ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటారా జగన్ రెడ్డి?

– టీడీపీ అంగన్ వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

తమ న్యాయబద్దమైన డిమాండ్లు పరిష్కరించమంటే అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామనటం సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామన్నది మీరు కాదా? ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగటం అంగన్వాడీల పాపమా? అంగన్వాడీలపై లాఠీచార్జ్ లు, అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటారా? అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం.

Leave a Reply