Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే జై!

– 68.5 శాతం మంది ప్రజలు
– వ్యతిరేకించిన 31.5 శాతం ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కూటమికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు స్పష్టమయింది. మరో ఏడాదిలో ఎన్నికలు.. టీడీపీ-జనసేన-బీజేపీ కలసి పోటీ చేస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో.. ‘‘సూర్య’’ వెబ్‌సైట్ పోల్ నిర్వహించింది. ఆ సర్వేలో ఆ మూడు పార్టీల కలయికను ప్రజలు సమర్ధిస్తున్నారా? అన్న ప్రశ్నలు సంధించింది. దానికి ఆ మూడు పార్టీల కలయికను సమర్ధిస్తున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి.

ఆ ప్రకారంగా మూడు పార్టీల కలయికను.. 68.5 శాతం మంది ప్రజలు సమర్ధించగా, 31.5 శాతం మంది ప్రజలు వ్యతిరేకించినట్లు వెల్లడయింది. అంటే రానున్న ఎన్నికల్లో.. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా, గతంలో మాదిరిగానే స్వాగతిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE