులతో కొట్టండి,గల్లాలు పట్టి నెట్టండి అంటున్నారు
-ఇదేనా తెలంగాణా సమాజం కోరుకున్న మార్పు
-కాంగ్రెస్ పాలకులపైమాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి లు ఏకమై బి ఆర్ యస్ ను ఓడించారని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బి ఆర్ యస్ కూటమిలో తెలంగాణా ప్రజల భాగస్వామ్యం ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బి ఆర్ యస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఒకటి నుండి రెండు శాతం ఓట్లు కాంగ్రెస్ కు పడేలా మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకున్న ఫలితంగానే ఓడి పోయామన్నారు.క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిశీలన జరప కుండానే డిల్లీలో కూర్చుని కాళేశ్వరం మీద ఎన్నికలకు రెండు రోజుల ముందట విడుదల చేసిన నివేదికనే ఇందుకు తార్కాణమన్నారు.
అప్పటికి ఇప్పటికి తెలంగాణా ప్రజలు గులాబీ బాస్ కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన తేల్చిచెప్పారు. కేసులకు,దాడులకు గులాబీ శ్రేణులు భయపడరని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ అరాచకాల పై గులాబీ దండు తిరగబడితే పాలక కాంగ్రెస్ పక్షం పత్తా దొరకదని ఆయన హెచ్చరించారు. అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో తల దాచుకోవాల్సీన దుస్థితి ఏర్పడుతుందన్నారు.దాడులతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదని దాడులు చేసిన వారి భరతం పడతామని ఆయన హెచ్చరించారు.
మొన్న సూర్యాపేట, నిన్న భోనగిరి జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ల ఉదంతాలను ఆయన వివరించారు.అదికారం ఉంది కదా అని అహంకారంతో ప్రవర్తిస్తే తెలంగాణా సమాజం ఉపేక్షించబోదని ఆయన కాంగ్రెస్ పాలకులకు ఉపదేశించారు. నిజాం నవాబులను తరిమిన గడ్డ ఇదని అంతకంటే కాంగ్రెస్ పాలకులు ఎక్కువ కాదని ఆయన ఎద్దేవాచేశారు.
కొందరు రండలు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఈ ఉడుత ఉపులకు, కుక్కల అరుపులకు గులాబీ శ్రేణులు దడవారన్నారు.మీరు ఆంద్రా బాస్ ల వద్ద మొకరిల్లిన రోజునే మెడలు వంచి తెలంగాణా సాధించిన నేత కేసీఆర్ అని అటువంటి నేత సారథ్యంలో పని చేసిన గులాబీ దండును ఎవరూ ఏమీ చెయ్యలేరన్నారు.ఆ మాటకు వస్తే తెలంగాణా మాదని ఎంత మాత్రం మీది కాదని ఆయన అన్నారు.
కేసీఆర్ సాధించిన రాష్ట్రంలోముఖ్యమంత్రి, మంత్రి పడవులతో పాటు టీపీసీసీ, టి బిజెపి ఇతర పార్టీలకు సారధ్యం వహిస్తున్నారు అంటే అది కేసీఆర్ భిక్ష మాత్రమే నని ఆయన అన్నారు.పైసలున్నా కాంగ్రెస్ పాలకులకు పాలన చేత కాదని ఆయన దుయ్యబట్టారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఎదిగిన వారికి మాత్రమే పాలనానుభవం ఉంటుందన్నారు.
చంద్రబాబు చెప్పులు మోసిన వారికీ, వైఎస్ ఆర్ బూట్లు నాకినోళ్ళకు పాలనా ననుభవం ఎక్కడిదన్నారు.అప్పులు చెయ్యమన్నదే కాంగ్రెస్ పార్టీ నేతలని ఆ అప్పు మాఫీ చేయాలని అడిగితే చెప్పులతో కొట్టండి,కాలర్ పట్టి నెట్టండి అంటూ స్వయంగా మంత్రులు చెబుతున్నారు అంటేనే వారి వారి పాలనానుభవం ఏ పాటిదో అన్నది ఇట్టే తేలిపోతుందన్నారు.ఇదేనా తెలంగాణా సమాజం కోరుకున్న మార్పు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు.