Home » డ్రగ్స్ వ్యవహారంలో పెద్దలకు సంబంధంలేకుంటే ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు?

డ్రగ్స్ వ్యవహారంలో పెద్దలకు సంబంధంలేకుంటే ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు?

– మాజీ విప్ కూన రవికుమార్
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం చూస్తే, ఆయనలో తన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎలా కాపాడుకోవాలన్న కంగారు, బెరుకుతనం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ విప్ కూనరవికుమార్ తెలిపారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందంటున్న సజ్జల అసలు క్యారెక్టర్ (వ్యక్తిత్వం) ఎవరికుందో సమాధానంచెప్పాలి. క్యారెక్టర్ అనే పదానికిదరిదాపుల్లో లేనివ్యక్తి, దాన్నిఉచ్ఛరించడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డేనని సజ్జల గుర్తిస్తే మంచిది. వ్యక్తిత్వమే లేనప్పుడు దాన్ని ఎలా నాశనంచేస్తారో రామకృష్ణారెడ్డే చెప్పాలి. రెండుపత్రికలు, వాటియాజమాన్యాలపై కూడా సజ్జల అక్కసు వెళ్ల గక్కారు. గతంలో సజ్జల సాక్షి దినపత్రికలో పనిచేశారు. ఆ సమయంలో ఆయనేమైనా తనపత్రికిలో చాగంటికోటేశ్వరరావు గారి ప్రవచనాలురాశారా?
ఒకటీ రెండుకాదు, ఆపత్రికను అడ్డం పెట్టుకొని ఆడినఅబద్ధాలు, కోసినకోతలు, చేసినవిషప్రచారంతోఈ నాటికీ రాష్ట్రప్రజలు మానసికక్షోభను అనుభవిస్తున్నారనే వాస్తవా న్ని సజ్జల గుర్తించాలి. సాక్షిదినపత్రిక, సాక్షి ఛానల్ గోబెల్స్ నే మించిపోయిందనడంలో ఎలాంటిసందేహంలేదు. పండోరా పత్రాల్లో జగన్మోహన్ రెడ్డి పేరుకూడా ఉండొచ్చేమోనంటూ అనుమానం వ్యక్తంచేస్తే, అదేదో పెద్దనేరమైనట్లు సజ్జలమాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి నైజం, నేరం, అతని స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అనేకమంది రాష్ట్రానికిముఖ్యమంత్రులుగా పనిచేశారు, వారికీ కుమారులు, కుమార్తెలున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినీతిచరిత్ర ఎవరికైనాఉందా?
భారతదేశంసహా, అనేకదేశాల్లో 46 సూట్ కేసు కంపెనీలను స్థాపించి, రూ.43వేలకోట్లవరకు అక్రమసంపాదనను ఈడీతో జప్తుచేయించుకున్నారు. సజ్జల గారు వీటిపైసమాధానంచెప్పాలి. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన 46సూట్ కేసు కంపెనీలు ఏరాష్ట్రంలో, ఏదేశంలోఉన్నాయో రామకృష్ణారెడ్డి, ఏపీప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సదరుకంపెనీల పుట్టుపూర్వోత్తరాల గురించి సజ్జల, ఏనాడైనా సాక్షిలోరాయించా డా? ఆప్ఘనిస్తాన్ టూ ఆంధ్రప్రదేశ్ గురించి సజ్జలఏంచెబుతారు? రాష్ట్రంలోనికి 28టన్నులహెరాయిన్ దిగుమతి అయినమాట వాస్త వమా …కాదా? జూలై నెలలో 25టన్నులు, సెప్టెంబర్లో మూడుటన్నుల హెరాయిన్ ఏపీకివచ్చింది. కాబట్టే కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నిఘాసంస్థలు పొరుగురాష్ట్రాలను హెచ్చరించింది నిజమా…కాదో సజ్జల చెప్పాలి.
కర్ణాటక, చత్తీస్ ఘడ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను అప్రమత్తంచేయలేదా? కేంద్ర హోంశాఖ, కేంద్రఇంటిలిజెన్స్ వర్గాలవారి సమాచారాన్ని సజ్జల, ఆయనప్రభుత్వం ఎందుకు దాస్తోంది. ఒకటన్నుహెరాయిన్ విలువ రూ.7వేలకోట్లవరకుఉంది. అంటే రాష్ట్రానికివచ్చిన హెరాయిన్ విలువ రూ.లక్షా96వేలకోట్లు. అంతమొత్తం విలువైన హెరాయిన్ రాష్ట్రంలోకి దిగుమతి అయింది వాస్తవమా..కాదా? డ్రగ్స్ వ్యవహారం వెనుక పెద్దతలకాయలున్నాయని, అసలువ్యక్తు లెవరో బయటకురావాలని సజ్జల చెప్పడం సిగ్గుచేటు. అసలు వ్యక్తులెవరు సజ్జలకుతెలియదా? ప్రభుత్వంలోఉన్నవ్యక్తి పెద్దతల కాయలున్నారని చెప్పడమేంటి? హెరాయిన్ దిగుమతులకు సంబంధించిన వార్తబయటకురాగానే, రాష్ట్రడీజీపీ దానికి, రాష్ట్రానికి సంబంధంలేదని ఎలామాట్లాడారు?
ఎలాంటి విచారణజరపకుండా, లోతుగా దర్యాప్తుజరపకుండా, ఎవరినీ విచారించకుండా డీజీపీ ఎలాచెప్పారు? ముఖ్యమంత్రేమో నిన్న సమీక్షలో మాట్లాడుతూ, డ్రగ్స్ రహితంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండాలని అన్నట్లు మీడియాలో చూశాము. అంటే రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, దాని అమ్మకాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రే ఆయన మాటల్లో చెప్పకనే చెప్పారు. డ్రగ్స్ వ్యవహారం దేశాలను ఎలా కబళిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. అంతటి మహహ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తుంటే, ముఖ్యమంత్రి ఏమీ తెలియనట్టే సమీక్షల పేరుతో సలహాలిస్తాడా?
తన తండ్రి చనిపోయిన ప్రదేశాన్ని ఇంతవరకు సందర్శించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తూ, ప్రమాదవశాత్తూ మరణిస్తే, శవం కూడా దొరక్కముందే, ఆయనేమైపోయారో తెలియకముందే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిపదవికోసం సంతకాలు సేకరణ చేపట్టలేదా?
శవాన్ని పక్కనేపెట్టుకొని ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకున్న నీచమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం గురించి సజ్జల మాట్లాడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి శవంపై పెట్టిన పార్టీ వైసీపీ. శవరాజకీయాలుచేయడంలో ఆరితేరిన పార్టీ వైసీపీ. అలాంటి పార్టీని, ప్రభుత్వాన్ని సజ్జల నిస్సిగ్గుగా వెన కేసుకొస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి మరణంవెనుక అనేకఅనుమానా లున్నాయని స్వయంగా ఆయన సతీమణి, జగన్మోహన్ రెడ్డి తల్లి గారైన విజయమ్మగారే అన్నారు. మరి అలాంటప్పుడు నేడు ముఖ్యమంత్రిగా ఉన్నజగన్మోహన్ రెడ్డి, తనతండ్రి మరణంపై సీబీఐ విచారణజరిపించమని కేంద్రాన్ని ఎందుకుకోరడంలేదు?
తండ్రి మరణాన్ని అలావదిలేస్తే, సొంత బాబాయిని చంపిందెవరో కూడా ఈ ముఖ్యమంత్రి కనిపెట్టలేకపోయాడు. తొలుత వివేకానం దరెడ్డి హత్యజరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరి పించాలన్నాడు. తరువాత ఆయనే వద్దన్నాడు. ఈ విధంగా ఒక రకమైన మానసికరుగ్మతతో జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు . జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలే ఫ్యాక్షన్ తో కూడిన రాజకీయాల సమ్మిళితం. అలాంటివ్యక్తి నాయకత్వలక్షణాలు, ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ వాస్తవాన్ని సజ్జల గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి పెద్దమానవతావాది అని సజ్జల ఆయన సాక్షిమీడియా చెప్పినంత మాత్రాన ప్రజలునమ్మే స్థితిలో లేరు.
గుజరాత్ లోని ముంద్రాపోర్టులో పట్టుబఢినహెరాయిన్ మచిలీ పట్నం పోర్టుకి చేరాల్సి ఉండగా, కాకినాడపోర్టుకి ఎలా వెళ్లింది? ఎక్కడో హెరాయిన్ పట్టుకున్నారని తెలియగానే కాకినాడతీరంలో జగన్నాథపురం ఓడరేవులో బోటు ఎందుకు తగలబడింది? దానిపై ఏపీప్రభుత్వం ఎందుకు విచారించలేదు? దానిపై పోలీస్ శాఖ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదు? జరిగినఘటనకు గల కారణాలేమిటో ఎందుకుఆరాతీయలేదు? రాష్ట్రానికి 28టన్ను ల హెరాయిన్ వస్తే, దానిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే దు? రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నామని ఆయనే చెప్పొచ్చుకదా? తెలుగుదేశంప్రభుత్వం అధికారంలోఉన్నప్పుడు గంజాయి పంటను డ్రోన్ కెమెరాలతో గుర్తించి నాశనంచేయడం జరిగింది. ఆనాడు ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున దాడులు నిర్వహించి, గంజాయి సాగు, దానిక్రయవిక్రయాలను ఎక్కడికక్కడే తుంచేసింది. కానీ నేడు రవాణా అవుతున్న గంజాయిని పట్టుకొని ఏదోఉద్ధరించినట్లుగా మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానిమూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాయి. అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి గంజాయిప్రదేశ్ గా మార్చాడు.
సజ్జల నేడు ట్రాన్స్ పరెన్సీ (పారదర్శకత) గురించి మాట్లాడాడు. అవును నిజమే ఇసుకలో పారదర్శకంగా ఎన్నివేలకోట్లు దోచుకున్నారో, మద్యం అమ్మకాలతో ఎన్నివేలకోట్లుదోచేస్తున్నారో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని సజ్జల అర్థంచేసుకోవాలి. ఆఖరికి 104-108 వాహానాల్లోకూడా పారదర్శకంగా దోపిడీచేస్తున్నారు. సమయంవచ్చి, దొంగలుదొరికిననాడు సజ్జల తన పారదర్శకత గురించి చెప్పాలి. లక్షలకోట్ల అక్రమార్జన దేశంలో ఎవరిదగ్గర ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి అనేసమాధానం చిన్నపిల్లాడు కూడా చెబుతాడు.
సీబీఐ కేసులతాలూకా ఏ కేసులో ఎవరిని తొల గించారో సజ్జల చెప్పాలి. తనపై 36కేసులున్నాయని జగన్మోహన్ రెడ్డే, తన ఎన్ని కల అఫిడవిట్లో పేర్కొన్నాడు. అలాంటివ్యక్తి నీతిమంతుడని , ప్రజలు ఆయన్నినమ్ముతున్నారని సజ్జల చెప్పడం సిగ్గుచేటు.నమ్మాల్సింద ప్రజలుకాదు, న్యాయస్థానాలు. సజ్జల మాటల్లో నిజాయితీఉంటే, ప్రతిపక్షమిచ్చే సమాచారంపై ఎందుకు విచారణ జరిపించడంలేదు? తనప్రభుత్వసచ్చీలతను ఆయనఎందుకు రుజువుచేసుకోలేకపోతున్నారు? సజ్జల సాక్షిపత్రికలోపనిచేసి, చివరకు మీడియాఅంటేనే ప్రజలు అసహ్యించుకునేలాచేశాడు. అలాంటివ్యక్తి ఇతరపత్రికలను తప్పుపడుతున్నాడు.
ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల, సాక్షి మీడియా తెలుగుదేశంప్రభుత్వంలో రూ.6లక్షలకోట్ల అవినీతి అని దుష్ప్రచా రంచేశారు. మరిప్పుడు అధికారంలోకివచ్చాక 6రూపాయల అవి నీతినికూడా ఎందుకు నిరూపించలేకపోయారు? ప్రభుత్వసలహా దారు అనేవాడు ప్రజలకు పనికొచ్చేసలహాలు ఇవ్వాలి. అంతేగానీ తప్పులమీదతప్పులుచేస్తున్న ముఖ్యమంత్రిని వెనకేసుకొచ్చినం త మాత్రాన జరుగుతున్న దారుణాలు ప్రజలకు తెలియకుండా పోవు. చిన్నచిన్న పచారీకొట్లు, టీకొట్లు, బడ్డీకొట్లలో కూడా డిజిట ల్ పేమెంట్లు (చెల్లింపులు) జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ మద్యందుకాణాల్లో మాత్రం నగదుఇస్తేనే మద్యం అమ్ముతున్నా రు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యమెంత? తద్వారాప్రభుత్వ ఖజానాకు, జగన్ కు వెళుతున్నఆదాయమెంత?వీటన్నింటిపై విచారణకు ఆదేశించగల ధైర్యం ఈముఖ్యమంత్రికి ఉన్నాయా? నిజంగా ఈప్రభుత్వం పారదర్శకంగా పనిచేసేదే అయితే, తక్షణమే మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాం. మద్యపాననిషేధమనిచెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని 2కోట్ల70లక్షలమంది మహి ళలను దారుణంగా మోసగించాడనే వాస్తవం సజ్జలకుతెలియదా?
బద్వేల్ఉపఎన్నికలో ఓడిపోతారన్నభయంతోనే టీడీపీ పోటీ చేయడం లేదని కన్నబాబు చెప్పడం సిగ్గుచేటు. ఉమ్మడిరాష్ట్రంలో రాగ్యానాయక్ అనేఎమ్మెల్యే అభ్యర్థిని నక్సలైట్లు కాల్చిచంపితే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోఉన్నా, టీడీపీ ఉపఎన్నిక బరిలో నిలవలేదు. తిరుపతిఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డి కాళ్లు పిసికేవ్యక్తిని వైసీపీ పోటీకి నిలిపింది కాబట్టే, టీడీపీ బరిలో నిలిచిం ది.
చనిపోయినవారి కుటుంబసభ్యులు పోటీలో ఉంటే, ఎన్నికల్లో నిలబడకూడదనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. టీడీపీకి కొన్నినియమాలు, సంప్రదాయాలున్నాయి. వాటిని ఎప్పుడూ పాటిస్తూనే ఉంటుంది. వైసీపీ నంద్యాలఉపఎన్నికలో ఎందుకు పోటీలో నిలిచిందో కన్నబాబుచెప్పాలి? నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు గతంలో వైసీపీకి ఎందుకుకర్రుకాల్చి వాతపెట్టా రో కన్నబాబుకి తెలియదా? పిల్లిశాపాలకు, ఉడతఊపులకు తెలుగుదేశంపార్టీ భయపడదని కన్నబాబు గుర్తుంచుకోవాలి.

Leave a Reply