ఏపీ ప్రభుత్వం మరో రూ.900 కోట్ల అప్పు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి

రేపు అనగా 28.02.2023 వ తేదీన ఏపీ ప్రభుత్వం మరో రూ.900 కోట్ల అప్పు తీసుకురానుంది. దీనితో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన అప్పు రూ. 84,400 కోట్లు. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రం ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత అప్పు చేయలేదు.

మొత్తం ఆంధ్ర ప్రదేశ్ మీద ఉన్న అప్పు ఈ రోజుకి రూ 10,20,373 కోట్లు. ఇందులో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 3 సంవత్సరాల 9 నెలల కాలంలో చేసిన అప్పు మరియు పెట్టిన బకాయిలు రూ 6,57,998 కోట్లు.

మన దేశ చరిత్రలో ఇంత మొత్తంలో ఇంత తక్కువ సమయంలో అప్పు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి పౌరుడి మీద ఉన్న అప్పు దాదాపు రెండు లక్షల రూపాయలు. ఇంత అప్పు చేసిన సకాలంలో జీతాలు ఇవటంలేదు. రాష్ట్రం ఆర్థికంగా చాలా గడ్డు పరిస్థితిలో ఉంది.

Leave a Reply