Suryaa.co.in

Andhra Pradesh

ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీలో సత్తా చాటిన జగ్గయ్యపేట మహిళ

జగ్గయ్యపేట: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు 2025 పేరుతో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న జగ్గయ్యపేట మహిళ వేసిన ముగ్గుకు జగ్గయ్యపేట ప్రజలను మంత్ర ముగ్ధులను చేసిన సంగతి తెలిసిందే.

ఈరోజు ప్రకటించిన అవార్డుల్లో మామిడి హర్షిత రెండవ బహుమతి గెలుచుకున్నారు, అంటే అక్షరాల 15,00,116/- రూపాయలు గెలుపొందారు. ఈ సందర్భంగా మామిడి హర్షిత మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ముగ్గులంటే ఇష్టం గా నేర్చుకున్నానని,ఈరోజు నా ముగ్గుకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమని, ఈ అవార్డు నాకు మాత్రమే సొంతం కాదని నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులందరిది అని సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE