Suryaa.co.in

Features

జై పిచ్చి ప్రపంచం!

పిచ్చోళ్లమ్మా పిచ్చోళ్లు….అంగట్లో పిచ్చోళ్లు…ఊళ్ళల్లో పిచ్చోళ్ళు..
అంతర్వేదిలో మొదలైన పిచ్చోళ్ళు సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి వరకూ వచ్చేశారు.

ఆ మధ్యన ఈ పిచ్చోళ్ళే ఆఫ్ఘనిస్తాన్ లో బనియన్ బుద్ధ విగ్రహాల వరకూ వెళ్లారు. పిచ్చి ముదిరినప్పుడల్లా గుళ్ళూ గోపురాలు కూలగొట్టారు..
పిచ్చోడు ఒకడైతే ఫరవాలేదు. బంగ్లాదేశ్ లో వేలాది లక్షలాది మంది పిచ్చోళ్లు తయారయ్యారు.

పాకిస్తాన్ అనే దేశం మొత్తం పిచ్చిదై పోయింది. గుళ్ళూ గోపురాలూ కనబడితే పిచ్చొచ్చేస్తుంది. అదేంటో విగ్రహం కనబడితే పిచ్చి లేస్తుంది.
ఏమిటో…పోలీసులు పిచ్చి సర్టిఫికేట్ ఇప్పించి మరీ ఊళ్ళల్లో వదులుతున్నట్టు ఉన్నారు. అదే సర్టిఫికెట్ రేపు కోర్టులో కూడా ఉపయోగపడచ్చు.

మక్కెలిరగదన్నిన ఫోటో చూసి…పాపం పిచ్చోడని బాధ పడే సెక్యులర్ పిచ్చోళ్ళూ ఉన్నారు…ప్చ్. ఆ ఏకైక దేవుడు.. ప్రపంచమంతా ఇంత మంది పిచ్చోళ్లని తయారు చేసి ఎలా వదిలాడురా నాయనా?  రేపు పాపం పిచ్చోళ్ళకు జీవించే హక్కు నిరాకరిస్తున్నాయని…విగ్రహాలు తీసెయ్యమనే ఎర్ర భక్తులు కూడా వస్తారు. కోర్టులు పిచ్చోడిని కొట్టిన గుంపు పైన సుమోటోగా కేసులు పెట్టినా పెడతాయి.

ఏమో బాబూ…ఎందుకైనా మంచిది పిచ్చోడు ఏమైనా చేస్తాడు. గుళ్ళకు వెళ్ళకండి…విగ్రహాలు పెట్టకండి…భయం లేకుండా నాస్తికులై పొండి. గుంపుగా ఇంత మందిని పిచ్చోళ్లుగా తయారు చేస్తున్న ఆ పిచ్చి వ్యవస్థను సరి చేయాలని తాపత్రయ పడకండి. కుదిరితే మీరూ ఆ పిచ్చోళ్ళ సమూహంలో కలిసిపోండి. పిచ్చోళ్ల ప్రపంచవ్యాప్త పోరాటానికి మద్దతు ఇవ్వండి. ప్రపంచ పిచ్చోళ్ళారా ఏకంకండి…విగ్రహం లేని ప్రపంచం కోసం.! జై పిచ్చి ప్రపంచం…!

LEAVE A RESPONSE