Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ మాఫియా లింకులపై ముఖ్యమంత్రి,డీజీపీఎందుకు దృష్టిపెట్టడంలేదు?

– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర
గతనెల 20వతేదీన గుజరాత్ లోని ముంద్రాపోర్టులో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాక, రాష్ట్రప్రభుత్వ స్పందన, పోలీస్ అధికారుల వ్యాఖ్యలు డ్రగ్స్ వ్యవహారాన్ని పక్కదోవపట్టించేలా ఉన్నాయని, విజయవాడకమిషనర్ తో పాటు, డీజీపీ వ్యాఖ్యలు ప్రభుత్వపెద్దలను కాపాడటానికే మాట్లాడరన్నది స్పష్టమవుతోంద ని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
మాదకద్రవ్యాలు పట్టుబడిన తరువాత 24గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ముంద్రాపోర్టులో పట్టుబడిన హెరాయిన్ టాల్కమ్ పౌడర్ రూపంలో దొరికిందని, అది ఢిల్లీకి పంపాల్సినదని చెప్పారు. ఆ మాట కమిషనర్ కు ఎవరుచెప్పారని తాము ప్రశ్నిస్తున్నాం. విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ పేరు తో ముంద్రాపోర్టులో పట్టుబడినహెరాయిన్ కు, సదరు కంపెనీకి సంబంధంలేదని కమిషనర్ ప్రకటించడం చాలాఆశ్చర్యంగా ఉంది.
కేవలం విజయవాడ చిరునామా మాత్రమే ఉందని, డ్రగ్స్ కు బెజ వాడకు ఎలాంటి సంబంధంలేదనికూడా పోలీస్ కమిషనర్ చెప్పా రు. సదరు అషీ ట్రేడింగ్ కంపెనీ రిజిస్టర్ అయిన 2019-20 నుంచి ఒక్కనెలతప్ప, ప్రతినెలా జీఎస్టీ ఫైల్ చేసింది నిజమో, కాదో పోలీస్ కమిషనర్ చెప్పాలి. అషీ ట్రేడింగ్ కంపెనీ, విజయవాడకేంద్రంగానే, వ్యాపారకార్యకలాపాలు నిర్వహించిందని చెప్పడానికి ఇంతకంటే ఏం అధారాలుకావాలని తాము పోలీస్ శాఖనుప్రశ్నిస్తున్నాం.
కమిషనర్ అలా మాట్లాడితే డీజీపీ ప్రకటన మరింత విడ్డూరంగా ఉంది. కొందరు రాజకీయపార్టీలవ్యక్తులు కావాలనే అసత్యప్రచారం చేస్తున్నారని, సదరు కంపెనీ ముఖ్యమంత్రిఇంటికి సమీపంలో ఉందని మాట్లాడటంసరికాదని డీజీపీచెప్పడం సిగ్గుచేటు. మాదక ద్రవ్యాలమాఫియాలతో పాటు, రాష్ట్రంలో జరిగే హత్యలు, అత్యాచా రాలు, ఇతర సంఘవ్యతిరేకఘటనలను ఎత్తిచూపడమే ప్రతిపక్షా ల యొక్కబాధ్యతనే వాస్తవాన్ని డీజీపీఎలా విస్మరిస్తారు? ప్రతిప క్షంచెప్పినదానిలో వాస్తవమెందనే దాన్ని విచారించాల్సిన తన బాధ్యతను వదిలేసిన డీజీపీ, అధికారపార్టీలోని పెద్దలను కాపాడ టానికి చేసినప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మత్తుమందు మాఫియా మూలాలను కనిపెట్టి, అసలు దోషులను శిక్షించాల్సినవారే తప్పుదోవపట్టించేలాప్రకటనలుచేస్తే, వాస్తవాలు ఎలాబయటకు వస్తాయని తాముప్రశ్నిస్తున్నాం.
ముఖ్యమంత్రిగారు నిన్న శాంతిభద్రతలకు సంబంధించి చేసిన సమీక్షలో, ప్రతిపక్షాలు కావాలనే అసత్యప్రచారంచేస్తున్నాయని అన్నట్లుగా విన్నాం. ఆస్థాయిలో ఉన్నవ్యక్తే అలా మాట్లాడటం చాలాచాలా విచిత్రంగాఉంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రూ.9500కోట్లకుపైగా విలువైన మత్తుపదార్థాల కంటెయినర్ ను పట్టుకున్నారు. దానితోపాటు, విజయవాడచిరునామాతో ఉన్న అషీ ట్రేడింగ్ కంపెనీ ఏదైతేఉందో, దానిపేరుతో ఉన్న రూ.75కోట్ల విలువైన 22కంటెయినర్లహెరాయిన్ అక్కడికి వచ్చింది.
ఆ మొత్తం హెరాయిన్ విజయవాడ చిరునామాతో వస్తే, ముఖ్యమం త్రిగారికి అదిచాలా చిన్నవిషయంలా కనిపించడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ప్రజలుఎన్నుకున్న నాయకు డిగా వెంటనేస్పందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? అలా కాకుండా దొంగలుపడిన ఆర్నెల్లకు ముఖ్యమంత్రి స్పందించి, సమీక్షలో ఏదేదో చెప్పారు. రాష్ట్రంలోగంజాయి ఉండకూడదు.. మాకద్రవ్యాలు ఉండకూడదు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వాటి ఆనవాళ్లుకనిపించకూడదని చెప్పడం చూస్తుంటే నిజంగా నవ్వొస్తోంది. ముఖ్యమంత్రి మాటల్లో ఆయనచెప్పకనే చెప్పారు..
రాష్ట్రంలో గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు విస్తృతంగా చలామణీ లోఉన్నాయని. రాష్ట్రం గంజాయి, ఇతరమాదకద్రవ్యాలకు అడ్డాగా మారిందని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో ఏమూల మాదకద్రవ్యాలు, గంజాయి పట్టుబడినా దానిమూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నది వాస్తవమా…కాదా? వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి సాగు రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది వాస్తవమా…కాదా? దాదాపు 15వేలఎకరాల్లో గంజాయి సాగవుతున్నది నిజమా కాదా అని తాముప్రశ్నిస్తున్నాం.
గంజాయిసాగు,దాని అక్రమరవాణా, ఇతరత్రా వ్యవహారాల్లో అధికాపార్టీ నేతల హస్తమున్నమాట నిజమా, కాదా? గ్రామస్థాయి నాయకులు మొదలు రాష్ట్రస్థాయినేతలవరకు అధికారంలోఉన్న వారి కనుసన్నల్లోనే రాష్ట్రంలోగంజాయి సాగు, రవాణా జరుగుతోం ది. కానీ ఇవేవీ ముఖ్యమంత్రి గారికి కనిపించవు. ఆయన నిర్వహించిన సమీక్షలో వారిపేర్లు మాత్రం బయటకురావు. గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యవహారంలో మునిగితేలుతున్న అధికారపార్టీనేతలు దర్జాగా కాలర్ ఎగరేస్తూ తిరుగుతున్నారు.
కాకినాడ సముద్రతీరంలో ఒక బోట్ తగలబడింది. దాన్నిచూసిన ప్రత్యక్షసాక్షులు తగలబడిన బోట్ నుంచి వచ్చిన పొగవాసన చాలా భిన్నంగా ఉందని, అదిసాధారణ బోట్ కాదనిచెబుతున్నా రు. కానీ సదరు ఘటనలో పోలీసులు నమోదుచేసిన ఎఫ్ ఐఆర్ చూస్తే, చేపలవేటకువెళ్లిన వ్యక్తి వలవేస్తే, ఆబోటు తిరగబడి సదరు వ్యక్తిచనిపోయాడని రాశారు. కాకినాడతీరంలో తగలబడిన బోటుప్రమాదంపై ఎందుకు పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేయాలేదు. దాన్నిచూసినవారిని ఎందుకువిచారించలేదు? గంజా యి, ఇతరమాదకద్రవ్యాల వ్యవహారం రాష్ట్రంలోఎప్పుడైతే బయట కు వచ్చిందో, అప్పటినుంచే బోట్లు (పడవలు) తగలబడుతున్నా యి. కానీ పోలీసులు ఎక్కడా బోటు తగలబడిందని రాయకుండా, తిరగబడింది అని ఎఫ్ఐఆర్ లో రాస్తున్నారు. దాన్నిబట్టే చెప్పొచ్చు.. అధికారపార్టీనేతలకు, పోలీస్ అధికారులకు ఎంత మంచి బంధముందో?
పడవలతోపాటు కొన్నిచోట్ల గోదాములు కూడా తగలబడ్డాయని సమాచారం. అదివాస్తవమోకాదో, పోలీసు లే చెప్పాలి. గతంలో ఉన్నప్రభుత్వాలు ఎక్సైజ్ శాఖసాయంతో ఎక్కడికక్కడ రాష్ట్రంలో గంజాయి సాగు, దానిఅమ్మకాలు, లేకుండా చేశాయి. చాలాప్రాంతాల్లో గంజాయితోటలు తగల బెట్టడం, నిందితులను అరెస్ట్ చేయడం జరిగేవి. కానీ ఈప్రభుత్వం వచ్చాక సదరుఎక్సైజ్ విభాగానికి పెద్దగా పనిలేకుం డాపోయింది. దానిస్థానంలో ఈప్రభుత్వం ఎస్ఈబీని ఏర్పాటుచేసి, తమకు అనుకూలమైనవారు ఈ వ్యవహారంలో ఇబ్బందిపడకుండా చేస్తోంది.
ఎక్సైజ్ వ్యవస్థ నిర్వీర్యమవబట్టే, రాష్ట్రంలో గంజాయి మాఫియా పేట్రేగిపోతోంది. మరీముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో సాగయ్యే గంజాయికి దేశవ్యాప్తంగా మంచిగిరాకీ ఉంది. అక్కడ సాగయ్యే గంజాయి, దానిఅక్రమరవాణా, అమ్మకాలు అన్నీ అధికారపార్టీ నేతలకనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇలా జరుగుతుంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలేమోమరోరకంగాఉన్నాయి. కేవలం గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యవహారంలో తలమునకలై ఉన్న తనపార్టీ వారిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అలా మాట్లాడారు. ఏది అవాస్తవం..ఏది అసత్యమో ఆయన వివరంగా చెప్పాల్సింది.
విజయవాడ చిరునామాతో గుజరాత్ లోని ముంద్రా పోర్టు లో హెరాయిన్ పట్టుబడింది అవాస్తవమా? అక్కడపట్టుబడిన హెరాయిన్ విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో ఉండటం అవాస్తవమా? విజయవాడచిరునామాతోనే జీఎస్టీలు ఫైల్ చేసింది నిజమా..కాదా? అదే అషీ ట్రేడింగ్ కంపెనీవారు, రూ.75కోట్లవిలువైన 22హెరాయిన్ కంటెనర్లను రాష్ట్రానికి దిగుమతిచేసుకున్నది నిజమా…కాదా? అషీట్రేడింగ్ కంపెనీ యజమానిగా ఉన్నసుధాకర్ చాలాసామాన్యమైన వ్యక్తి, అతనొక్కడే ఇంతపెద్దవ్యవహారం నడుపుతున్నాడంటే ప్రజలెవరూ నమ్మరు. చివరకు గుజరాత్ ముంద్రాపోర్టు కేంద్రంగా హెరాయిన్ తాలిబన్లనుంచి తాడేపల్లివరకు వచ్చింది.
ఇంతజరిగితే ఏపీ ప్రభుత్వంగానీ, పోలీస్ శాఖగానీఎందుకు సమగ్రమైనదర్యాప్తు జరపడంలేదు? వీటిగురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడ లేదు? అషీట్రేడింగ్ కంపెనీ సుధాకర్ ది కాకినాడ అని, అతను సముద్రపు డాన్ గా పిలవబడే అలీషా వద్దపనిచేసేవాడని, సదరు అలీషాకు, వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడిచంద్రశేఖర్ రెడ్డికి, అతని కుటుంబానికి మంచిసన్నిహిత సంబంధాలున్నాయని కూడా రకరకాల కథనాలువస్తున్నాయి. ఈ విధంగా పెద్దఎత్తున ఆరోపణలు వస్తుంటే, వాటిపై పోలీసులు కనీసంగా కూడా విచారణ జరపకుండా,రాష్ట్రంలో ఏమీజరగలేదని మాట్లాడుతున్నారంటే, ఈ దందాలో వారి పాత్రేమిటో స్పష్టమవుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే తానేదో ఐవరీకోస్ట్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నా నని కూడా చెప్పారు. సదరు ఐవరీకోస్ట్ ప్రాంతం మాదకద్రవ్యాలకు అడ్డాఅనే విషయంప్రపంచమంతా తెలుసు.
చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి ఎందుకెళ్లాడు..అసలుఏంచేస్తున్నాడనేది పోలీసులు తేల్చాలికదా? అవసరమైతే కేంద్రసంస్థలకు వివరాలు అందించి దర్యాప్తుకుసహకరించాలి కదా? కానీ అదేమీ జరగడంలేదు. కానీ కాకినాడలోఎవరు కన్నుమూయాలన్నా.. ఎవరు కన్నుతెరవాల న్నా… ఎవరు ఊపిరితీయాలన్నా.. వదలాలన్నా… చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులుండాల్సిందేనని, అక్కడివారే చెబుతారు. అలాంటి వ్యక్తిపేరు బయటకువచ్చినప్పుడు, అతనికి అండగాఉన్న పెద్దవ్యక్తుల పేర్లు బయటపడినప్పుడు, పోలీసులు ఏమీవిచారించ కుండా, ఏంజరగలేదని సర్టిఫై చెయ్యడాన్నిబట్టే, అర్థమవుతోంది. పోలీస్ యంత్రాంగం ఈ డ్రగ్స్ మాఫియాలో భాగస్వాములైన అధికారపార్టీ వారిని కాపాడేప్రయత్నంచేస్తోందని సుస్పష్టమవుతోంది.
గంజాయి సహా, గుట్కా, మట్కా, ఇతరప్రాణాంతకమైన మాదకద్ర వ్యాలన్నింటికీ ఆంధ్రప్రదేశే అడ్డాగా మారిందనేది వాస్తవం. ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లే ప్రతిఒక్కరిపై అక్కడి పోలీసులు నిఘాఉంటోంది. అది..నిజమా..కాదా? మొన్నీమధ్యనే సూర్యాపేట పోలీసులు రాష్ట్రసరిహద్దులో గంజాయిపట్టుకుంటే, దానిలో ఒకప్రముఖవ్యక్తి కుమారుడి పేరుబయటపడింది. రైల్లోకూడా తెలంగాణపోలీసులు గంజాయి పట్టుకున్నారు. నిన్నగాక మొన్న గుంటూరులో లిక్విడ్ గంజాయి పట్టుకున్నారు. ఇంతదారుణంగా రాష్ట్రంకేంద్రంగా గంజాయి,ఇతరమాదకద్రవ్యాల వ్యాపారం భారీఎత్తునజరుగుతుంటే, ముఖ్యమంత్రి గారి అంతా ప్రతిపక్షాల అసత్యప్రచారమని చెబుతున్నారు. డీజీపీఏమో రాష్ట్రానికి అసలు సంబంధమే లేదంటున్నారు. ఈప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్రనటించేవారిని ఎవరూ లేపలేరు.
పంజాబ్ ఎలాగైతే డ్రగ్స్ కు అడ్డాగామారి, అక్కడియువత ఎలా పెడదారిపట్టి, చివరకు అంతిమంగా సదరు రాష్ట్రంఎలా నాశనమైం దో అందరూ చూశారు. ఆ ఆందోళనతోనే , బాధ్యత గలప్రతిపక్షం గానే తాముప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలోఎక్కడా గంజాయి సాగు, అమ్మకాలు, హెరాయిన్ ఇతర మత్తుమందు అమ్మకాలు, గుట్కా, మట్కా, జూదం వంటివిలేవని డీజీపీ గుండెలపై చెయ్యేసుకొనిచెప్పగలరా? ఎంతమంది విద్యార్థులు గంజాయివాడకం, దానిసాగులో పడి జీవితాలు నాశనంచేసుకుంటున్నారో ప్రభుత్వానికి తెలుసు. ఆ వివరాలన్నీ బయటపెట్టగల దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి, పాలకులకు ఉందా? ఉద్యోగాలు, ఉపాధిలేక యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనంచేసుకుంటుంటే, ముఖ్యమంత్రిచోద్యం చూస్తున్నారు.
ఏ యువతైతే ముఖ్యమంత్రికి ఓట్లేశారో, అదే యువత నేడు మాదకద్రవ్యాలమత్తులో జోగుతోంది.ఇవన్నీచూశాకైనా ముఖ్యమంత్రి గారు నిద్రనటించడం మానాలి. ఇన్నిఘటనలు, వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నాకూడా ఆయన తనపద్ధతి మార్చుకోకుండా నటిస్తానంటే కుదరదు. యువతబతుకులు మద్యం, మాదకద్రవ్యాలకు బలైపోతుంటే, ముఖ్యమంత్రి పట్టించు కోరా? పట్టించుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఏప్రజలైతే తమబతుకులు మారుస్తాడనినమ్మి, అధికారమిచ్చారో, అదే వ్యక్తి ప్రజలబతుకులు బుగ్గిఅవుతున్నా, సర్వనాశనమవుతున్నా స్పందించకపోవడం చాలాబాధాకరం.
గంజాయి, డ్రగ్స్ వ్యవహారం లో చాలామందిపెద్దలపేర్లు, మరీముఖ్యంగా ముఖ్యమంత్రికోటరీ లోఉన్నవారిపేర్లే బయటకువస్తున్నాయి. కాబట్టి ఈ వ్యవహారంపై సమగ్రస్థాయిలో దర్యాప్తుజరిపించాల్సిన బాధ్యత, కర్తవ్యం ముఖ్య మంత్రిపైనే ఉన్నాయని స్పష్టంచేస్తున్నాం. కేంద్రప్రభుత్వ ఏజెన్సీలు కూడా దేశంలోఎక్కడాలేని విధంగా ఏపీకేంద్రంగా సాగుతున్న మాదకద్రవ్యాలదందాపై దృష్టిపెట్టాలని కూడా కోరుతున్నాం. మాదకద్రవ్యాలు, మద్యంఅమ్మకాలతో పోగవు తున్న డబ్బే, రాష్ట్రప్రభుత్వాలద్వారా నక్సల్స్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చేరుతున్నాయనేది వాస్తవం. దానిపైకూడా కేంద్రం దృష్టిపెట్టాలి.

LEAVE A RESPONSE