Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి మీ అబద్దాలు ఇంకెన్నాళ్లు ?

– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్

వైసీపీ 5 ఏళ్ల పాలనలో విద్యతో పాటు అనేక రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు సీం జగన్ ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు. అబద్దాలు చెప్పడంలో జగన్ రెడ్డి దిట్ట. ఆయన తీసుకొచ్చిన మార్పులు ఏంటి? విధ్వంసం, నాశనం చెయ్యడం తప్ప,మార్పులు తీసుకు రావడం కూడా జగన్ రెడ్డికి తెలుసా? టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం దానిని 10 లక్షల మంది విద్యార్దులకు కుదించింది.

పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను రద్దు చేసి వెనకబడిన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేశారు. వసతి గృహాల్లోను విద్యార్ధులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోవడం,బిల్లులు చెల్లించకుండా వేలాది మంది విద్యార్ధులను పస్తులుంచడం మీరు తీసుకొచ్చిన మార్పునా జగన్ రెడ్డి? గడచిన 5 ఏళ్లలో 4,709 పాఠశాలలు మూతపడటం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులా జగన్ రెడ్డి?

రైతులను ఉద్ధరిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ మాయమాటలతో రైతులను వంచించారు. రైతులు అప్పుల భారంతో కుప్పకూలుతుంటే, మరో పక్క ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసాం, మాది రైతు పక్ష పాత ప్రభుత్వం అని బాకాలుదుకోవడం సిగ్గుచేటు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశం లోనే రైతు,వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడోస్ధానంలో ఉంది. పండించిన పంటలకు గిట్టు బాటుధర కాదు, మద్దతు ధర కూడా దక్కడం లేదు. తెలుగుదేశం మిగులు విద్యుత్ సాధించి కరంట్ కోతలు లేని రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే,విద్యుత్తు వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఘనత జగన్ రెడ్డిది.

టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్తు చార్జీలు పెంచలేదు, 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి రూ54 వేలకోట్ల భారం మోపిన ఘనత జగన్ రెడ్డిదే. టీడీపీ హయాంలో రూ 67 వేల కోట్లు ఖర్చుచేసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, పట్టిసీమ నిర్మించి నదుల అనుసంధానం చేశాం. 72 శాతం పోలవరం పూర్తిచేస్తే,సాగునీటి ప్రాజెక్టులను మోండి గోడలుగా మిగిల్చింది జగన్ రెడ్డి. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించింది,నిరుద్యోగ భృతి ఇచ్చింది తెలుగు దేశం కాగా.నిరుద్యోగం పెంచింది, నిరుద్యోగ భృతి రద్దు చేసింది జగన్ వ్యక్తి జగన్ రెడ్డి బీసీ సబ్‌ ప్లాన్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిదులు సక్రమంగా వినియోగించి చంద్రబాబు నాయుడు ఆ వర్గాల అభ్యున్నతికి పాల్పడితే జగన్ రెడ్డి మాత్రం ఆ నిధులు దారి మళ్లించి ద్రోహం చేశారు.

గత తెలుగుదేశం ప్రభుత్వానికి, జగన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా చాలా? ఇంకా కావాలా? జగన్ రెడ్డి? ఇలా చెప్పుకుంటూ పోతే మీ 5 ఏళ్ల పాలనలో విధ్వంసానికి,వికృతాలకు అంతే ఉండదు. మీరా గత ప్రభుత్వానికి, వైసిపి ప్రభుత్వానికి తేడా గమనించమని ప్రజల్ని కోరేది? మీరేం చేశారో చెప్పే ధైర్యం లేక చంద్రబాబును విమర్శిస్తూ మీ పబ్బం గడుపు కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బహిరంగ సభల్లో చెబుతున్న పచ్చి అబద్దాలు వినలేక ప్రజలు పారిపోతున్నారు, అబద్దాలు, మోసాలతో ప్రజల్ని కొంతకాలమే మోసం చేయగలరు.

LEAVE A RESPONSE