ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు:
అగ్రవర్ణాలు బిజెపికి వేశారు.
బిసిలు అఖిలేష్ కు వేసుకున్నారు.
దళితులు బియస్పీకి లేదా ఆమె చెప్పిందని బిజెపికే వేశారు.
ముస్లింలు మనవాడు ఒవైసీ ఉండగా మరొకరికి వెయ్యడమెందుకు?
వీళ్లందరిలో ఎవడికి కష్టమొచ్చినా వాడు రావాలి.వాడొచ్చి మోడీ అరాచకాలను ఒక్కడై ఎదిరించాలి.దళిత స్త్రీ అత్యాచారానికి గురై హత్య గావించబడి రహస్యంగా దహనం చేయబడితే వాడు తన చెల్లితో సహా పోయి సాధారణ కానిస్టబుల్ చేత లాఠీ దెబ్బలు తినాలి.
మరొక మంత్రి కొడుకు రైతులు చేసే ధర్నాలో వాళ్ల మీదకే కారు నడిపి ఆందోళన కారుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే వాళ్ల కోసం వాడే రావాలి.
రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వాళ్ల బతుకులు కాలరాచెయ్యబోతే అప్పుడు కూడా వాడే రావాలి.
కోవిడ్ మహామ్మారి ముంచుకొస్తోంది, విమానాశ్రయాలన్నీ మూసేయండి అని వాడంటే వాణ్ణందరూ ఆట పట్టిస్తారు.
ఏరోజూ విరామమనేది లేకుండా బతుకంతా జన సంరక్షణ కోసం పోరాటంతోనే బ్రతికితే వాణ్ణి ఇక్కడ చదువుకున్న చదువురాని గాడిదలంతా వాడిలో చైతన్యం లేదని సూత్రీకరించేస్తారు. అలాంటపుడు
ప్రభుత్వ దమనానికి వ్యతిరేకంగా వాడే పోరాడాలని ఎందుకు ఆశిస్తారో అర్ధం కాదు.వాడికి పదవీకాంక్ష లేదు. ఆస్తులు పోగేసుకోవాలనే యావ అసలే లేదు. అబద్ధమనేది తెలియనే తెలియదు. మరి ఈ జనానికెందుకు ఆ ద్వేషం? అంతుబట్టని ప్రశ్న. ప్రజాజీవితం ముసుగులో వేల కోట్లు మింగేసిన దుర్మార్గుల్ని అక్కన జేర్చుకున్న దౌర్భాగ్య సమాజమిదే.
ఈ పరిస్థితుల్లో ఇక్కడ రికార్డుల ప్రకారం అగ్రవర్ణ వర్గానికి చెందిన వాడిగా నాకొక ఆప్షనుంది. దళిత, బిసి, మైనారిటీలను కాలరాచేసి మనువాదాన్ని పెంపొందించే పార్టీగా బిజెపి ఒకవైపుండగా, మన చుట్టూ ఉన్న జనమంతా వారి వారి సామాజిక నేపధ్యం ప్రకారం పోతుంటే నేనెందుకు ఆ ఫలాలకు దూరంగా మిగిలిపోవాలనే ప్రశ్న వేధిస్తోంది. అందుకే నేను కూడా జై మోఢీ!(వాడు అనేది కావాలని వాడాను అతన్ని ద్వేషించే వెధవల కోసం. ద్వేషించేవాళ్ళను వెధవలని ఎందుకన్నానంటే, అతను అసలెంత మాత్రం ద్వేషించకూడని నికార్సయిన మనిషి కాబట్టి. వాడు అనేదాన్ని అతను అని చదువుకోమనవి)
– పేపపాయల రామకృష్ణ