Suryaa.co.in

Andhra Pradesh

టిడిపి కార్యాలయాలపై వైసిపి కార్యకర్తలు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం:సిపిఎం

టిడిపి కార్యాలయాలపై వైసిపి కార్యకర్తలు జరుపుతున్న దాడులను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయ విమర్శలు హుందాగా చేయాలి తప్ప, వ్యక్తిగతం చేయడం తప్పు అని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE