జనవరి 22వ సోమవారం అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా ఆ స్వామివారి స్వర్ణ విల్లును అద్భుతంగా తయారుచేసి దానిపై జైశ్రీరాం అనే తెలుగు అక్షరాలను రాసి తన రామ భక్తిని చాటి చెప్పాడు ఓ స్వర్ణ కళాకారుడు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ, గాంధీనగర్ 21వ వార్డుకు చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి.. ఈ సూక్ష్మ స్వర్ణ రామబాణాన్ని, సూది మోనపై నిలిచిపొయొల తయారు చేసి, తన కళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీని ఎత్తు అర సెంటీమీటర్. వెడల్పు సెంటీమీటర్ గా తెలియజేశారు. దీని తయారీకి రెండు గంటలు సమయం పట్టిందని తెలియజేశారు.
ఇది కేవలం 60 మిల్లీగ్రాములు బంగారాన్ని ఉపయోగించి పలిచటి బంగారపు రేకుపై తయారు చేసినట్లుగా కళాకారులు రమేష్ తెలియజేశారు. సూక్ష్మ రామబాణం ను తయారు చేసిన రమేష్ ని పలువురు ప్రశంసించారు.