మద్య విమోచన కమిటీ సక్రమంగా పనిచేస్తే యువత డ్రగ్స్ కు ఎందుకు బానిసలవుతారు ?

– లక్ష్మణ రెడ్డిని రెన్యూవల్ చేసే వరకు మద్య విమోచన కమిటీ ఉన్నట్టే ప్రజలకు తెలీదు
– మద్య విమోచన కమిటీని మద్యం ప్రమోషన్ కమిటీగా మార్చారు
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ముఖ్యమంత్రి జగన్ ఓ వైపు మద్యం అమ్మకాల్సి ప్రోత్సహిస్తూ మరో వైపు మద్య విమోచన కమిటీ పేరుతో తన సామాజికవర్గం వారికి ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. మద్య విమోచణ ప్రచార కమిటి చైర్మన్ గా లక్ష్మణ రెడ్డిని ప్రభుత్వం పొడగించింది. ఆయనకు నెలకు రూ. 2 లక్షల వేతనం మరియు ఇతర అలవెన్సులకు రూ. 1.80 లక్షలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఈ జీవో జారీ చేసేవరకు రాష్ట్రంలో మద్యపాన విమోచన కమిటీ ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలీదు.
మద్య విమోచన చైర్మన్ గా లక్ష్మణ రెడ్డికి ప్రభుత్వం నెలకు రూ. 3.80 లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ ఆయన ఇప్పటి వరకు మద్యపాన విమోచన చైర్మన్ గా రాష్ట్రంలో మద్యపాన నిషేదానికి చేసిన కృషి ఏంటి? రాష్ట్రంలో మద్య వినియోగం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ కమిటి సక్రమంగా తమ విధులు నిర్వహిస్తే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కు యువత ఎందుకు బానిసలుగా మారుతారు? జగన్ మద్యపాన విమోచణ కమిటీని మద్యం ప్రమోషన్ కమిటిగా మార్చారు.
ఈ రెండున్నరేళ్లలో ఈ కమిటీ ఏం చేసిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. మద్యపాన నిషేదంపై గతంలో చీటికి మాటికి రోడ్డెక్కి మాట్లాడే లక్ష్మణరెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? మీ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని మౌనం వహించారా? మద్యపాన నిషేదంపై జగన్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? జగన్ మద్య పాన నిషేదం చేయకపోగా రాష్ట్రాన్ని మద్యం, డ్రగ్స్ మాఫియాలకు కేంద్రంగా మార్చారు.

Leave a Reply