Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి దోపిడీకి ప్రజలతోపాటు,పరిశ్రమలవారు బలవుతున్నారు

– ప్రతిపక్షంలోఉన్నప్పుడు రూపాయికూడా విద్యుత్ ఛార్జీలుపెంచనన్న జగన్మోహన్ రెడ్డి, నేడు తన జేట్యాక్స్ కోసం రూ.7,500కోట్ల భారాన్ని సామాన్యులు, రైతులపై మోపాడు
– మాజీ శాసనసభ్యులు బీసీ.జనార్థన్ రెడ్డి
విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీప్రభుత్వం, సామాన్యులు, రైతులపై చెప్పలేనంతభారం మోపిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పు డు రూపాయికూడా ప్రజలపైభారం వేయని టీడీపీప్రభుత్వంపై నిందలేసిన జగన్మోహన్ రెడ్డి, బాదుడేబాదుడంటూ దుష్ప్రచారం చేశాడని టీడీపీనేత, మాజీశాసనసభ్యులు బీ.సీ.జనార్థన్ రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జా తీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు ఎందుకు పదేపదే కరెంట్ ఛార్జీలు పెంచు తున్నాడో సమాధానంచెప్పాలని మాజీఎమ్మెల్యే డిమాండ్ చేశా రు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినపాపానికి నేడు ప్రజలు ఇళ్లల్లో ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే భయపడుతున్నారని జనార్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెలగడిచేసరికి ఎన్నివేలరూపాయల విద్యుత్ బిల్లు వస్తుందోనన్నభయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారన్నారు. ఆఖరికికరోనా సమయంలోకూడా ఈముఖ్యమంత్రి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలనడ్డి విరగ్గొట్టాడన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపురూపంలో రూ.7,500కోట్లవరకు భారంమోపిన జగన్మోహన్ రెడ్డి, అంతటితో ఆగకుండా నిత్యావసరాల ధరలుకూడా విపరీతం గా పెంచేశాడన్నారు. 2014కు ముందు ఉమ్మడిరాష్ట్రం విద్యుత్ లోటుతో అల్లాడిందని, చంద్రబాబునాయుడుగారు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని విద్యుత్ లోటునుంచి మిగులు విద్యుత్ ఉన్నరాష్ట్రంగా మలిచాడన్నారు. సామాన్యప్రజలతో పాటు రైతులను కూడా వదలకుండా వారు పొలానికి వాడుకునే మోటార్లకు మీటర్లుబిగించేపనిలో జగన్ ప్రభుత్వం నిమగ్నమవ డం బాధాకరమని జనార్థన్ రెడ్డి వాపోయారు. ఇదివరకు ప్రజలపై మోపిన రూ.7,500కోట్ల విద్యుత్ ఛార్జీలభారం చాలదన్నట్లు, ఈ ముఖ్యమంత్రి కొత్తగా ట్రూఅప్ ఛార్జీలపేరుతో అదనపువసూళ్లకు పాల్పడుతున్నాడన్నారు. మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి 50లక్షలమంది రైతులప్రాణాలతో చెలగాటమాడు తున్నాడన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనను లాభసాటి వ్యాపారం గా మార్చాడన్న జనార్థన్ రెడ్డి, నిత్యావసరాలధరలతోపాటు, మద్యం, ఇసుక, సిమెంట్ ధరలుపెంచడమే అందుకు నిదర్శనమన్నారు.
టీడీపీప్రభుత్వం రూపాయికూడా విద్యుత్ ఛార్జీలు పెంచక పోయినా జగన్, అతని అనుకూలమీడియాకావాలనే విషప్రచారం చేసిందన్నారు. పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ధరలనుకూడా జగన్ ప్రభుత్వం దారుణంగా పెంచేసిందని, దానివల్ల ఏపీకి కొత్తపరిశ్రమ లు రావడం సంగతి అటుంచి, ఉన్నవే మూతపడే పరిస్థితి నెలకొం దన్నారు. కంపెనీలు, పరిశ్రమలకిచ్చే విద్యుత్ ధరపెంచడం వల్ల అవి తయారుచేసే వస్తువులధరలుపెరిగాయని, తద్వారా అంతి మంగా ఆ భారాన్నికూడా ముఖ్యమంత్రి ప్రజలపైనే వేశాడన్నారు.
ఎవరు ఎక్కడపోయినా, ప్రజలు పూర్తిగా నాశనమవుతున్నా, ముఖ్యమంత్రి తనజేట్యాక్స్, కమీషన్లకోసమే విద్యుత్ ఛార్జీలుపెం చాడని మాజీఎమ్మెల్యే మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపెంపుతో ప్రజలపై జగన్ ప్రభుత్వంఅదనపు భారంమోపడాన్ని టీడీపీ తీవ్రం గా వ్యతిరేకిస్తోందన్న జనార్థన్ రెడ్డి, కరెంట్ ఛార్జీలపెంపును నిరసి స్తూ, రాబోయేరోజుల్లో తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీఎత్తున నిరసనకార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. ఒకచేత్తో పైసా ఇస్తున్న జగన్ ప్రభుత్వం, ప్రజలనుంచిరెండుచేతులతో వేలకోట్లు వసూలుచేస్తోందన్నారు.జగన్మోహన్ రెడ్డి మాయమాట లు నమ్మి మోసపోయినప్రజలకు ఇప్పటికే వాస్తవాలు భోదపడ్డా యని, ఆ వాస్తవాలే భవిష్యత్ లే జగన్ ప్రభుత్వపునాదులు కదిలి స్తాయని టీడీపీనేత తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE