– టిడిపి ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి
– ఎస్సీలకు చెందిన ఎసైన్డ్ భూములను జగనన్న కాలనీల పేరుతో లాక్కొన్నారు
– శానం బట్ల టిడిపి యువనేత నారా లోకేష్ కలిసి సమస్యలను విన్నవించిన చంద్రగిరి మండల దళితులు
• దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మాకు తీరని ద్రోహం చేశారు.
• మాకు చెందాల్సిన వేలకోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు.
• గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేశారు.
• చంద్రగిరి మండలంలోని శానంబట్ల, తొండవాడ గ్రామాల్లో ఎస్సీలకు చెందిన ఎసైన్డ్ భూములను జగనన్న కాలనీల పేరుతో లాక్కొన్నారు.
• ఎస్సీల శ్మశాన వాటికకు సంబంధించిన భూమిని సైతం వదలకుండా కబ్జాకు ప్రయత్నిస్తూ దారి లేకుండా చేస్తున్నారు.
• మాకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టడమేగాక దాడులకు తెగబడుతున్నారు.
• పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు గత ప్రభుత్వం అమలుచేసిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని రద్దుచేశారు.
• ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, ఎటువంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు.
• ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి దళిత నిరుద్యోగులను మోసగించారు.
• తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దళితుల సమస్యలను పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ఎస్సీ, ఎస్టీ, బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిపైనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ దళితులపాలిట యముడిగా మారారు.
• ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎస్సీలపై ప్రయోగించి దళిత రైతులపైనే ప్రయోగించి బేడీలు వేసిన నీచుడు జగన్ రెడ్డి.
• మాస్కు అడిగినందుకు విశాఖలో డా. సుధాకర్ ని పిచ్చోన్ని చేసి చంపారు.
• ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు రాజమండ్రిలో వరప్రసాద్ కి శిరో ముండనం చేశారు.
• చిత్తూరులో మద్యం మాఫియాని ప్రశ్నించిని ఓం ప్రతాప్ ని హతమార్చారు.
• మాస్కు పెట్టుకోలేదనే సాకుతో చీరాలలో కిరణ్ ని కొట్టి చంపారు.
• జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని తీరని అన్యాయం చేశారు.
• ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన ఎస్సీలకు చెందిన ఎసైన్డ్ భూములను జగనన్న కాలనీల పేరుతో లాక్కొన్నారు. .
• తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్న దళితులపై తప్పుడు కేసులు బనాయించడం, దాడులకు తెగబడటం వైసిపి ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారింది.
• దళితుల కోసం గత టిడిపి ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం.
• ఎస్సీ కార్పొరేషన్ కు నిధులిచ్చి దళితుల స్వావలంబనకు కృషిచేస్తాం.
• ఎస్సీ, ఎస్టీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిన తప్పుడు కేసులను ఎత్తేస్తాం.